Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Promise Day 2023: ప్రామీస్ డే రోజున కొన్ని ప్రత్యేక వాగ్దానాలు చేయండి.. మీ ప్రేయసి మనసు దోచేయండి...
ప్రామీస్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ కోట్స్, మెసెజెస్ పంపి వారి మనసులో చోటు సంపాదించండి...
వాలెంటైన్ వీక్ లో భాగంగా ఐదో రోజైన ఫిబ్రవరి 11వ తేదీన ప్రామీస్ డే జరుపుకుంటారు. ఏ రిలేషన్ షిప్ లో అయినా నమ్మకం ఉండటం అనేది చాలా ముఖ్యం. అదే విధంగా కపుల్స్ మధ్య రిలేషన్ లో కూడా ఇది వర్తిస్తుంది. ఈ సందర్భంగా మీ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మీ భాగస్వామికి ఇలా ప్రామీస్ చేయండి.

ప్రామీస్ డే రోజున మీరు చేసే ప్రత్యేక వాగ్దానాలతో వారికి మీపై ప్రేమ మరింత పెరిగిపోతుంది. అవే మీ ఇద్దరి మధ్య సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంబంధాలకు బేస్ మెంట్ గా ఉంటుంది.

అయితే ఎలాంటి వాగ్దానం చేస్తే మీ ప్రియురాలు ఫిదా అవుతుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం కొన్ని అద్భుతమైన కోట్స్, మెసెజెస్ ను మీ కోసం తీసుకొచ్చాం.. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి... మీ ప్రేయసి మనసులో పర్మినెంట్ ప్లేస్ కొట్టేయండి..

ఎంతమంది ఉన్నా..
ఈ లోకంలో ఎందరో ఉన్నా..
నేను నిన్నే ఎందుకు ఇష్టపడ్డానంటే..
ఈ లోకం నన్ను ఒంటరిని చేసినా..
నువ్వు మాత్రం నన్ను ఒంటరి చేయవనే నమ్మకం
హ్యాపీ ప్రామీస్ డే

చీకట్లో వెలుగులా..
నేను నీకు నీడలా ఉంటా..
నీవెక్కడికి వెళితే అక్కడికి తోడుగా వస్తా..
అయితే ఆ నీడ చీకట్లో కనిపించదు..
కానీ నేను ఆ చీకట్లో వెలుగవుతాను..
హ్యాపీ ప్రామీస్ డే

ఇలాంటి వాగ్దానం..
ఈ 2021 ఏడాదిలో నేను ఎలాంటి వాగ్దానం చేయలేదు..
కానీ నేను నిన్ను తొలిసారి చూసినప్పుడు మాత్రం..
జీవితాంతం నిన్నే ప్రేమిస్తానని వాగ్దానం చేశాను.
హ్యాపీ ప్రామీస్ డే..

నిన్ను కలవడానికి ముందు..
నిన్ను కలవకముందు వరకు నేను దిక్కులేనివాడిని..
నువ్వు నా జీవితంలోకి వచ్చాక కొత్త అర్థం ఇచ్చావు..
అందుకే నేను జీవితాంతం నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నా..
హ్యాపీ ప్రామీస్ డే..

నాతోనే ఉంటావని..
మీరు ఎప్పటికీ మరియు ఎల్లప్పుడూ నాతో ఉంటారని నాకు ప్రామీస్ చేయండి..
హ్యాపీ ప్రామీస్ డే

కలల్ని నెరవేర్చుకునేందుకు..
మనిద్దరికీ ఉన్న కలలను కలిసి..
సాకారం చేసుకుందాం..
నేను చేసే ఉత్తమమైన పని..
నిన్ను ఎప్పటికీ హ్యాపీగా చూసుకుంటానని
వాగ్దానం మాత్రం చేయగలను..
హ్యాపీ ప్రామీస్ డే..

ఎప్పటికీ హ్యాపీగా..
నేను ఎలాంటి స్వార్థం లేకుండా..
నిన్ను శ్రద్ధగా చూసుకుంటానని
నిన్ను ఎల్లప్పుడూ హ్యాపీగా చూసుకుంటానని
వాగ్దానం చేయగలను..
హ్యాపీ ప్రామీస్ డే

నీకు రక్షణగా..
నేను నిన్ను ఎలప్పుడూ రక్షిస్తాను..
దాన్నే తొలి ప్రాధాన్యతగా భావిస్తాను..
ఎందుకంటే నువ్వే నా లైఫ్...
హ్యాపీ ప్రామీస్ డే మై డార్లింగ్

నిన్ను ప్రేమిస్తూనే..
నీ నవ్వు నాతో ఉంటే చాలు..
నా తుది శ్వాస ఆగే వరకు
నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని
వాగ్దానం చేస్తున్నా..
హ్యాపీ ప్రామీస్ డే

నీకు అండగా..
బాధలోనూ, సంతోషంలోనూ..
ఆరోగ్యంలోనూ.. అందంలోనూ..
నేను నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని
వాగ్దానం చేస్తున్నాను.
హ్యాపీ ప్రామీస్ డే
వాలెంటైన్ వీక్ లో భాగంగా ఐదో రోజైన ఫిబ్రవరి 11వ తేదీన ప్రామీస్ డే జరుపుకుంటారు. ఏ రిలేషన్ షిప్ లో అయినా నమ్మకం ఉండటం అనేది చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications
