Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
రిలేషన్ లో భరించలేని, భరించకూడని 10 విషయాలు..!
ప్రేమ గుడ్డిది అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ.. బాయ్ ఫ్రెండ్ లేదా భాగస్వామి విషయంలో మాత్రం కొన్ని విషయాలను, తప్పులను, పొరపాట్లను మాత్రం గుడ్డిగా చూడకూడదు. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వాళ్లు.. కలిసి ఉన్నప్పుడు ఇది నిజమే అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు చాలా కామన్ గా ఉంటాయి.
అలాంటి సమస్యలను మౌనంగా భరించడం వల్ల రిలేషన్ కి అర్థం ఉండదు. రిలేషన్ షిప్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే ఒకరి తప్పులను ఒకరు గుర్తించాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది కపుల్స్ భాగస్వామి తప్పులను చూసినా పట్టించుకోరు. దీనివల్ల భవిష్యత్ లో పెద్ద పెద్ద తప్పులు చేసే అవకాశాలుంటాయి.
ఒకవేళ ఆమె లేదా అతను గంభీరంగా, క్రూరంగా మాట్లాడినా వాళ్లను వదులుకోవడం ఇష్టంలేక భరిస్తూ ఉంటారు. కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఎంతవరకు భరించాలి అనేది ఉంటుంది. కాబట్టి ఎలాంటి విషయాలను సహించకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. రిలేషన్ లో భరించలేని విషయాలపై అవగాహన ఉంటే.. దాన్ని కట్టడి చేయడం తేలికవుతుంది.

హింస
రిలేషన్ లో హింసను మాత్రం భరించకూడదు. మహిళ నుంచి అయినా, మగవాళ్ల నుంచి అయినా హింసను మాత్రం సహించకూడదు.

నిందించడం
శారీరకంగా హింసించినప్పుడు శరీరంపై గాయాలు ఉంటాయి. కానీ ఎమోషనల్ గా నిందించినప్పుడు దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని గుర్తించడం కూడా కష్టమే. చాలామందికి వాళ్లు ప్రతిరోజూ భరిస్తున్నారని తెలియదు. కాబట్టి ఇలాంటివి మొదట్లోనే గుర్తించాలి.

చీటింగ్
రిలేషన్ బలంగా ఉండాలంటే.. నమ్మకం అనేది పునాది లాంటిది. ఒకసారి ఇది బ్రేక్ అయింది అంటే.. మీ భాగస్వామిని మరోసారి నమ్మడం కష్టమవుతుంది. ఒకసారి మోసం చేసిన వ్యక్తిని మళ్లీ నమ్మడం చాలా కష్టమవుతుంది. వాళ్లు మారతారని మళ్లీ నమ్మకం కూడా ఉండదు.

ఫోర్స్డ్ సెక్స్
చాలామంది మ్యారిటల్ రేప్ అనే పదం విని ఉండరు. చాలామంది భర్తకు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు భార్య రెడీగా ఉండాలని భావిస్తారు. కానీ.. వద్దు అనడానికి మీకు హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే.. ఖచ్చితంగా చెప్పేయాలి.

దూకుడు స్వభావం
కొన్నిసార్లు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. సహనం కోల్పోయినప్పుడు ఇలాంటి పరిస్థితిని ఓర్చుకోవడం కష్టమవుతుంది. అరవడం, తిట్టడం, కామెంట్స్ ఇలాంాటి మాటలను భరించడం కష్టంగా ఉంటుంది. వీటిని రిలేషన్ లో ఏమాత్రం భరించలేనివి.

బాడీ షేమింగ్
మీ ఫ్రెండ్ ముందు మీ భాగస్వామి ఫ్యాట్ గా కనిపిస్తున్నారా ? అప్పుడు మీ గురించి, మీరు కనపడే విధానం గురించి వాళ్లు హేళన చేసి మాట్లాడుతున్నారా ? ఇలాంటప్పుడు చాలా షేమింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సహించడం ఎవరి వల్లా కాదు.

ప్రాధాన్యత
మీ భాగస్వామి మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే.. ఎవరూ భరించలేరు. మీ భాగస్వామి మీకున్న ఉన్న కమిట్ మెంట్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే భరించడం చాలా కష్టంగా ఉంటుంది.

కంట్రోల్
మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే.. మీ పేరెంట్స్, ఫ్రెండ్స్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలు మీ రిలేషన్ లో ఎదురవుతున్నాయంటే.. ఖచ్చితంగా వాటి గురించి క్లియర్ గా మాట్లాడాలి. వీటిని సహించడం చాలా కష్టం.

మీ ఆశయాలను తప్పుదోవ పట్టించడం
మీ ఆశయాలు, మీ డ్రీమ్స్ ని పట్టించుకోని, గౌరవం ఇవ్వని భాగస్వామిని భరించడం చాలా కష్టం. ఒకవేళ మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీ పార్ట్ నర్ ఇష్టపడటం లేదంటే.. రిలేషన్ ని వదులుకోవడమే బెటర్. లేదంటే.. ఇద్దరు కూర్చుని క్లియర్ గా మాట్లాడుకోవాలి.

అపద్ధాలు
పైపైన చెప్పే అపద్ధాలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకండి. హెల్త్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక విషయాల్లో అపబ్ధాలు చెబితే.. సహించడం కష్టం. కాబట్టి ఈ విషయాల్లో ఎప్పటికీ భాగస్వామితో అపద్ధాలు చెప్పకండి.



Click it and Unblock the Notifications