Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఇప్పట్లో బ్రేకప్ సింపుల్ మ్యాటర్.. కానీ కొంచెం కొత్తదనం కోరుకునే వారికి అది చాలా బెటర్...!
బ్రేకప్ తర్వాత కొత్త జీవితం ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రేమ అయినా.. పెళ్లి అయినా ప్రతి ఒక్కరికీ ఒక మధురమైన అనుభూతి. ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటి అనుభూతిని అనుభవించి ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు చాలా మందికి వారి ప్రపంచమే వేరుగా.. అందమైనదిగా.. కొత్తదిగా కనిపిస్తుంది. ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది.

ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిరోజూ పండుగలాగే అనిపిస్తుంది. రోజులన్నీ నిమిషాల్లా గడిచిపోతాయి. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతీదీ అద్భుతంగానే కనిపిస్తుంది.

అంతా బాగున్నప్పుడు, ఎలాంటి సమస్యా ఉండదు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో గొడవలు, మనస్పర్దలు అనేవి చాలా సహజం. అలాంటప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది.

అంతే వెంటనే ప్రేమలో ఉండే వారు బ్రేకప్ చెప్పుకోవడం.. పెళ్లి అయిన వారు విడాకులు తీసుకోవటం జరుగుతుంటాయి. అలాంటి వారందరికీ విడిపోయిన తర్వాత ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది.

అప్పటివరకు అందరికంటే ఆనందంగా జీవించిన వారు అకస్మాత్తుగా డీలా పడిపోతారు. తమ జీవితం అయిపోయిందని, ఈ ప్రపంచంతో తమకు ఇంకా ఏ పనీ లేదని తీవ్ర ఒత్తిడికి గురవుతారు.

అయితే ఇలాంటి బ్రేకప్ నుండి బయటపడటానికి అనేక మార్గాలున్నాయి. అయితే దీనికి మాత్రం కొంత సమయం పడుతుంది. అయితే వాస్తవం ఏమిటంటే జీవితం దేని కోసం. కాబట్టి బ్రేకప్ తర్వాత కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం...

బ్రేకప్ కు అంతలా ఫీలవ్వాలా?
మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు, సిల్లీ రీజన్స్ చెప్పి వారికి బ్రేకప్ చెప్పలేం. అయితే బ్రేకప్ అనేది కొందరికి చాలా సింపుల్ మ్యాటర్. కానీ దాని వల్ల కలిగే పెయిన్ మనపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. వాస్తవం చెప్పాలంటే ఆ పెయిన్ ను మనం మరచిపోవడమనేది చాలా కష్టం. ఆ పెయిన్ మనల్ని ప్రతిరోజూ, ప్రతిక్షణం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఇది మన రోజువారీ జీవితంపైనా పెను ప్రభావమే చూపించొచ్చు. ‘నాకే ఇలా ఎందుకు జరిగింది? నేనేం తప్పు చేశాను?' అనే బాధ బాగా వేధిస్తుంది. అయితే నిజంగా బ్రేకప్ మ్యాటర్ కు అంతగా ఫీలవ్వకుండా దాని నుండే బయట పండేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొంచెం కష్టం..
ఎవరితో అయినా బంధాన్ని ఏర్పరచుకోవడం ఎంత కష్టమో... ఆ బంధం నుండి బ్రేకప్ అవ్వడం కూడా అంతే కష్టం. అది కేవలం గంటలు, రోజుల్లో జరిగే పని కాదు. అయితే దీనంతటికీ కొంత సమయం పడుతుంది. అందుకే బ్రేకప్ పెయిన్ నుండి త్వరగా బయటపడాలని కోరుకునే వారు వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలి. ముందు మీ మనసుకు సర్ది చెప్పి, మానసికంగా బలంగా తయారవ్వాలి. ముందు మీకు ఎలాంటి పనులు నచ్చుతాయో వాటినే ఎక్కువగా చేయాలి. దీనికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, అంతిమంగా సానుకూల ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి బ్రేకప్ తర్వాత తొందరపాటు పనికిరాదు. వీలైనంత సమయం తీసుకుని నెమ్మదిగా మామూలు స్థితిలోకి రావాలి.

