For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి ఒక్కరి పెళ్లిలో జరిగే ఈ గొడవలకు ఎలా బ్రేకులేయాలో తెలుసా...

మీ వివాహం సమయంలో జరిగే కొన్ని రకాల విషయాలకు ఎలా దూరం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన తెలుగు రాష్ట్రాల్లో వివాహ కార్యక్రమం అంతా పెళ్లి చూపుల నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుత జనరేషన్ వారిలో చాలా మంది ప్రేమ వివాహం చేసుకుంటున్నప్పటికీ, కొందరు యువత సంప్రదాయ వివాహాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

How to Avoid Drama on Your Wedding Day in Telugu

పెళ్లిచూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకుని, మాట్లాడుకుని.. అలవాట్లను, అభిప్రాయాలను, అభిరుచుల గురించి తెలుసుకుని.. అన్నీ నచ్చితే.. కట్నకానుకల విషయాల గురించి మాట్లాడుకుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని తెలిసినా.. పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇలా ఇరు కుటుంబాల వీటి విషయంలో ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు.

How to Avoid Drama on Your Wedding Day in Telugu

అప్పటినుండి నిశ్చితార్థ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని తాంబూలం అని కూడా పిలుస్తారు. ఇది జరిగితే సగం పెళ్లి జరిగినట్టేనని భావిస్తారు. ఆ తర్వాత అసలు ఘట్టం మొదలవుతుంది. ఆ తర్వాత తలంబ్రాలు నుండి అప్పగింతల వరకు అన్ని విషయాలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి.

How to Avoid Drama on Your Wedding Day in Telugu

పెళ్లి సమయంలో ఏ ఒక్క విషయంలో తేడా వచ్చినా.. పెళ్లి కొడుకు తరపున గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బాధ కలిగించే విషయమే అయినా.. ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో చాలా మంది మానసికంగా బాధపడతారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. వాటిని ఎలా అధిగమించాలో.. పెళ్లి సమయంలో కొందరి నాటకాలను ఎలా పసిగట్టాలి.. వాటికి స్పీడ్ బ్రేకర్లు ఎలా వేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశుల వారు ఆ విషయంలో 'తగ్గేదే లే' అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!ఈ రాశుల వారు ఆ విషయంలో 'తగ్గేదే లే' అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

గొడవలు తలెత్తితే..

గొడవలు తలెత్తితే..

మన దేశంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఇంట అయినా పెళ్లి జరుగుతుందంటే.. ఆ వివాహ కార్యక్రమానికి కనీసం వందల సంఖ్యలో అతిథులు వస్తుంటారు. ఎంత తక్కువలో తక్కువ అన్నా..కనీసం వంద మంది బంధువులు వస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో వారు అందరితో కలిసి ఉండేందుకు చాలా కష్టంగా ఉంటుంది. దీంతో వారిని పలకరించలేదనో.. లేదా ఇంకో ఏదైనా విషయం గురించో గొడవలు జరగొచ్చు. అలాంటి సమయంలో మీరు కరోనాను కారణంగా చూపుతూ.. కరోనా వ్యాప్తి అవుతుందనే కారణంతో.. ఇలాంటి ఏర్పాట్లు చేశామని, దయచేసి సహకరించమని వారికి సర్ది చెప్పొచ్చు. అప్పుడు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు.

బంధువులతో మాట్లాడండి..

బంధువులతో మాట్లాడండి..

వివాహ ఏర్పాట్ల గురించి మీకు మరియు మీ కాబోయే భాగస్వామికి మరియు మీ బంధువులకు ఒకే ఆలోచనలు ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్ని వర్గాల ప్రజలు మీకు భిన్నమైన అభిప్రాయాలను అందిస్తారు. కాబట్టి మీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచడం కష్టం. మీరు మరియు మీ భాగస్వామి పెళ్లికి ఏమి కోరుకుంటున్నారో నిర్ధారించుకోండి. అప్పుడు ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి తగాదాలు రావు.

అబ్బాయిలతో ‘ఆ కార్యం'లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!అబ్బాయిలతో ‘ఆ కార్యం'లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

మద్యం తాగిన వ్యక్తులతో..

మద్యం తాగిన వ్యక్తులతో..

ఎక్కడ పెళ్లి జరిగినా మనకు మందుబాబులు కచ్చితంగా తగులుతుంటారు. అయితే వారి కదలికలపై మీరు ఓ కన్నెసి ఉంచాలి. వారితో ముందుగానే మాట్లాడండి. ఇది మీకు ప్రత్యేకమైన రోజు అని మర్యాదపూర్వకంగా తెలియజేయండి. ఎంత తాగినా.. ఏమి తాగినా కంట్రోల్ ఉండమని రిక్వస్ట్ చేయండి. లేదంటే అలాంటి వారిని పక్కన పెట్టేయండి.

ప్రశాంతంగా ఉండండి..

ప్రశాంతంగా ఉండండి..

పెళ్లి రోజు మరియు పెళ్లికి ముందు, తర్వాత రోజుల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి, కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే, ప్రశాంతంగా మారేలా మంచి సంగీతం వినండి. శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది. కొన్ని సందర్భాల్లో సౌకర్యాలు సరిగా లేవని వాదించడం ప్రారంభించినప్పుడు, అలాంటి సంఘటనలు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు, మీరు సీరియస్ అవ్వకూడదు. చాలా సావధానంగా వారికి సమాధానం ఇవ్వాలి.

పిల్లల విభాగాన్ని కేటాయించండి..

పిల్లల విభాగాన్ని కేటాయించండి..

పిల్లలు లేకుండా భారతీయ వివాహాలు పూర్తి కావనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు పిల్లలు మొరటుగా, మరికొందరు ఏడుస్తూ, గందరగోళాన్ని సృష్టిస్తారు. తల్లులు తమ పిల్లలను తిట్టొచ్చు మరియు కొన్ని అనవసరమైన నాటకాలు చేయొచ్చు. ఇది మిమ్మల్ని చాలా నిరాశపరచొచ్చు. కాబట్టి, మీరు పిల్లల ఆట స్థలాన్ని సృష్టించవచ్చు, అది వారిని ఆక్రమించుకునేలా చేస్తుంది మరియు హాల్ చుట్టూ పరుగెత్తకుండా, వస్తువులను విచ్ఛిన్నం చేయకుండా కట్టడి చేస్తుంది.

English summary

How to Avoid Drama on Your Wedding Day in Telugu

Here we are talking about the how to avoid drama on your wedding day in Telugu. Read on.
Desktop Bottom Promotion