రాధా ఆ రోజు నైట్ నా బెడ్రూమ్ కు వచ్చాడు.. చెయ్యరాని పనులు చేశాడు - My Story #93

Written By:
Subscribe to Boldsky

నా ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. నేను చేసుకోబోయే అబ్బాయి యూఎస్ లో జాబ్ చేస్తాడు. చాలా మంచి సంబంధం. మా ఇంట్లో వాళ్లు చాలా కష్టపడి మ్యారేజ్ అరేంజ్ చేశారు. ఈ వేసవిలో పెళ్లి పెట్టుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇక నా లైఫ్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంటుందనుకున్నాను.

నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాశనం చేశాడు

నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాశనం చేశాడు

కానీ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా జీవితాన్ని నాశనం చేశాడు. అతని పేరు రాధాకృష్ణ. నా పేరు కృష్ణవేణి. మా ఇద్దరి మధ్య చాలా రోజులు ప్రేమ నడిచింది. మా ఇద్దరి మధ్య చాలాచాలా జరిగాయి. కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం.

పెళ్లిలో పరిచయం అయ్యాడు

పెళ్లిలో పరిచయం అయ్యాడు

రాధా నాకు ఒక పెళ్లిలో పరిచయం అయ్యాడు. తను మా బంధువుల అబ్బాయే. అయితే కాస్త దూర బంధువు. ఒకసారి అతను మా బంధువుల పెళ్లికి వచ్చాడు. నాకు వరుసకు బావ అవుతాడు.

బాగా మాట్లాడాడు

బాగా మాట్లాడాడు

పెళ్లిలో నాతో బాగా మాట్లాడాడు. ఫుల్ సెటెర్లు వేశాడు. నాతో పాటు ఉన్న మా బంధువుల అమ్మాయిలతో కూడా బాగా కలిసిపోయాడు. అతను అందరికీ బాగా నచ్చాడు.

బాగా ఎంజాయ్ చేశాం

బాగా ఎంజాయ్ చేశాం

ఇక పెళ్లిలో మేమిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కొంత సామగ్రి అవసరం పడింది. దాంతో నన్ను షాప్ కు వెళ్లి తీసుకురమ్మన్నారు. నేను అస్సలు తీసుకురాను.. నేను ఒక్కదాన్ని ఎలా వెళ్లాలి.. పైగా ఈ ఊరిలో నాకు ఏమి తెలియదు అన్నాను.

రాధ బైక్ పై

రాధ బైక్ పై

నువ్వు ఒక్కదానివే ఏమి వెళ్లాల్సిన అవసరం లేదు. రాధ బైక్ పై వెళ్లి తీసుకుని రా అని చెప్పారు. వెంటనే ఒకే అన్నాను. రాధ బైక్ స్టార్ట్ చేశాడు. రా.. కృష్ణ వెళ్దాం అన్నాడు. వెళ్లి బైక్ పై కూర్చొన్నాను.

భుజంపై చెయ్యి వెయ్యాలా

భుజంపై చెయ్యి వెయ్యాలా

మామాలుగా బైక్స్ కి సైడ్ కు పట్టుకునేందుకు సైడ్స్ కు హ్యాండిల్స్ ఉంటాయి. కానీ ఆ బైక్ కు లేవు. దాంతో అతనిపై భుజంపై చెయ్యి వెయ్యాలా లేదా అని మొదట ఆలోచించాను.

నడుముపై చెయ్యి వేసి

నడుముపై చెయ్యి వేసి

చివరకు తనే ఉండి అలా పట్టుకోకుండా కూర్చొంటే కిందపడిపోతావ్. నన్ను పట్టుకో అన్నాడు. రాధా భుజంపై చెయ్యి వెయ్యాలంటే అతను చాలా హైట్ ఉంటాడు. అందుకే నడుముపై చెయ్యి వేసి పట్టుకున్నాను.

ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు

ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు

ఆ రోజు నాకు రాధాకు మధ్య ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. ఇద్దరం పెళ్లి అయిపోయే వరకు ఫుల్ ఎంజాయ్ చేశాం. పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరం ఎవరిదారిన వాళ్లం ఇళ్లకు వెళ్లిపోయాం.

నేను డిస్ట్రబ్ అయిపోయాను

నేను డిస్ట్రబ్ అయిపోయాను

ఇంటికొచ్చిన తర్వాత నాకు రాధా గుర్తొచ్చాడు. నాకు తెలియకుండానే నేను డిస్ట్రబ్ అయిపోయాను. నేను రాధా ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు. పెళ్లిలో మేమిద్దరం గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొచ్చింది.

ఆ గొంతు వినగానే

ఆ గొంతు వినగానే

అంతలోనే నా ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో అన్ నోన్ పర్సన్ కాల్ చేశారని.. లిఫ్ట్ చేసి మాట్లాడాను. హాలో.. అని ఆ గొంతు వినగానే నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. అది రాధనే అని అనిపించింది.

నిన్ను కలవాలని ఉంది

నిన్ను కలవాలని ఉంది

రాధా అన్నాను.. అవును కృష్ణ నేనే అన్నాడు. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. అతను ఫోన్ చెయ్యగానే నాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. రాధా నిన్ను కలవాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది అన్నాను.

రేపు రమ్మంటావా

రేపు రమ్మంటావా

నా నంబర్ నీకు ఎలా వచ్చిందని అడిగాను. నీ పక్కన ఉండే మన బంధువుల అమ్మాయిల ద్వారా తెలుసుకున్నా అన్నాడు. సరే.. ఎప్పుడు కలుద్దాం అన్నాడు. నీకు ఎప్పుడు వీలవుతుందన్నాను. రేపు రమ్మంటావా అన్నాడు. ఒకే అన్నాడు.

బైక్ పై బయటకు వెళ్లాం

బైక్ పై బయటకు వెళ్లాం

రాధా వాళ్ల ఊరు మా ఊరికి కాస్త దగ్గర్లోనే ఉంది. మరుసటి రోజు బైక్ పై మా ఇంటికొచ్చాడు. మా ఇంట్లో వాళ్లు కూడా అతనితో బాగా మాట్లాడారు. తర్వాత ఇంట్లో వారికి అబద్దం చెప్పి మేమిద్దరం బైక్ పై బయటకు వెళ్లాం.

పెళ్లి చేసుకోవాలనుకుంటాను

పెళ్లి చేసుకోవాలనుకుంటాను

అతను దగ్గర ఉంటే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. బైక్ పై వెళ్తున్నప్పుడే అతను తన మనస్సులోని మాట చెప్పాడు. కృష్ణ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను అని అన్నాడు.

ఒకే అనేశాను

ఒకే అనేశాను

నేను కూడా ఆ మాట కోసమే వెయిట్ చేశాను. రాధా చెప్పగానే వెంటనే ఒకే అనేశాను. తర్వాత సాయంత్రం వరకు రెస్టారెంట్ లోనే ఉండి ఏవేవో మాట్లాడుకున్నాం.

ఒక్కదాన్ని పడుకున్నాను

ఒక్కదాన్ని పడుకున్నాను

అతనితో ఎంత సేపు గడిపినా అదొక క్షణం మాదిరిగా అనిపించింది. సాయంత్రం మా ఇంటికొచ్చాం. ఆ రోజు రాత్రి రాధా మా ఇంట్లోనే పడుకున్నాడు. తన పడుకున్న బెడ్ రూమ్ పక్కనే నేను ఒక్కదాన్ని పడుకున్నాను. అమ్మనాన్న ఇంకో రూమ్ లో పడుకున్నారు.

