వెయ్యి మంది శత్రువులు నిన్ను రౌండప్ చేసినా, ఇంటికెళ్లి అలా గడిపితే చాలు #mystory198

Subscribe to Boldsky

నా పేరు రాజేశ్. నాది వైజాగ్. నా జీవితంలో నేను అనుభవించిన కొన్ని సంఘటనలను, నా ఫ్రెండ్స్ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ ని నేను అబ్జర్వ్ చేసి భార్యాభర్తలకు కొన్ని సూచనలు ఇస్తున్నాను. ఇవి చాలా మందికి ఉపయోగపడేటట్లుగా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య మొదట చాలా ప్రేమ ఉంటుంది. వారిద్దరి మధ్య కనీసం గాలి కూడా చొరబడడానికి గ్యాప్ లేనంతంగా కొంతకాలం ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొనే గడిపేస్తుంటారు. అంత ప్రేమగా ఉండే వారి మధ్య అనుకోకుండా అగాధాలు ఏర్పడుతాయి. చిన్నచిన్నకారణాలణాలకే ఇద్దరూ గొడవపడే పరిస్థితి వస్తుంది.

ఇద్దరూ గొడవ పడే పరిస్థితి వస్తుంది

ఇద్దరూ గొడవ పడే పరిస్థితి వస్తుంది

కొన్ని రోజులకు వారి మధ్య ఉండే బంధం ఎలా మారుతుందంటే... చీటికి మాటికి ఇద్దరూ గొడవ పడే పరిస్థితి వస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చంపుకునేంత కోపం వస్తుంది. దీనికంతటికీ చిన్నచిన్న సమస్యలే కారణాలు.

నువ్వు ఆఫీసులో ఏదేదో ఒత్తిళ్లతో సతమతం అయి ఉండొచ్చు. కానీ ఇంటికొచ్చిన తర్వాత రిలాక్స్ గా ఉండాలి. ఆ కోపాన్నంతా నీ భార్యపై చూపిస్తే ఆమె మాత్రం ఎన్ని రోజులని తట్టుకుంటుంది.

దూరం పెడుతుంటారు

దూరం పెడుతుంటారు

చాలా మంది భర్తలు టెన్షన్స్ వల్ల తన దగ్గరికి ప్రేమగా వచ్చిన భార్యను ఏదో ఒక వంకతో దూరం పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరుగుతుంది. తర్వాత ఇది ఇద్దరి తనువుల మధ్య దూరానికి దారి తీస్తుంది.

ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు

ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు

అందువల్ల భార్యాభర్తలు ఆ పనిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. సెక్స్‌ ని భార్యాభర్తలు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అప్పుడే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. ప్రతి ఒక్కరూ రోజూ వారు చేసే పనులతో, ఒత్తిళ్ల వల్ల సతమతం అవుతూ ఉంటారు.

సెక్స్‌ను మాత్రం పట్టించుకోరు

సెక్స్‌ను మాత్రం పట్టించుకోరు

అలాగే ఇతర పనులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి సెక్స్‌ను మాత్రం పట్టించుకోరు. చాలా మంది దంపతులూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. దంపతులు శృంగారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరకు ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగు అవుతుంది.

ఎన్ని ఒత్తిళ్లతో సతమతం అవుతున్నా

ఎన్ని ఒత్తిళ్లతో సతమతం అవుతున్నా

అందుకోసం దంపతులిద్దరూ కొంత సమయాన్ని రోజూ కేటాయించుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా ఎన్ని ఒత్తిళ్లతో సతమతం అవుతున్నా కూడా తీరిక చేసుకుని అందులో తనువులు మరిచి గడపాలి. ఇద్దరూ ఏకాంతాన్ని ఆనందించాలి. కొత్తగా పెళ్లయిన దంపతులు మొదట కిస్ లకు, హగ్గింగ్ లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత వాటికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.

