Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
పురుషులు తమ భాగస్వామిని అర్ధం చేసుకోవడం ఎలా
జెంటిల్మెన్, మీకు మీ భాగస్వాములని అర్ధం చేసుకోవడం కష్టంగా ఉందా?? ఏమీ బాధ పడద్దు, నూటికి 90 మంది పురుషులు ఈ విషయంలో ఫెయిలవుతారు.స్త్రీలు పురుషుల కంటే సునిశిత వాసన,దృష్టి ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి. అందువల్లే వారు ప్రతీదీ సమగ్రంగా ఉండాలనుకుంటారు( డీటెయిల్ ఓరియెంటెడ్).
మానసికంగా చూస్తే కూడా స్త్రీలు గిఫ్టెడ్ అనచ్చు.మానసికం గా ప్రభావం కలిగించే మాటలని, సంఘటనలనీ ఆమె ఎన్నడూ మర్చిపోదు కనుక మీ గొడవల మధ్యలో ఏమి మాట్లాడుతున్నారో కాస్త దృష్టి పెట్టి ఏది పడితే అది మాట్లాడకండి.ఆమె వాటిని ఎన్నటికీ మర్చిపోదు. ఒక స్త్రీని అర్ధం చేసుకోవాలంటే ముందు తెలుసుకోవాల్సిన సూత్రం అందరు స్త్రీలూ ఒకేలా ఉండరు.ఆమె సమాజంలో ఎన్నో ఒత్తిడిలని ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటిని గుర్తించండి.ఆమెని అర్ధం చేసుకోవాలంటే ఆమెని గమనించడం చాలా ముఖ్యం.వెంటపడినట్లుగా కాకుండా ఆమెని జాగ్రత్తగా గమనిస్తే మీ జీవిత భాగస్వామి మీకు అర్ధమవుతుంది.కనుక మీ జెవితంలో ఉన్న స్త్రీని ఎలా అర్ధం చేసుకోవాలో, గమనించాల్సిన ముఖ్య విషయాలేమిటో ఈరోజు మీకు అందిస్తున్నాము.

బాడీ లాంగ్వేజ్:
స్త్రీల బాడీ లాంగ్వేజ్ ని గమనించడం పురుషులకి చాలా ముఖ్యం. ఎందుకంటే స్త్రీలు తమ బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా సంకేతాలనిస్తారు.

మూడ్ స్వింగ్స్:
ఒక స్త్రీ కనుక చిరాగ్గా, మూడీగా ఉందంటే ఆమె ప్రీ మెన్‌స్ట్రూల్ సిండ్రోం లో(పీ. ఎం. ఎస్.) ఉందని గుర్తు.కానీ ఆమె కోపం, చిరాకు,విసుగు అన్నింటికీ కారణం హార్మోన్ల అసమతుల్యం అని పురుషులు భావిస్తారు.ఆమె మూడ్ స్వింగ్స్ కి మీరు కూడా ఒక కారణం అయ్యుండచ్చు కనుక ఆమె విసుగు, చిరాకుకి గల కారణం గురించి అతిగా ఆలోచించకపోవడమే మంచిది.

ఆమె స్నేహితులని గమనించండి:
మీ స్నేహితులని చూస్తే మీరేమిటో తెలుస్తుంది అన్న నానుడి తెలుసు కదా. ఈది ఎప్పటికీ పాత పడని నానుడే.ఆమె కనుక మంచి స్నేహితులని కలిగి ఉందంటే ఆమె కూడా మంచి గుణాలనే కలిగి ఉంటుంది.

ఆమె చెప్పేది వినండి:
ఆమె మీతో మాట్లాడేటప్పుడు ఆమె చెప్పేది వినడమే కాకుండా ఆమె నోటి నుండి వెలువడే మాటల మీద దృష్టి పెట్టండి. ఈలా అయితే ఆమెని అర్ధం చేసుకోవడం సులభం.

చిన చిన్న హావ భావాల మీద దృష్టి పెట్టండి:
చిన్న చిన్న విషయాలే స్త్రీలకి ఎంతో ముఖ్యమనిపిస్తాయి కనుక వాటి మీద దృష్టి పెట్టండి.ఆమెని పూర్తిగా అర్ధం చేసుకోవాలనుకుంటే చిన్న ప్రశంశనివ్వండి. ఆమె దానికి రియాక్ట్ అవ్వడం ఖాయ. అలాగే విమర్శించినప్పుడు ఆమె ప్రవర్తనని గమనించండి.చాలా మంది స్త్రీలకి విమర్శ నచ్చదు.

ఆమెతో మాట్లాడండి:
ఒక స్త్రీని అర్ధం చేసుకోవాలంటే ఆమెతో మనస్పూర్తిగా మాట్లాడటమే మార్గం.ఆమెకిష్టమైన ఒక అంశం లేవనెత్తి మాటలు మొదలుపెట్టండి.ఆమె భావాలని అర్ధం చేసుకుంటే కనుక ఆమె అర్ధం అవ్వడం సులభం.

ఇతరులతో ఆమె ఎలా మెలుగుతోంది:
ఆమె ఇతర స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటొందో గమనించండి. అలా అని ఆమెనే తేరిపారా చూస్తున్నట్లు కాకుండా ఆమెకి తెలియకుండా ఆమెని గమనించండి.ఇలా చేస్తే ఇతరులతో ఆమె ఎలా మెలుగుతోందో మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications