Latest Updates
-
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
మీ గర్ల్ ఫ్రెండ్ ని మరీ ఎక్కువగా పొగిడితే ఏమవుతుంది ?
అబ్బాయిలు ప్రేమలో పడితే.. ఇక ఆ అమ్మాయిలే లోకం. గర్ల్ ఫ్రెండ్ కోసం నానా హైరానా పడిపోతారు. వాళ్లను ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే.. కొంతమంది మరింత తెలివిగా.. ప్రవర్తిస్తారు. అదేనండి.. అమ్మాయిలను పొగడ్తలతో ముంచేస్తే.. తమకు బాగా ఎట్రాక్ట్ అయిపోతుందని భావిస్తారు.
అయితే అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు పొగుడుతారనే దానిపై సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అమ్మాయిల్లో డీప్ ఫీలింగ్స్ కలిగించడానికి అమ్మాయిలు ఇలా పొగడ్తల వర్షం కురిపిస్తారని.. సైన్స్ చెబుతోంది. ఇలా పొగుడ్తూ ఉండటం వల్ల అమ్మాయిలు హ్యాపీగా ఫీలవుతారు. అయితే.. మరీ ఎక్కువగా పొగిడేస్తే.. మీరు రిస్క్ లో పడతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కేవలం మెచ్యూర్ అయిన, తెలివైన అమ్మాయిలు మాత్రమే కాంప్లిమెంట్స్ ని ఎక్కువగా తలకు ఎక్కించుకోరు. కానీ కొంతమంది మహిళలు.. కాంప్లిమెంట్స్ ని రకరకాలుగా తీసుకుంటారు. కాబట్టి.. మరీ ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్ ని కూడా పొగడకూడదట. ఎందుకు పొగడకూడదో.. చూద్దాం..

తలపై కూర్చోవచ్చు
టీనేజ్ గర్ల్ ఫ్రెండ్ ని మరీ ఎక్కువగా పొగిడేస్తే.. ఆమె ఖచ్చితంగా.. మీ తలపై కూర్చుకుని.. మిమ్మల్ని కమాండ్ చేయడం మొదలుపెడతుుంది. కానీ అందరూ అమ్మాయిలు అలా కాదు. మెచ్యూర్డ్ గా ఆలోచించే అమ్మాయి.. దాన్ని విన్నట్టే విని వదిలేస్తుంది.

ఆశలేని వాడని భావించవచ్చు
ఆమెను నాన్ స్టాప్ గా పొగుడుతూ ఉంటే.. మిమ్మల్ని ఆశలేని వ్యక్తిగా, తెగించిన వాడిగా భావించే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ ఫుల్.

అడిక్ట్ అవవచ్చు
మనల్ని బాగా సంతోషపెట్టేవాళ్లకు మనం అడిక్ట్ అవుతూ ఉంటాం. ఒకవేళ మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే.. ఆమె మీ నుంచి చాలా అటెన్షన్ కోరుకుంటుంది. ఇది సంబంధాన్ని అన్ హెల్తీగా మారుస్తుంది.

చెడు ఉద్ధేశ్యం ఉందనుకోవచ్చు
కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కాంప్లిమెంట్స్ నే ఉపయోగించుకుంటారు. దీనివల్ల ఆమెకు మీపై చెడు ఉద్ధేశ్యం ఏర్పడే అవకాశం ఉంది.

చీప్ గా చూడవచ్చు
చిరాకు పుట్టించే, అనవసర కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే.. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీప్ గా చూడవచ్చు. కాబట్టి.. అవసరమైనంత వరకే.. కాంప్లిమెంట్స్ ఇవ్వండి.

జీవితాంతం పొగడాల్సి రావచ్చు
ఇది చాలా పెద్ద డేంజర్. ఒకవేళ ఆమెను మీరు పెళ్లి చేసుకుంటే.. మీరు ఆమెను జీవితాంతం పొగడాల్సి వస్తుంది. కాబట్టి.. ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తే బావుంటుందో.. గుర్తించి.. పొగిడితే.. ఎలాంటి సమస్యా ఉండదు.



Click it and Unblock the Notifications