Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.. కట్ చేస్తే వార్నింగులు.. ఛేజింగులు.. కేసులు.. తర్వాత ఏంటంటే?
ఆ తర్వాతే వారిద్దరూ కలిసి వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. అప్పటికే ఆమెకు ఇంటర్నెట్ డేటింగ్ గురించి అవగాహన ఉండేదట.
ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది ప్రేమ అంటే అమ్మాయి మరియు అబ్బాయి ఒకరినొకరు పరిచయం చేసుకోవడం... కొన్ని సిగ్నళ్ల ద్వారా తమ ప్రేమను ప్రారంభించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. జీవితాన్ని ఆనందంగా గడిపేయడం అని అనుకుంటూ ఉంటారు.

అయితే మేము ప్రస్తుతం చెప్పబోయే నిజమైన ప్రేమ కథ అన్ని లవ్ స్టోరీల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులోనూ అచ్చం మన తెలుగు సినిమాలలో ఉన్నట్టు ఎన్నో ట్విస్టులు.. ఆసక్తికరమైన మలుపులు... అద్భుతమైన మజిలీలు ఉంటాయి. అలాంటి అద్భుతమైన ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

ఫేస్ బుక్ పరిచయం..
తన పేరు దీపికా మిశ్రా సోని(పేర్లు మార్చాం). తన భర్త పేరు సుశాంక్. వారిద్దరూ ఫేస్ బుక్ పరిచమయ్యారు. అది 2018 సంవత్సరం. ఆమె ఏమో బ్రహ్మణ కుటుంబానికి చెందిన ఆమె. అప్పటివరకు ఆడవారంటే పురుషుల కంటే తక్కువ అన్న భావన ఉండేదట. తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలంటే అతి కష్టంతో కూడుకున్న పనిగా మారిందట. అయితే అప్పటి వరకు వారిద్దరూ ఫేస్ బుక్ లో చాట్ చేసుకున్నారట.

వ్యక్తిగతంగా కలుసుకోవాలి..
ఆ తర్వాతే వారిద్దరూ కలిసి వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. అప్పటికే ఆమెకు ఇంటర్నెట్ డేటింగ్ గురించి అవగాహన ఉండేదట. అందుకే ఆమె అత్యంత జాగ్రత్తగా ఉండేదట. ఎందుకంటే మగవారికి ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ తర్వాత తమ వెంటపడి వేధిస్తుంటారని భావించిందట.

క్రీమ్ స్టోన్ లో తొలిసారిగా..
అలా చాలా రోజుల తర్వాత తొలిసారిగా ఆమె అతడిని క్రీమ్ స్టోన్ లో తొలిసారిగా కలిసిందట. అప్పుడు సుశాంక్ ని చూసిన వెంటనే ఆమె ఆలోచనలన్నీ మారిపోయాయంట. తను చాలా అమాయకంగా కనిపించాడట. దాంతో తనలో అప్పటిదాకా ఉన్న భయం అంతా తొలగిపోయిందట. తనలాగే సుశాంక్ కూడా ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు అనిపించిందట.

అలా మాటలు మొదలు..
అందుకే ఇలాంటి పరిస్థితి నుండి బయటపడేందుకు రెండు కుళ్లు జోకులు వేసిందట. ఈ జోకులకు తన పెదవుల నుండి నవ్వు ప్రారంభమయ్యిందట. అలా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయట. అప్పుడే తను నాకు ప్రమాణం చేశాడు. అచ్చం జర్నీ సినిమాలో హీరోలా ఎన్ని సమస్యలు ఎదురైనా.. ఎవ్వరు అడ్డు చెప్పినా.. నిన్నే పెళ్లి చేసుకుంటాను. అందరి కంటే బాగా చూసుకుంటాను చెప్పాడు. అప్పుడు ఏమో తను నమ్మలేదట.

తనలో నిజాయితీ...
ఆ తర్వాత తన మాటల్లో ఆమెకు నిజాయితీ కనిపించిందట. అప్పటినుండి వారిద్దరూ నిరంతరం మాట్లాడటం చేసేవారట. అలా ఓ సందర్భంగా తన మాజీ ప్రియురాలి గురించి తనకు చెప్పాడట. ఆమెతో ఓ నాలుగేళ్లు కలిసి ఉన్నట్లు చెప్పాడట. అప్పుడు ఆమె కూడా తన కుటుంబం, వారు పాటించే సాంప్రదాయాల గురించి చెప్పారట.

