For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bride Covid-19 Positive:తనకు కరోనా వచ్చినా కళ్యాణం ఆగలేదు.. మరి పెళ్లి ఎలా జరిగిందంటే...

కరోనా వచ్చినా వారికి కళ్యాణానికి అడ్డుకట్ట వేయలేకపోయింది.

|

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు. వీరి వివాహ వేడుకను చూస్తే అలాంటి విషయాలు నిజమేనని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కరోనా వచ్చినా వారు ముందుగా అనుకున్న ముహుర్తానికే కళ్యాణం చేసుకున్నారంటే వారి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Photos of couple’s unique wedding after bride tests COVID-19 positive goes viral in social media

సాధారణంగా వివాహానికి ముందు కోవిద్-19 పాజిటివ్ వస్తే ఎవరైనా వారి వివాహా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారు. మన దేశంలో కరోనా పాజిటివ్ కారణంగా ఏకంగా విడాకులు తీసుకున్నారు కొందరు ప్రబుద్ధులు. కానీ ఈ జంట మాత్రం కరోనా వచ్చినా ఏ మాత్రం భయపడకుండా.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కళ్యాణం చేసుకున్నారు.

Photos of couple’s unique wedding after bride tests COVID-19 positive goes viral in social media

వీరు కూడా పాజిటివ్ గా థింక్ చేసి పెళ్లి చేసుకున్న విధానం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఇలా కూడా చేయొచ్చనేలా ఆలోచింపజేసింది. దీంతో వారి వివాహ వేడుక సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ జంట ఏమి చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

'పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కరోనా కాలంలో తను నాతో మళ్లీ కలవాలంటోంది..''పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కరోనా కాలంలో తను నాతో మళ్లీ కలవాలంటోంది..'

పెళికి 3 రోజుల ముందు..

పెళికి 3 రోజుల ముందు..

వారిద్దరూ పెద్దలందరూ సమక్షంలో వివాహ వేడుకలో ఒక్కటవుదామని నిర్ణయించుకున్నారు. అప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా కాలంలో ఎందుకైనా మంచిదని కోవిద్-19 టెస్టులు చేయించుకుంటే సరిగ్గా ముహుర్తానికి మూడు రోజుల ముందు పెళ్లికూతురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.

పాజిటివ్ థింకింగ్..

పాజిటివ్ థింకింగ్..

అయితే వధువుకు కరోనా పాజిటివ్ వచ్చిందని వీరు కళ్యాణాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారు. ముందుగా పెళ్లి ఎలా జరపాలా అని పాజిటివ్ గా థింక్ చేశారు. ఇక కరోనా నిబంధనల ప్రకారం వధువు హోం క్వారంటైనులో వెళ్లాల్సి వచ్చింది. కానీ వీరి సానుకూల ఆలోచన కారణంగా వీరి పెళ్లికి మార్గం సుగమమైంది.

వినూత్నపెళ్లి..

వినూత్నపెళ్లి..

పెళ్లికూతురు క్వారంటైనులో ఉండగానే వరుడు తన భాగస్వామిని వినూత్నంగా వివాహం చేసుకున్నారు. ఆ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతే వీరి వివాహ వేడుకల ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. ఇదంతా ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ పగ పెంచుకుంటూ పోతారు...!ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ పగ పెంచుకుంటూ పోతారు...!

కాలిఫోర్నియాలో..

కాలిఫోర్నియాలో..

అయితే ఇదంతా ఇండియాలో మాత్రం జరగలేదు. ఈ వివాహ వేడుక అంతా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జంటది. వారి పేర్లు ఫాట్రిక్ డెల్గాడో, లారెన్ జిమెనెజ్. కరోనా వైరస్ వీరి కళ్యాణ వేడుకల ఆశలను చిదిమేయాలని చూసినా.. వీరు పాజిటివ్ గా ఆలోచించారు. వివాహం అనే బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి ఆపడం ఇష్టం లేని..

పెళ్లి ఆపడం ఇష్టం లేని..

అప్పటికే పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ జంట కరోనా పేరిట కళ్యాణ వేడుకలు ఆపడం ఇష్టం లేకపోవడంతో.. ముందుగా వారు అనుకున్న ముహుర్తానికే వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో పెళ్లి కొడుకు వెరైటీగా మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచించాడు.

పెళ్లి ముహుర్తాన..

పెళ్లి ముహుర్తాన..

ఇక పెళ్లి రోజు రావడంతో లారెన్ యథావిధిగా వైట్ డ్రెస్సులో అందంగా ముస్తాబైంది. తమ జీవితంలో వచ్చే మధురమైన క్షణాలకు ఎలాంటి అడ్డంకులు రాకూడదని ఆ జంట భావించింది. కేవలం దగ్గరి బంధువులు, శ్రేయోభిలాషులను మాత్రమే వారి వివాహానికి ఆహ్వానించారు.

మాస్కు పెట్టుకోకుండా..

మాస్కు పెట్టుకోకుండా..

ఇక్కడ మరో విశేషమేమిటంటే.. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటలో వధూవరులిద్దరూ మాస్కును పెట్టుకోకుండా పెళ్లి తంతును పూర్తి చేశారు. దీన్నంతా కెమెరాలో బంధించడానికి ముందుగానే ప్రిపర్ అయ్యారు.

సినిమాలో మాదిరిగా..

సినిమాలో మాదిరిగా..

మరి వీరు వివాహం ఎలా చేసుకున్నారని ఆలోచిస్తున్నారా? వీరి పెళ్లికి యానిమేషన్ సినిమా ‘టాంగ్లెడ్' ప్రేరణగా మారింది. ఇక అసలు విషయానికొస్తే.. వధువు క్వారంటైనులో రెండో అంతస్తులో ఉండగా.. ఆ గది కిటికీ నుండి బయట నేల మీద వరకు వస్త్రంతో ఓ తాడు లాంటిదాన్ని ఏర్పాటు చేశారు.

తాడును గట్టిగా పట్టుకుని..

తాడును గట్టిగా పట్టుకుని..

దాని రెండు చివరి అంచుల దగ్గర ఇద్దరూ తమ చేతులను కట్టుకున్నారు. ఆ తాడును ఎన్నటికీ విడిపోని తమ బంధానికి గుర్తుగా భావిస్తూ తమ వివాహ వేడుకను ముగించారు. ఇది ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ జెస్సికా జాక్సన్ ఈ జంట పెళ్లి తంతును కెమెరాలో బంధించారు.

నెటిజన్ల ప్రశంసలు..

నెటిజన్ల ప్రశంసలు..

పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వాటితో పాటు కొన్ని వివరాలను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారడంతో ఈ జంట పెళ్లి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ జంటకు పెళ్లి చేసుకున్న తీరు గురించి తెలుసుకున్న నెటిజన్లు వారెవ్వా వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

లాక్ డౌన్ కాలంలో

విధి వివాహం ఎవరితో జరగా

All Images Credited to : Instagram

English summary

Photos of couple’s unique wedding after bride tests COVID-19 positive goes viral in social media

Here we talking about the photos of couple's unique wedding after bride tests covid-19 positive goes viral in social media. Read on
Story first published:Wednesday, December 9, 2020, 16:41 [IST]
Desktop Bottom Promotion