Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
మగాళ్లను ఎలా ముగ్గులోకి దింపాలో తెలుసా?
మగాళ్లను ముగ్గులోకి దింపడానికి ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ ఉండదు. జస్ట్ అలా చూస్తే పడిపోతారు.. మనకోసం పడి చస్తారు.. అని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. కానీ అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. కొందరిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీగా
మగాళ్లను ముగ్గులోకి దింపడానికి ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ ఉండదు. జస్ట్ అలా చూస్తే పడిపోతారు.. మనకోసం పడి చస్తారు.. అని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. కానీ అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. కొందరిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీగా ఏమీ ఉండదు. కొంత శ్రమించాల్సిందే. మగాళ్లను సమ్మోహన పరచడం ఓ కళ. మరి ఆ కళలో మీకు మెలకువలు తెలియకపోతే ఇది చదివి తీరాల్సిందే.

అబ్బాయిల మీవైపు చూసేలా చేయాలి.
1. ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం పెద్ద ఆభరణం. అమ్మయిలైనా, అబ్బాయిలైనా ఆత్మవిశ్వాసానికి ఆకర్షితులు అవ్వాల్సిందే. చాలా మంది పురుషులు శారీరక సౌందర్యం కంటే ఆత్మవిశ్వాసాన్ని చాలా ఇష్టపడతారు. మీ ఆసక్తులు, లక్ష్యాలు, ఆలోచనల గురించి బలంగా చెప్పాలి.

2. పొగడాలి అనిపించేలా డ్రెస్ ఉండాలి
ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు, చాలా మంది వ్యక్తులు వారి రూపాన్ని చూసే ఒక అంచనాకు వస్తారు. మీరు ఒక వ్యక్తిని మోహింపజేయాలని ప్రయత్నిస్తుంటే, అతని దృష్టిని ఆకర్షించడానికి మంచి దుస్తులు ధరించండి.
ఎంత మంచి డ్రెస్ వేసినా ఆత్మవిశ్వాసం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం అనే ఆభరణాన్ని తప్పనిసరిగా ధరించండి. మీకు చక్కగా సరిపోయే దుస్తులు, సౌకర్యవంతమైనవి వేసుకుంటే ఆత్మవిశ్వాసం వచ్చి చేరుతుంది.

3. ఐ కాంటాక్ట్
ఎక్కడెక్కడో చూసి మాట్లాడటం మానుకోవాలి. కళ్లలో కళ్లు పెట్టి చూడాలి. ఇది కొందరికి చిన్నప్పటి నుండి వచ్చేస్తుంది. మరికొందరు మాత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది. కళ్లలో కళ్లు పెట్టి చూసే వారి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

4. బాడీ లాంగ్వేజ్
మీలోని భావాలను బాడీ లాంగ్వేజ్‌ను ఉపయోగించి వ్యక్తీకరించండి. సందర్భం చూసి తాకడానికి ప్రయత్నించండి. వాళ్లంటే మీకు ఇష్టమన్న భావనను కలగజేస్తుంది. దొరికిన అవకాశాన్ని వదులుకోకండి.

5. ఫ్లర్ట్
ఫ్లర్టింగ్ చేయడం ఓ కళ. మీకు తెలియక పోతే మీ బాయ్ బెస్టీలను అడిగి తెలుసుకోండి. పులిహోర కలపండి.

6. మీదే మొదటి అడుగు కావాలి
మీ ఆలోచనలు చెప్పడానికి అధైర్య పడొద్దు. అలాగే డొంక తిరుగుడు అస్సలే వద్దు. మరీ డైరెక్ట్‌గా చెప్పలేకపోతే చిన్న చిన్న క్లూ ఇచ్చి అయినా మీలోని భావాలను తెలియజేయండి.
రొమాంటిక్ సంభాషణలు మీరే మొదలు పెట్టండి. పర్సనల్ క్వశ్చన్స్ అడగండి. వాళ్లు జవాబు చెప్పడానికి తటపటాయిస్తుంటే, ఆన్సర్ చెప్పమంటూ ప్రోత్సహించండి.

7. ఫాంటసీలను పంచుకోండి
కోరికలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. మీలోనూ, ఎదుటి వారిలోనూ ఉంటాయి. మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పడానికి ట్రై చేయండి.
సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోని సన్నివేశాల గురించి చర్చ మొదలు పెట్టండి. అలాంటివి మీకు చేయాలనిపిస్తుందని చెప్పండి.

8. మీ మధ్య క్లోజ్‌నెస్ ఉంటే మరో అడుగు వేయండి
శారీరక సంబంధాన్ని ఎలా ప్రారంభించాలో మీకు తెలియడం లేదా.. అయితే వారిని మెల్లిగా తాకండి. మగవారి హాట్‌స్పాట్స్ వద్ద సున్నితంగా మసాజ్ చేయండి. అది వారిలో మూడ్‌ను తీసుకువస్తుంది. మీరు కూడా ఫిజికల్‌గా కలవడానికి సిద్ధంగా ఉన్నారని మాటలతో కాకుండా చేతలతో చెప్పండి.



Click it and Unblock the Notifications