ఒకరితో ఒకరు షేరింగ్..
అలా మాట్లాడుకుంటూ అంతవరకు వారు ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారట. ఇక అప్పటి నుండి ప్రతి విషయాన్నీ ఒకరితో ఒకరు పంచుకునేవారట. అలా వారిద్దరికీ తెలియకుండానే ప్రేమలో పడిపోయారట.

భిన్నధ్రువాల ఆకర్షణ..
శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయన్న విషయం వారిద్దరిలోనూ జరిగిందట. వారిద్దరూ భిన్న ధ్రువాలకు చెందిన వారిగా ఉండేవారట. ఎందుకంటే వారి జీవన విధానాలు.. ఆలోచనా విధానం.. అలవాట్లు అన్నీ పూర్తిగా భిన్నంగా ఉండేవట. అయితే వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం బలంగా మారిందట.

ధైర్యం చేసిందట..
అయితే ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరు పెద్దలు అనే సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరు కుటుంబాలు ఆ ప్రేమను అంగీకరించాలి. అలాంటి సమయంలో ఇద్దరి ఇంట్లోనూ ఆ ప్రేమను అస్సలు అంగీకరించరని ఆమె భావించిందట. అందుకే ఆమె తమ ప్రేమను గెలిపించుకోవడానికి ధైర్యం చేసిందట. ఆగస్టులో తన తల్లిదండ్రులకు చెప్పకుండా సుశాంక్ తో పెళ్లికి ఓకే చెప్పేసిందట.

ఆమెకు ఆశ్చర్యమేసిందట..
సుశాంక్ కుటుంబం ఆమె ఊహించిన దాని కంటే పూర్తి భిన్నంగా కనిపించిందట. వారి ప్రేమ, పెళ్లి నిర్ణయం గురించి తెలుసుకున్న వారు చాలా సంతోషించారట. సుశాంకే తనను ప్రేమించినందుకు వారు ఎంతో ఆనందపడ్డారట.

బెదిరించారట..
అయితే ఆమె కుటుంబంలో మాత్రం దీపికా ఊహించినట్టే జరిగిందంటే. ప్రేమ విషయం చెప్పగానే వారి నాన్న బెదిరించారట. తన ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పాడట. ఎంతగానో భయపెట్టారట. అయినా ఆమె తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. అందుకే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అదే ఏడాది డిసెంబర్ లో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారట.

ముంబై వెళ్లారట..
అయితే తమ తండ్రి నుండి తాము తప్పించుకోవడానికి సొంత రాష్ట్రాన్ని వదిలి ముంబై వెళ్లిపోయారట. ఆ తర్వాత వాట్సాప్ వారి పెళ్లి ఫొటోలు.. వాయిస్ మెసెజ్ లు పంపించి తాను ఓ ఇంటిదాన్ని అయిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపిందట.

వారి గురించి అన్వేషణ..
అయినా కూడా ఆమె తండ్రి కొందరిని ముంబైకి పంపించి వారి కోసం తెగ అన్వేషించారట. ఆమె అత్తవారింటికి వెళ్లి తమ వివరాలు చెప్పమని బెదిరించారట. అంతేకాదు సుశాంక్ కుటుంబ సభ్యులపై పోలీసుకేసులు కూడా పెట్టారట. అయితే తను మేజర్ కావడంతో.. తాను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడంతో వారు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారట.

పూర్తిగా తెగదెంపులు..
సుశాంక్ తో వివాహం అయిన తర్వాత ఆమె కుటుంబం తనతో పూర్తిగా తెగదెంపులు చేసుకుందట. అది తనకు బాధ కలిగించలేదట. కాకపోతే వారిని మిస్సవ్వుతున్నట్టు అనిపించేదట. అయితే వారి అత్తమామలు చాలా మంచివారని, వారు బాగా చూసుకునేవారని చెప్పుకొచ్చింది.



Click it and Unblock the Notifications