అగాధం ఏర్పడుతుంది

అగాధం ఏర్పడుతుంది

ఇక కొందరు భర్తలైతే ఏదో రాత్రి పూట ఆ పని చెయ్యాలి కాబట్టి చేసేద్దాం అన్నట్లుగా దాన్ని పూర్తి చేస్తారు. దీంతో ఇద్దరి మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది. దాన్ని పూడ్చడానికి మళ్లీ మీరు మీ మునపటి రోజులను గుర్తు చేసుకోవాలి. పెళ్లయిన కొత్తలో మీరు ఏం చేసేవారో ఆ పనుల్నే మీ భార్యతో చెయ్యడానికి ప్రయత్నించండి.

ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి

ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి

మీకు ఎన్ని ఒత్తిళ్లున్నా కూడా మీరు మీ భార్యపై చూపే ప్రేమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. మీరు ఇంటిలో అడుగుపెట్టగానే మీ భార్య పరుగెత్తికొచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుని మీతో ముచ్చట్లు పెడితే ఆ సంతోషం కింద నీ బాధలన్నీ పటాపంచల్ అవుతాయి.

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి

అంతకు మించిన ఆనందం మీకు ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. అయితే అలాంటి అనుభూతిని పొందాలంటే భర్తలు చాలా విషయాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. భార్యను అభినందిస్తుంటే ఆమె కచ్చితంగా మీపై ప్రేమను మరింత ఎక్కువగా చూపుతుంది.

ఎవడో గొట్టంగాడు లేక ఎవరో శూర్పుణక ఏమో అందని

ఎవడో గొట్టంగాడు లేక ఎవరో శూర్పుణక ఏమో అందని

ఆఫీసులో ఎవడో గొట్టంగాడు లేక ఎవరో శూర్పుణక నిన్ను ఏమో అనిందని ఆ కోపాన్ని నీ భార్యపై చూపిస్తే పాపం ఆమె ప్రేమను కూడా నువ్వు కోల్పొతావు. ఆఫీసులో నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉండనీ.... నువ్వు మాత్రం నీ భార్యలో నచ్చిన విషయాలను ఆమెకు ఎప్పిటికప్పుడు చెబుతూ ఉండాలి. దీంతో బెడ్రూమ్ లో మీరిద్దరూ లైంగిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు.

ఇద్దరి మనస్సు సహకరించకపోవొచ్చు

ఇద్దరి మనస్సు సహకరించకపోవొచ్చు

శృంగారానికి ఒక్కొక్కసారి ఇద్దరి మనస్సు సహకరించకపోవొచ్చు. ఇది చాలా మంది దంపతుల మధ్య జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప శృంగారానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు.

మీ దగ్గరకొచ్చిన మీ భార్యను మీరూ ఏదో వంకతో దూరం పెట్టడం అస్సలు తగదు.

శృంగార కోరికలు లేకపోయినా

శృంగార కోరికలు లేకపోయినా

ఆమె ఎంతో ఆశగా నీతో ముచ్చట్లు పెట్టి నీతో ప్రశాంతంగా గడపాలని వస్తే నువ్వు మాత్రం ఆమెను దూరంగా పెట్టి బాధించకు. నీకు ఆ సమయంలో శృంగార కోరికలు లేకపోయినా కూడా ఆమెను సంతోషపరచడానికిఅయినా సరే కనీసం ఆమెతో ప్రేమతో మాట్లాడాలి. అలాకాకుండా కోపగించుకుంటే మాత్రం ఆమె ప్రేమను కోల్పొతారు.

వెయ్యి మంది రౌండప్ చేసి బాధించినా

వెయ్యి మంది రౌండప్ చేసి బాధించినా

ఆఫీసులో వెయ్యి మంది శత్రువులు నిన్ను రౌండప్ చేసి బాధించినా, ఇంటికెళ్లగానే నీ భార్యతో హ్యాపీగా అన్నీ మైమరిచి కాసేపు గడిపితే చాలు లక్షల మంది శత్రువులను ఎదుర్కొనే మనోధైర్యం నీకు వస్తుంది. అది దాంపత్యంలో ఉన్న పవర్. దాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యకు. నా భార్యను నేను అలాగే ట్రీట్ చేస్తా. ఆమెను నేను ప్రేమించేదానికంటే ఆమె నన్ను రెండింతలు ఎక్కువగానే ప్రేమిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    i love her so much and i know that she loves me too

    i love her so much and i know that she loves me too
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more