Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే
ఆమె హృదయాన్ని కరిగించండిలా
అవును, ఇది నిజమే. అమ్మాయిల హృదయాలు కరిగిపోతాయి. అమ్మాయిల హృదయాలలో స్థానం పొందాలంటే మీవంతు ప్రయత్నం కచ్చితంగా అవసరం. నిజాయితీగా ప్రేమించిన అమ్మాయికి చేరువకండి. చాలా మంది అబ్బాయిలు జిమ్ లో ఎక్కువ సమయం గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కొంత భాగం అమ్మాయిల హృదయాలను కరిగించి వారి హృదయంలో చోటు సంపాదించేందుకు ప్రయత్నించండి. మీ సంబంధ బాంధవ్యాలను గట్టి పరచుకోండి.
ఈ విషయంలో మీకు ఈ ఆర్టికల్ అవసరమైన టిప్స్ ఇస్తుంది. హడావిడిగా చదవకుండా, నిదానంగా చదవండి. మొదటగా, ఈ ఆర్టికల్ యొక్క భావాన్ని అర్థం చేసుకోండి. ఆ తరువాత పాటించండి. అమ్మాయిల సున్నిత హృదయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఈ టిప్స్ పాటించి ఆమెకు చేరువకండి. పొరపాటు చేతలతో మీ బాంధవ్యాన్ని కోల్పోకండి. జాగ్రత్తగా చదివి మీకు అనుగుణంగా ఉన్నవి ఆమె హృదయానికి చేరువ కావడానికి పాటించండి.

ఓదార్చమనండి
మీకు డిప్రెషన్ గా ఉన్నప్పుడు ఆమెకు తెలపండి. మిమ్మల్ని ఓదార్చమనండి. ఆమె ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ఓదారుస్తుంది. సంరక్షణ అనేది మహిళకు ఇష్టమైన అంశం. ఆమె మిమ్మల్ని అతి జాగ్రత్తగా చూసుకుంటుంది. పుట్టుకతోనే మహిళలకు అబ్బే సహజమైన లక్షణమిది. ఆమె వద్ద ఉపశమనం పొందేటప్పుడు ఆమెను ప్రశంసించడం మరువకండి.

మిగతా అమ్మాయిలను విమర్శించండి
ఒక అందమైన అమ్మాయి మీకు ఎదురైనా, మీ నెచ్చెలి ముందు ఆమె డ్రెస్ సెన్స్ దిగదుడుపేనని చెప్పండి. మీరు ఆమెకిచ్చే ప్రాధాన్యతను ఇటువంటి పరిస్థితులే నిరూపిస్తాయి. మిగతా వారికి మీరు ఆకర్షితులవటం లేదని తెలుసుకుని ఆమె సంతోషిస్తుంది.

ఆఘమేఘాలపై ఆమె ముందు వాలండి
ఎప్పుడైనా ఆమె మీతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు కొంచెం లో వాయిస్ వినపడినా, ఆమె ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకోండి. కారణం తెలుసుకోండి. ఆమె సంతోషం కోసం మీరు ఏది చేయడానికైనా సిద్ధమేనన్న భావన ఆమెకు కలుగుతుంది.

లేఖలు రాయండి
ఆమె కోసం మూడు నాలుగు గంటలు స్పెండ్ చేసి లెంతీ మెయిల్స్ రాయండి. ఆమె కోసం స్పెషల్ గా మెయిల్ రాయడానికి మీరు కేటాయిస్తున్న సమయం ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అర్థమయిందా..ఆమె హృదయాన్ని కరిగించడమెలాగో?

ఆమె వైపే చూడండి
మీరిద్దరూ కలిసి ఏదైనా మూవీ లేదా ఇంటరెస్టింగ్ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మీరు మాత్రం ఆమెనే చూడాలి. ఆ ప్రోగ్రాం కంటే ఆమే మీకు ఇంటరెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఇవన్నీ మీ ఇద్దరి మధ్యనున్న బంధాన్ని గట్టిగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

నెక్లెస్ బహుకరించండి
ఆమె హృదయాన్ని కరిగించడమెలాగో తెలుసా? చాలా సింపుల్. ఒక డైమండ్ నెక్లస్ ను బహుకరించండి చాలు. ఆమె హృదయం కరిగిపోతుంది. డబ్బుతో సంతోషాన్ని కొనలేమని భావించకండి. కొన్నిసార్లు కొనగలము. కాకపోతే డబ్బుని తెలివిగా ఖర్చు చేయాలి. మీ స్నేహితుల కోసం అనవసరంగా ఖర్చు చేసే బదులు మీ నెచ్చెలి కోసం సంతోషంగా ఖర్చు చేయండి.

ఆసక్తి కనబరచండి
ఆమె చేసే పనులపై ఆసక్తి కనబరచండి. తన కెరీర్ గురించి సంభాషించండి. మీరు ఆమె కెరీర్ ను గౌరవిస్తున్నారని ఆమెకు అర్థమవుతుంది. ఆమె హృదయాన్ని కరిగించడానికి ఇదొక అవకాశం.

పరోక్ష ప్రసంశలివ్వండి
ఆమె ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే ఆమె అందానికి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఆమె అంతందంగా ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించండి. ఆమె కొత్త డ్రెస్ వేసుకున్న విషయం మీరు గమనించనట్టే ఉంటూ 'ఇంత అందంగా ఉండడానికి కారణమేమిటి' అని అడగండి.

మసాజ్ చేయండి
ఆమె అలసిపోయినప్పుడు మసాజ్ చేయండి. ఆమెని మచ్చిక చేసుకోవడానికి ఇదొక అవకాశం. ఆమె హృదయాన్ని కరిగించే ఇటువంటి మంచి అవకాశాన్ని జారవిడుచుకోకండి. వెబ్ లో రిసెర్చ్ చేసి మసాజ్ లో బేసిక్స్ నేర్చుకోండి. మసాజ్ అంటూ ఆమెని ముప్పుతిప్పలు పెట్టకుండా మసాజ్ లో మెళకువలు తెలుసుకుని ఆమెకు మసాజ్ చేయండి. ఆమె శరీరాన్ని పూవులా చూసుకోండి.

హత్తుకోండి
ఆమె కొలీగ్స్ ముందు ఆమెను కిస్ చేయండి. మీ అభిమానాన్ని కమ్యునికేట్ చేయడానికి ఆ ముద్దును ఉపయోగించుకోండి. పబ్లిక్ లో ఓవర్ రొమాంటిక్ గా ఉండకండి. సింపుల్ హగ్ కూడా మీ ప్రేమను చాటుతుంది. ఆమెకు నచ్చుతుంది కూడా. ఆమె కొలీగ్స్ ముందు మీరు ఆమెపై మీ ప్రేమను చాటితే ఆమె మరింత సంతోషిస్తుంది. ఆమె హృదయాన్ని కరిగించడానికి ఇదొక మంచి అవకాశం.



Click it and Unblock the Notifications











