Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మగవాళ్లు ఆడవాళ్లకు తరచుగా చెప్పే అబద్ధాలేంటో తెలుసా?
ఆడవారి నోట్లో నిజాలు, రహస్యాలు ఆగవని చాలా మంది అంటారు. అలాగే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా అబద్ధాలు చెబుతారని కూడా అంటారు. సమస్య నుండి బయటపడటానికో, భాగస్వామిని సంతోషపరచడానికో.. లేదా ఇంకేదైనా కారణం కావొచ్చు. కారణం ఏదైనా
ఆడవారి నోట్లో నిజాలు, రహస్యాలు ఆగవని చాలా మంది అంటారు. అలాగే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా అబద్ధాలు చెబుతారని కూడా అంటారు. సమస్య నుండి బయటపడటానికో, భాగస్వామిని సంతోషపరచడానికో.. లేదా ఇంకేదైనా కారణం కావొచ్చు. కారణం ఏదైనా అబద్ధం మాత్రం కామన్.

ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక ఉండదు. కానీ చాలా మంది పురుషుల మధ్య ఒక పోలిక ఉంటుంది. అదే ఆడవారికి అబద్ధాలు చెప్పడం.

మగవాళ్లు ఆడవాళ్లకు ఎలాంటి అబద్ధాలు చెబుతారంటే..
1. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా.. వచ్చేస్తున్నా
పురుషులకు ఇష్టం లేని కార్యక్రమానికి బలవంతంగా తీసుకువెళ్లాలనుకున్నా, ఏదో నచ్చని వ్యక్తులను కలవాలనుకున్నా చాలా మంది పురుషులు చెప్పే మాట ట్రాఫిక్‌లో చిక్కుకున్నా, హెవీ ట్రాఫిక్ ఉంది రావడానికి ఆలస్యం అవుతుందని చెబుతుంటారు.
నచ్చని కార్యక్రమానికి రాలేను అని డైరెక్ట్‌గా చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కారణాలు చెప్పి ఆలస్యంగా రావడానికి ప్రయత్నిస్తారు.

2. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను
పురుషులు చాలా తరచుగా చెప్పే అబద్ధాల్లో ఇది కూడా ఒకటి. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను, ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను అని చాలా మంది మగాళ్లు చెబుతుంటారు. కొందరి విషయంలో ఇది నిజమే కావొచ్చు. కానీ, చాలా మంది విషయంలో ఇది అబద్ధం.
భాగస్వామిని నొప్పించడం ఇష్టంలేక, ఏదైనా సందర్భంలో భాగస్వామిని ఆనందపరచడానికి, ఏదైనా తప్పు చేసినప్పుడు దాని నుండి తిట్లు పడకుండా ఉండేందుకు ఈ అబద్ధాన్ని తరచూగా చెబుతుంటారు.

3. నేను నీ కాల్ మిస్ అయ్యాను
ఫోన్‌లో బ్యాటరీ అయిపోయింది.. ఫోన్ సిగ్నల్ లేదు ఇలాంటి మాటలు చాలా మంది స్త్రీలు ఎన్నో సార్లు వినే ఉంటారు. ఫోన్ సైలెంట్‌లో ఉందని, బైక్ పై ఉన్నా ఫోన్ వినిపించలేదని, లేదంటే ఫోన్ ఆన్సర్ చేసే వీలు లేదని ఇలాంటి మాటలు చాలా మంది వింటారు.
కొన్ని సమయాల్లో వారితో మాట్లాడటం ఇష్టంలేకనో, లేదా వేరే పనిలో బిజీగా ఉండటం వల్లో వారు కాల్ చేసినప్పుడు స్పందించలేరు. దానికి ఇలాంటి కారణాలు చెబుతుంటారు.

4. మా టీంలో నాదే హైయెస్ట్ సాలరీ ప్యాకేజీ
చాలా మంది పురుషులు ఎంత సంపాదిస్తామనేది దాచి పెడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఎంత సంపాదిస్తున్నామన్నది చెప్పేందుకు ఇష్టపడరు. చేతినిండా సంపాదిస్తున్నామని, ఎలాంటి లోటూ ఉండదని, అన్ని రకాల ఎంజాయ్‌మెంట్స్ చేయవచ్చని చెబుతుంటారు.
డబ్బు సంపాదించే పురుషులు దానిని సీక్రెట్‌గా ఉంచుతారు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.

5. అప్పుడప్పుడే తాగుతుంటాను
చాలా మంది పురుషులు తాము తాగే ఆల్కహాల్ గురించి ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు. తక్కువే తాగుతుంటానని, ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగుతామని, ఏదైనా పార్టీ, ఈవెంట్, ప్రత్యేక సందర్భం సమయంలోనే ఆల్కహాల్ తీసుకుంటామని అంటారు.
తాగి వస్తే భాగస్వామి చేతిలో ఎక్కడ తిట్లు పడాల్సి వస్తుందోనన్న భయంతో ఇలాంటి అబద్ధాలు చెబుతుంటారు.

6. స్మోకింగ్ ఆపేశా
స్మోకింగ్ చేసే ప్రతి ఒక్కరూ చెప్పేమాట ఇది. స్మోకింగ్ ఆపేశానని, రోజూ ఒకటి రెండు కంటే ఎక్కువ తాగడం లేదని లేదంటే పార్టీల సమయంలోనే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు సిగరెట్ వెలిగిస్తామని అబ్బో ఇలాంటివి చాలానే చెబుతుంటారు.

7. నువ్వు లేక నేనుండలేను
నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రతి భర్త చెప్పే అత్యంత సాధారణ అబద్ధం ఇది. నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నువ్వు పుట్టింటికి వెళ్తుంటే నేనేం అయిపోవాలి.. పుట్టింటికి వెళ్లి త్వరగా వచ్చేయ్ ఇలాంటి మాటలు చాలానే విని ఉంటారు.



Click it and Unblock the Notifications