Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
కరోనా నుండి కోలుకున్న వెంటనే ఆ కార్యంలో పాల్గొనొచ్చా?
కరోనా నెగిటివ్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత కలయికలో పాల్గొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి ఏ ముహుర్తాన వూహాన్ లో పుట్టిందో తెలియదుగానీ.. ప్రపంచంలోని ప్రతిఒక్కరినీ అది కలవరపెడుతూనే ఉంది. దీని దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది.

విదేశాల్లో లక్షల మంది ప్రజలు ఈ మహమ్మారి దెబ్బకు మరణించారు. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. మన దేశంలో కూడా ఇటీవలే కరోనా కేసులు 50 లక్షల మార్కును దాటాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

అయితే మన దేశంలో కరోనా నుండి ప్రాణాలు కోల్పోయిన వారికంటే.. కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం సంతోషకరమైన అంశం. ఈ వైరస్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇది ఎవరైనా తుమ్మినా, దగ్గినా, కేవలం ముట్టుకున్నా కూడా ఇతరులకు సోకుతుందని అంతా భావించారు. కానీ ఇది గాలిలో నుండి సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ క్రమంలో ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ కరోనా మహమ్మారి విషయంలో చాలా మంది ఇతర అనుమానాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అందులో అతి ముఖ్యమైనది శృంగారం. శృంగారంలో పాల్గొంటే ఈ మహమ్మారి సోకుతుందా అనే అనుమానం ఇప్పటికీ అలానే ఉంది. దీనిపై పలు సంస్థలు కూడా కొన్ని పరిశోధనలు చేశాయి. ఈ సందర్భంగా ఆ పరిశోధనల్లో ఏం తేలింది? శృంగారం గురించి అన్ని అనుమానాలకు సమాధానం దొరికిందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మగవారి వీర్యంలో..
కొన్ని పరిశోధనల్లో కొందరు శృంగారం వల్ల కరోనా వైరస్ రాదని తేలింది.. కానీ ఇతర పరిశోధనల్లో మాత్రం మగవారి వీర్యంలో కరోనా వైరస్ ను కనుగొన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కరోనా సోకితే..
అయితే కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది కరోనా రానివారు దీని గురించి ఆన్ లైనులో తెగ అన్వేషించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారి పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత మళ్లీ శృంగారంలో పాల్గొనాలంటే ఎంతకాలం వేచి ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం.

సుమారు 30 రోజుల వరకు..
ఈ అంశంపై కూడా ఓ సంస్థ పరిశోధనలు చేసింది. వారి పరిశోధన ప్రకారం కరోనా నుండి కోలుకున్న వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా ప్రమాదకరమంట. అందుకనే కరోనా నుండి కోలుకున్న వ్యక్తులు కలయికలో పాల్గొనేందుకు కనీసం 30 రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

భాగస్వామికి కరోనా..
కరోనా సోకిన వ్యక్తికి సుమారు 30 రోజుల పాటు వారి శరీరంలో కోవిద్ లక్షణాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో వారు కలయికలో పాల్గొంటే, దాని వల్ల వారి భాగస్వామికి కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

16 శాతం మంది..
ఈ విషయంపై థాయిలాండ్ దేశంలో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న సుమారు 38 మంది వ్యక్తులకు సంబంధించిన వీర్యాన్ని సేకరించి పరిశోధనలు చేశారు. వీరిలో 16 శాతం మంది వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.

నెల రోజుల తర్వాత..
వీరందరినీ 30 రోజుల పాటు పరిశీలించామని.. వీరు కరోనా నుండి కోలుకున్న నెల రోజుల తర్వాత వీరిలో కరోనా వైరస్ లక్షణాలు ఏమీ కనబడలేదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకనే కరోనా సోకిన వారు ఆ కార్యంలో పాల్గొనేందుకు కనీసం ఒక నెల రోజులు దూరంగా ఉండాలి.

కండోమ్ బెటర్..
అయితే నెలరోజుల తర్వాత కలయికలో పాల్గొనేవారు కండోమ్ వాడటం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఒక భాగస్వామికి కరోనా లక్షణాలు కనబడితే.. మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది.

శృంగారం వల్ల..
అయితే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కరోనా శృంగారం వల్ల రాదు. కానీ మీ భాగస్వామికి అలాంటి లక్షణాలు ఉంటే.. వారితో మీరు సాన్నిహిత్యంగా ఉండటం.. కిస్ చేయడం వంటి పనుల వల్ల మీరు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంది.

శృంగారానికి దూరంగా..
ఒకవేళ కరోనా లక్షణాలున్నాయని అనుమానం ఉంటే కూడా, మీరు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీరు ముద్దులకు ఎంత దూరంగా ఉంటే, అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











