అభిషిక్త్ భార్గవ్ ను నమ్మాను కానీ అతను నన్ను ఇలాంటి వాడి చేతిలో పెట్టాడు - My Story #39

Written By:
Subscribe to Boldsky

మా బావ పేరు అభిషిక్త్ భార్గవ్. అతను మా అమ్మ తమ్ముడు. నా మేనమామ. మా అమ్మనాన్న మాదిరిగానే నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చూసుకున్నాడు. మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురమూ ఆడపిల్లలమే. నేను రెండో ఆమెను.

మా అమ్మ మాటను కాదనడు

మా అమ్మ మాటను కాదనడు

మా అమ్మ అంటే అభిషిక్త్ భార్గవ్ కు చాలా ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణం. మా అమ్మ మాటను కూడా అభిషిక్త్ భార్గవ్ ఎప్పుడూ కాదనడు. అతనికి సొసైటీలో మంచి పేరుంది. మా కుటుంబం కష్టాల్లో ఉంటే ఎన్నో సార్లు అండగా నిలిచాడు కూడా.

అందర్ని వద్దన్నాడు.. మా అక్కను ఓకే అన్నాడు

అందర్ని వద్దన్నాడు.. మా అక్కను ఓకే అన్నాడు

అతనికి చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి. సమాజంలో మంచి గుర్తింపు ఉండి.. కోట్ల రూపాయలకు వారసురాళ్లుగా ఉండే అమ్మాయిలు కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. కానీ అతను వాటన్నింటినీ రిజెక్ట్ చేశారు. మా అమ్మతో ఉన్న అనుబంధంతో ఆమె మాటను కాదనలేకపోయాడు. మా అక్కను పెళ్లి చేసుకోడానికి ఓకే అన్నాడు.

మా అక్కతో పెళ్లి

మా అక్కతో పెళ్లి

అభిషిక్త్ భార్గవ్ అలియాస్ కాశీ (బాల సుబ్రహ్మణ్యం)తో మా అక్కపెళ్లయ్యింది. వారి సంసారం చాలా బాగుంది. వారికి ఒక కొడుకు, కూతురు. మా బావ అభిషిక్త్ భార్గవ్ ఏ ఒక్కరికీ హానీ చేయడు కాబట్టి అతనికి ఇంత వరకు అంతా మంచే జరుగుతుంది.

అండగా గోవింద భార్గవ్‌

అండగా గోవింద భార్గవ్‌

మా బావకు అండగా గోవింద భార్గవ్‌ అలియాస్ మురళీ ఉన్నాడు. మా బావ అతని దగ్గరే పని చేస్తాడు. అతనికి దేశం మొత్తం మీద చాలా కాలేజీలున్నాయి. అతనికి రైట్ హ్యాండ్ మా బావ. అతని కోసం ప్రాణమిచ్చేందుకైనా రెడీగా ఉంటాడు మా బావ. 24/7 గోవింద భార్గవ్‌ కు అభిషిక్త్ భార్గవ్ అండగా ఉంటాడు.

అంచెలంచెలుగా ఎదిగాడు

అంచెలంచెలుగా ఎదిగాడు

ఒకప్పుడు మా బావ అభిషిక్త్ భార్గవ్ చాలా సామాన్యుడు. ఒక చిన్న బిజిసెస్ నిర్వహించేవాడు. కానీ ఇప్పడు కోట్లకు పడలెత్తాడు. అలా అని ఆ డబ్బంతా అక్రమంగా సంపాదించినది కూడా కాదు. గోవింద భార్గవ్‌ దగ్గర నమ్మకంగా పని చేయడమే. అతనికి వచ్చిన లాభాల్లో మా బావ గోవింద భార్గవ్‌ కు కూడా నిజాయితీగా షేర్ ఇస్తున్నాడు.

మా ఇంటి బాధ్యతలు కూడా

మా ఇంటి బాధ్యతలు కూడా

మా బావ అభిషిక్త్ భార్గవ్ పై మా ఇంటి బాధ్యతలు కూడా పడ్డాయి. మా ఇంట్లో మగ పిల్లలు లేనందున అందులో మా అమ్మ అతని సొంత అక్క కావడం వల్ల మా కుటుంబం ప్రతి విషయంలో అభిషిక్త్ భార్గవ్ పైనే ఆధారపడేది. మా అమ్మానాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు. కానీ మా బావ అభిషిక్త్ భార్గవ్ ను అడగకుండా ఏ పని చేయరు. అందుకే అతనితో మాట్లాడారు.

ఏ సంబంధం తెచ్చినా ఓకే

ఏ సంబంధం తెచ్చినా ఓకే

మా బావ అభిషిక్త్ భార్గవ్ ఏ సంబంధం తెచ్చినా నేను చేసుకోవడానికి రెడీ అయ్యాను. ఎందుకంటే అతని ఎంపికకు నేను పేరు పెట్టలేను. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్తాయికి ఎదిగాడు. అతనికి ప్రతి విషయం తెలుసు. అందుకే అతని మాటను నేను కాదనకూడదని నిర్ణయించుకున్నాను.

