Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
అతను ముద్దివ్వబోతున్నాడనటానికి 10 సంకేతాలివిగో
ఎప్పుడైనా మీ దగ్గరకి ముద్దుపెట్టుకోవటానికి ఎవరైనా వచ్చారా??లేదా మీకు ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు ముద్దు పెట్టుకోవటానికి అని తెలియట్లేదా?? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
చాలామంది అబ్బాయిలకి తమ ప్రియురాళ్ళకి దొంగ ముద్దు ఇవ్వాలని ఉంటుంది.అదొక అధ్భుతమైన భావన కానీ చాలా మంది స్త్రీలకి ఇది నచ్చదు.ఈనాటి స్త్రీలు తమని ప్రియుడు ముద్దు పెట్టుకునే ముందు సంకేత మిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు , అకస్మాత్తుగా ఇచ్చే దొంగ ముద్దులు వారికి నచ్చట్లేదు.మీ ప్రియుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన సంకేతాలేమైన అతని నుండి వస్తున్నాయేమో చూడండి.
గమనిక: స్త్రీలు ఆ మొదటి ముద్దులోని మజా ఆస్వాదించాలంటే దిగువ పేర్కొన్న సంకేతాలని తెలుసుకుని ఉంటే మంచిది.ఆ పది సంకేతాలేంటో చూద్దామా..

కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం:
ప్రతీ మగాడు తమ ప్రియురాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి ఇష్టపడతాడు.ఒకవేళ అతను కనుక పదే పదే మీ కళ్ళని లేదా పెదాలనే చూస్తున్నట్లయితే అతను తప్పక మీకు దగ్గరగా జరిగి ముద్దు ఇవ్వబోతున్నాడనే సంకేతం.

దూరాన్ని బట్టి అంచనా:
ఒక వేళ మీ ప్రియుడు మీకు ముద్దివ్వబోతున్నడో లేదో తెలుసుకోవాలంటే అతను ఎంత దూరం లో నిలబడ్డాడో చూడండి. దగ్గరగా ఉన్నాడంటే మీ అధరామ్రుతాన్ని రుచి చూడటానికి రెడీ అవుతున్నట్లే.మరి మీరు తయారా??

పొగడ్తలు:
మీరు అతని పొగడ్తల వర్షం లో తడిసి ముద్దవుతున్నారా??అంటే ఇదీ అతను ముద్దు పెట్టుకోబోతున్నాడనడానికి సంకేతమే.ఆ పొగడ్తలని జాగ్రత్తా గా గమనిస్తే మీకు క్లూ దొరుకుతుంది.

మీ పెదాలమేదే ద్రుష్టి సారిస్తే
కొంతమంది మగవారు తమ ప్రియురాలి పెదాలనే చూస్తారు.అతని చూపులుకనుక మీ పెదాల మీద ఉంటే ఇదీ ఒక సంకేతం కిందే లెక్క.

మిమ్మల్ని తాకుతున్నాడా..
ఒకవేళ అతను కనుక మిమ్మల్ని తాకుతున్నట్లయితే తప్పక మీకు ముద్దిస్తాడన్నమాటే.మిమ్మల్ని తాకుతున్నట్లయితే మీ అధరామృతాన్ని రుచి చూడాలనుకుంటున్నట్లే.

పదే పదే తన పెదాలని కొరకడం
ఒకవేళ పదే పదే అతను తన చేతి వేళ్ళని తన పెదాలమీద ఉంచుకుంటున్నా లేదా పెదాలని కొరుకుతున్నా తప్పక మీకు ముద్దివాలనుకుటున్నట్లే

మీ జుట్టులోకి వేళ్ళు పొనిస్తోంటే
అతనికి మీ జుట్టు చాలా అందం గా కనిపించి అందులో తన వేళ్ళు పోనిచ్చి అ వేళ్ళతో జుట్టుని వెనక్కి తోసి పట్టుకుంటున్నాడా?? అయితే తప్పక అది మీకు ముద్దివ్వడానికే

గొంతులో తడబాటు
నిపుణుల అంచనా ప్రకారం మగవారి గొంతులో అకస్మాత్తుగా మార్పొచ్చిందంటే మీ దగ్గరగా వచ్చి మీకు ముద్దివ్వడానికి సన్నద్ధమవుతున్నట్లే

సౌకర్యవంతంగా కూర్చోవడం
అతను మీ సమక్షంలో సౌకర్యవంతం గా ఉన్నాడంటే ఏ క్షణం లో అయినా అతని నుండి మీరు ముద్దు అందుకోవడానికి రెడీ అవ్వండి.ఏకాంతం గా ఉన్నప్పుడు అతను మీతో సౌకర్యవంతంగా ఉన్నాడంటే అది మీకివ్వబోయే ముద్దుకి సంకేతం

పెర్ ఫ్యూం ట్రిక్
మీకు దగ్గరగా జరిగి మీ పెర్ ఫ్యూం బాగుందని చెప్పాడా?? అది మీ పెర్ ఫ్యూం గురించిన పొగడ్త కాదు, మీకు దగ్గరగా జరిగి మీకు ముద్దివడానికి చేస్తున్న ప్రయత్నమది.



Click it and Unblock the Notifications