ఆత్మీయులతో పంచుకోండి...
బ్రేకప్ పెయిన్ నుండి బయటపడటానికి మిత్రులదే కీలకపాత్ర. మనసులో పెయిన్ ను అలాగే ఉంచుకుంటే, అది పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గదు. అందుకే ఆత్మీయులు, మిమ్మల్ని అర్థం చేసుకునే మిత్రులతో ఆ బాధను పంచుకుంటే.. వారి మాటలు మీకు కొంత రిలీఫ్ కలిగించొచ్చు. ఈ బాధంతా కొంతకాలమే అని మనకు తెలిసినా దాన్ని ప్రతిసారి గుర్తు చేసేందుకు ఒక మంచి మిత్రుడు మన పక్కనుండాలి. అప్పుడే బ్రేకప్ నుండి మనకు బ్రేక్ లభిస్తుంది. అంతేకాదు మీ మనసుకు కాస్త రిలీఫ్ కలుగుతుంది.

కొత్త మార్పులు..
బ్రేకప్ గురించి అస్తమానం బాధపడకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనం ఎలా మెరుగుపరచుకోవాలో.. ఆలోచించి కొన్ని కొత్త మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు.. ఎప్పటి నుంచో చేద్దామనుకుంటూ పెండింగులో పెడుతున్న పనులను ఇప్పుడే మొదలుపెట్టొచ్చు. అలాగే రోజువారీ పనుల్లో కొత్త వాటిని చేర్చాలి.

ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లడం..
మీరు చేసే రోజువారీ పనుల్లో కొత్త వాటిని చేర్చాలి. ఎక్సర్ సైజు చేయడం, హెల్త్ కేర్, బ్యూటీకేర్ లాంటివి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ టైమ్ కాబట్టి కొత్త గడ్డం స్టయిల్ ను లేదా కొత్త హెయిర్ స్టైల్ ను ప్రయత్నించొచ్చు. లేదా ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి గడపొచ్చు. దాని వల్ల మీకు కొంత రీఛార్జ్ అవుతారు. ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నమయిపోతే మీకు తెలియకుండా బ్రేకప్ పెయిన్ ను మర్చిపోతారు. పాత జ్ణాపకాలు కూడా అంతగా గుర్తుకు రావు.

సోషల్ మీడియాకు దూరంగా..
ప్రస్తుతం చాలా మందిపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే బ్రేకప్ అవ్వగానే వారు అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే దీని వల్ల సానుభూతి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

బ్రేకప్ అవ్వగానే..
ఇంకా కొంతమంది బ్రేకప్ అవ్వగానే కొన్ని చెడు వ్యసనాల బారిన పడుతుంటారు. దీని వల్ల మీరు మరింత నష్టపోతారు. మీ మనసును పాడు చేసుకోవడమే కాదు.. మీ ఆరోగ్యాన్ని మీరు చేతుల పాడు చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అలాంటి సమయంలో మీరు బాధపడుతూ లోన్లీగా ఉండేకంటే, పాత ఆలోచనలను పక్కనబెట్టి, కొత్త ఆలోచనలు చేయాలి.. కొత్త వ్యక్తులను కలవాలి. అవి మీ జీవితాన్ని పాజిటివ్ గా మారుస్తాయి.

మెమొరీలను మరచిపోండి..
కొంతమంది సినిమాల్లో చూపించినట్టుగా బ్రేకప్ అవ్వగానే వారికి(ఎక్స్) సంబంధించిన ఫొటోలను, వారిచ్చిన బహుమతులను దగ్గర పెట్టుకుని తెగ బాధపడుతుంటాయి. అయితే ప్రాక్టికల్ గా ఇవన్నీ కుదరవు. వారి వస్తువులను చూసి ఏడుస్తూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే బ్రేకప్ అవ్వగానే అలాంటి గుర్తులను చెరిపేయడం మంచిది.

చెడును మాత్రమే చూస్తే..
చాలా మంది బ్రేకప్ జరిగిన వెంటనే చేసే పెద్ద తప్పు ఏంటంటే.. వారు వెళ్లిపోయిన వ్యక్తిలోని లోపాలను మాత్రమే కనుగొంటారు. అదే భ్రమలో ఇతరుల తప్పులను లెక్కిస్తారు. ఇలా చేయడం పెద్ద తప్పు. మీరు ఇంతకాలం కలిసి జీవించిన సంబంధానికి కూడా ఇది అవమానం. కాబట్టి దీనిని మీరు వీలైనంత వరకు నివారించండి. పాత జ్ణాపకాలను మరచిపోవడం అంత తేలికైన పని కాదు.. కాబట్టి కనీసం వారి నుండి, వారి గుర్తుల నుండి దూరంగా ఉండండి.



Click it and Unblock the Notifications