సీతారామ్‌ అలియాస్ రామ్

సీతారామ్‌ అలియాస్ రామ్

అతని పేరు సీతారామ్ అలియాస్ రామ్. అతను మా బావ అభిషిక్త్ భార్గవ్ కు పరిచయం అయ్యాడు. "రామ్ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే యాక్సిడెంట్ లో అతను మరణించాడు. రామ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొని అతను నాన్న జాబ్ ను అతను తెచ్చుకున్నాడు. అతనికి కూడా సమాజంలో మంచి పేరుంది. అతను నిన్ను బాగా చూసుకుంటాడు. అతన్ని చేసుకోవమ్మా ". అని మా బావ అభిషిక్త్ భార్గవ్ చెప్పాడు.

అంగరంగ వైభవంగా పెళ్లి

అంగరంగ వైభవంగా పెళ్లి

నేను వెంటనే ఒకే అన్నాను. మా బావ అభిషిక్త్ భార్గవ్ తెచ్చిన సంబంధం అంటే పేరుపెట్టకూడదనుకున్నా. అబ్బాయిని కూడా చూడకుండానే ఒకే చేసేశాను. తర్వాత మా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. మా పెళ్లి మా బావ అభిషిక్త్ భార్గవ్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది.

కళ్లు నెత్తిన ఎక్కాయి

కళ్లు నెత్తిన ఎక్కాయి

నా భర్త సీతారామ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఏ లోటు రానివ్వడు కానీ ఆయనకు ఇప్పుడు కోట్ల రూపాయల సంపద వచ్చింది. డబ్బుపరంగా తారాస్థాయికి ఎదిగాడు. మా బావ అభిషిక్త్ భార్గవ్ ను కూడా మించిపోయాడు. అందుకే ఆయనకు కళ్లు నెత్తిన ఎక్కాయి.

కుంగిపోడు.. పొంగిపోడు

కుంగిపోడు.. పొంగిపోడు

మా బావ అభిషిక్త్ భార్గవ్ ను మేము చిన్నప్పటి నుంచి చూశాం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. మా కుటుంబానికి ఒక పెద్దన్నలా ఎప్పుడూ అండగా నిలిచేవాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు నా భర్త సీతారామ్ విస్మరిస్తున్నాడు.

విర్రవీగుతున్నాడు

విర్రవీగుతున్నాడు

మా అక్క, మా బావ అభిషిక్త్ ఇంటికి నన్ను వెళ్లకుండా నా భర్త సీతారామ్ ఎన్నో ఆంక్షలు పెడుతున్నాడు. డబ్బు అహంకారంతో విర్రవీగుతున్నాడు. డబ్బు ఉన్నవాళ్లకే విలువనిస్తున్నాడు. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. కానీ ఎప్పటికీ ఉండేది సంస్కారం, వ్యక్తిత్వం అనే విషయం నా భర్త సీతారామ్ కు తెలియడం లేదు.

అతనికి ఉండే గౌరవం ఎక్కువ

అతనికి ఉండే గౌరవం ఎక్కువ

మా బావ అభిషిక్త్ చేసిన ఏ పనిని కూడా నేను ప్రశ్నించలేదు. ఆయనకు ఇప్పుడు సమాజంలో ఎంతో పేరుంది. తాను తను నమ్మిన సిద్దాంతాను నమ్మి బతికే మనిషి. నా భర్త సీతారామ్ డబ్బు మోజులో పడి సొంత మనుషులన కూడా దూరం చేసున్నాడు. కానీ ప్రజల్లో అభిషిక్త్ ఉండే గౌరవం మాత్రం నా భర్త సీతారామ్ కు ఎన్ని కోట్ల రూపాయలున్నా ఏనాటికి దక్కదు.

ఇలాంటి వాడికిచ్చి కట్టబెట్టావు ఏంటి

ఇలాంటి వాడికిచ్చి కట్టబెట్టావు ఏంటి

ఎంతో ఆలోచన ఉన్న అభిషిక్త్ ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయించాడేంటని కొన్ని వందల సార్లు ప్రశ్నించాలని అనిపిస్తోంది. కానీ అంతా మన మంచికేనని సైలెంట్ గా ఉండిపోతున్నాను. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉన్న మా అక్క మా బావ అభిషిక్త్ అంటే నాకు ఎంతో గౌరవం. డబ్బు మోజులో పడి మన ఆత్మీయులను దూరం చేసుకోవడం సరికాదు. వ్యక్తిత్వానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.

English summary

i am doing just fine without love its trust that i have problem with

I am Doing Just Fine Without Love: It's Trust That I Have A Problem With
Story first published: Wednesday, January 10, 2018, 11:30 [IST]