రాధా నా బెడ్ రూమ్ కు వచ్చాడు

రాధా నా బెడ్ రూమ్ కు వచ్చాడు

నైట్ నిద్రరావడం లేదు. రాధాతో చాట్ చేశా. నువ్వు పక్కనే ఉన్నా.. ఎంతో దూరంగా ఉన్నట్లుంది అని మెసేజ్ పెట్టాను. వెంటనే రాధా నా బెడ్ రూమ్ కు వచ్చాడు. అతను రాగానే నాకు కాసేపు ఏమి అర్థం కాలేదు.

డైరెక్ట్ గా కిస్ పెట్టాడు

డైరెక్ట్ గా కిస్ పెట్టాడు

కాసేపు నా పక్కనే కూర్చొన్నాడు. తర్వాత డైరెక్ట్ గా కిస్ పెట్టాడు. నేను కూడా అతనికి ముద్దుపెట్టాను. తర్వాత ఆ పని చేద్దామా అన్నాడు. నేను వద్దు అన్నాను. అయినా వినకుండా మీద పడ్డాడు.

ఎంజాయ్ చేయాలనుకున్నాడు

ఎంజాయ్ చేయాలనుకున్నాడు

మొదట కాస్త ఫన్నీగా అనిపించింది. తర్వాత అతను నన్ను బలవంతం చేసి అయినా సరే ఎంజాయ్ చేయాలనుకున్నాడు. నాకు అది నచ్చలేదు. కోప్పడ్డాను. దాంతో వెంటనే సారీ చెప్పి తన బెడ్ రూమ్ కు వెళ్లాడు.

కృష్ణ నీకో మ్యాటర్ చెప్పాలంది

కృష్ణ నీకో మ్యాటర్ చెప్పాలంది

మరుసటి రోజు ఉదయం నేను లేవక ముందే తను వెళ్లిపోయాడు. నేను ఫోన్ చేసి సారీ చెప్పాను. ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. మా బంధువుల అమ్మాయి ఫోన్ చేసింది. మాటల మధ్యలో కృష్ణ నీకో మ్యాటర్ చెప్పాలంది.

ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం

ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం

చెప్పు అన్నాను. నాకు మొన్న పెళ్లికి వచ్చిన రాధ ప్రపోజ్ చేశాడు. ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం అంది. నేను ఏమి అనకుండా తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

నిన్ను వాడుకుని వదిలేద్దామని

నిన్ను వాడుకుని వదిలేద్దామని

రాధాకు ఫోన్ చేశాను. ఇలా ఇంకో అమ్మాయిని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావా అని అడిగాను. అవును అన్నాడు. అయినా కృష్ణ నిన్ను ఎవడూ పెళ్లి చేసుకుంటాడు.. నిన్ను ఏదో వాడుకుని వదిలేద్దామని అనుకున్నాను అన్నాడు.

చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు

చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు

నాకు కోపం వచ్చింది. తర్వాత రాధాతో నేను మాట్లాడలేదు. రాధకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నాకు తర్వాత తెలిసింది. మా ఇంట్లో వాళ్లు నాకు యూఎస్ సంబంధం ఒకే చేశారు. అయితే ఆ పెళ్లి రాధ వల్లే ఆగిపోయింది.

జీవితంలో ఎవ్వరినీ నమ్మకూడదు

జీవితంలో ఎవ్వరినీ నమ్మకూడదు

నాకు కాబోయే భర్తకు రాధ కొన్ని ఫొటోలు పంపాడు. నేను, రాధ చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలను, మేము చాట్ చేసిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి పంపాడు. దాంతో మా పెళ్లి ఆగిపోయింది. జీవితంలో ఎవ్వరినీ కూడా తొందరగా నమ్మకూడదు.. జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నాకు తెలిసి వచ్చింది.

English summary

i trusted blindly i got attached easily

I trusted blindly. I got attached easily. I expected a lot. I loved unconditionally.
Story first published: Saturday, February 17, 2018, 9:30 [IST]