Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
కండోమ్ వాడటంలో వచ్చే ఇబ్బందులొస్తున్నాయా? ఇలా ట్రై చెయ్యండి...
కండోమ్ ను అంగస్తంభన సమయంలో మాత్రమే వాడాలి. కండోమ్ ను వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కోనను( కండోమ్ తల) పట్టుకోవాలి.
కండోమ్స్ అనేవి అన్ని వేళలా వినియోగించవచ్చు. ఇది ఎల్లప్పుడూ సురక్షితమే అని ప్రభుత్వాలే స్వయంగా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే కండోమ్ వినియోగం సమయంలో మగవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. యోనిలోకి జారిపోవడం, చిరిగిపోవడం, పగిలిపోవడం, లీకేజీ, దురద వంటి తదితర సమస్యలు ఎదురవుతున్నాయి.

కండోమ్ వాడటంలో విఫలం అయితే సుఖ వ్యాధులు.. అవాంఛిత గర్భం వంటివి వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని మీకు తెలుసా? మీరు రొమాంటిక్ మూడ్ లో పడి కండోమ్ ను ఎలా పడితే అలా వాడితే వచ్చే ఇబ్బందులేమిటో తెలుసా? అయితే ఇందుకు కారణాలేంటో తెలుసా? కండోమ్స్ లోని నాణ్యత లోపాలా కాదా అనే విషయాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూడండి...

కొత్త కొత్త కండోమ్స్..
ఈ విశ్వంలో 100 కన్నా ఎక్కువ కండోమ్స్ ను తయారు చేసే బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. లైంగిక చర్యలో పాల్గొనేవారు కండోమ్ వాడకం చాలా సురక్షితం. ఇది కొంతమందికి సుఖమైన మరియు సరక్షిత పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా చాలా రకాల కండోమ్స్ అంటే రుచులకు అనుగుణంగా కొత్త కొత్త రకాల కండోమ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.

కండోమ్స్ లో సమస్య...
సాధారణంగా కండోమ్స్ ను తయారు చేసే కంపెనీలు వాటిని ఎలాంటి లోపాలు లేకుండా మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటారు. అది కూడా అత్యాధునిక పరికరాలతో ప్రతి అణువును చెక్ చేస్తారు. ఇలా ఎంత చేసినా కొన్నిసార్లు రంధ్రాలుండే కండోమ్స్ బయటకు వస్తుంటాయి.

వీర్యం బయటికి..
చాలా మంది శృంగారంలో పాల్గొనే ముందు హడావుడిగా కండోమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోకుండా ఆ కార్యంలో పాల్గొంటారు. దీంతో అవి చిల్లులు పడి అందులో నుండి వీర్యం బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అది గర్భానికి దారి తీసే అవకాశం ఉంది.

ఎయిర్ లాక్..
అయితే కండోమ్ చివరలో ఓ చిన్నసంచి లాగా బుడిపై ఉంటుంది. స్ఖలనం తర్వాత వీర్యం అక్కడే ఆగిపోతుంది. కండోమ్ ను వేసుకునే సమయంలో ఆ సంచిలాంటి చోట గాలి పోగైపోయే (ఎయిర్ లాక్) ఆస్కారం ఉంటుంది సుమా. కొన్నిసార్లు స్ఖలనం సమయంలో తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఆ బుడిపై టప్పున పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

వేగాన్ని తట్టుకోవాలంటే..
మామూలుగా వీర్య స్ఖలనం గంటలకు నలభై నుండి ఎనభై కిలోమీటర్ల వేగంతో జరుగుతుంది. ఆ వేగాన్ని తట్టుకోవాలంటే కండోమ్ కు చాలా శక్తి కావాలి. కండోమ్స్ తయారు చేసే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎయిర్ లాక్ కారణంగా అది పగిలిపోయే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది.

ప్రతిసారీ కొత్తది..
సంభోగంలో పాల్గొనే వారు ప్రతిసారీ కొత్త కండోమ్ వాడాలి. ఒకసారి వాడిన కండోమ్ ను తిరిగి వాడకూడదు. ఎందుకంటే కండోమ్ అనేది ఒకసారి వాడి యూజ్ అండ్ త్రో చేసే వస్తువు. పొరపాటున మీరు తిరిగి మరలా ఆ కండోమ్ నే వాడితే మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

అప్పుడే వాడాలి..
కండోమ్ ను అంగస్తంభన సమయంలో మాత్రమే వాడాలి. కండోమ్ ను వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కోనను( కండోమ్ తల) పట్టుకోవాలి. సంభోగం తర్వాత విడుదలైన వీర్యం స్థిరంగా ఉండేందుకు, మొదటి కొన లేదా పురుషాంగపు కొనలో, కండోమ్ లో కాస్త ఖాళీ స్థలాన్ని వదలాలి.

గట్టిగా పట్టుకోవాలి..
లైంగిక చర్య తర్వాత యోని నుండి పురుషాంగాన్ని బయటికి తీసే సమయంలో, కండోమ్ లేదా వీర్యం జారి పడకుండా కండోమ్ ను గట్టిగా పట్టుకోవాలి. వీర్యం విడుదలైన తర్వాత కండోమ్ ను వేరు చేసి వెంటనే తొలగించండి.

అక్కడ దాచటం వలన..
కండోమ్స్ ను కారు డ్రాలో లేదా పర్సులో దాచటం వలన కండోమ్ ప్యాకింగ్ మరియు లోపల ఉన్న కండోమ్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు కండోమ్ యొక్క సగటు జీవితకాలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.

శుభ్రపరచుకోండి...
సంభోగం తర్వాత అంగాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం అనే విషయాన్ని అస్సలు మరువద్దు. కండోమ్ వాడే వారు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే హెచ్ ఐవి, ఎయిడ్స్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
