For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగువలు అలాంటి మగాళ్లతోనే ఎందుకని ఎక్కువగా గడపాలనుకుంటారో తెలుసా...

ఆ వయసులో ఉండే మగవారితోనే డేటింగ్ చేసేందుకు అమ్మాయిలు ఎందుకు ఆసక్తి చూపుతారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు. చదువు, ప్రేమతో పాటు అనేక విషయాల్లో అమ్మాయిలే అగ్రస్థానంలో నిలుస్తూ ఉంటారు. మనలో ఎవరైనా పుట్టినప్పటి నుండి ఆడ, మగ వారికి వయసు, వయసుకీ మధ్య చాలా తేడా ఉంటుంది.

Reasons Why Women Rethink Dating Men Their Age

అయినా కూడా ప్రతి ఒక్క అంశాన్ని స్త్రీ, పురుషుల వయసుకు మన సమాజం లింక్ పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ వయసులో ఇలా చేయాలి.. ఆ వయసులో అలా చేయాలి..

Reasons Why Women Rethink Dating Men Their Age

ఈ వయసులోనే ఇంత పెద్ద పనులా? అనే మాటలు మన పెద్దలు చిన్నప్పటి నుండే చెబుతూనే ఉంటారు. అయితే ప్రతి ఒక్క అమ్మాయికైనా, అబ్బాయికైనా ఓ వయసు వచ్చాక.. తమకు ఓ భాగస్వామి కావాలనే ఆశ పుడుతుందట. అందుకే ఈ మధ్యన చాలా మంది డేటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. డేటింగులో పాల్గొంటున్నారు కూడా.

Reasons Why Women Rethink Dating Men Their Age

అయితే చాలా మంది మహిళలు తాము కలవబోయే భాగస్వామికి సుమారు ఇంత వయసు ఉండాలని ఆశిస్తారట. అలాంటి అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అమ్మాయిలు ఏ వయసు ఉండే మగవారిని ఎక్కువగా ఇష్టపడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆడవారిని ఆకర్షించడానికి ప్రతి ఒక్క మగాడు పెంచుకోవాల్సిన నైపుణ్యాలివే...ఆడవారిని ఆకర్షించడానికి ప్రతి ఒక్క మగాడు పెంచుకోవాల్సిన నైపుణ్యాలివే...

ఓ మాదిరిగా..

ఓ మాదిరిగా..

ఇప్పటితరం అమ్మాయిలు తమకు కాబోయే భాగస్వామి తమ కన్నా కొంత పెద్ద వారైతే చాలని కోరుకుంటున్నారట. తమ మధ్య ఓ మాదిరి ఏజ్ గ్యాప్ ఉంటే సరిపోతుందని.. అలాంటి వారు ఇప్పటికే లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉంటారని.. తమ కన్నా బాగా ఆలోచిస్తారని భావిస్తారట. అయితే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండకూడదని కోరుకుంటున్నారట.

సేమ్ ఏజ్ ఉంటే..

సేమ్ ఏజ్ ఉంటే..

చాలా మంది అమ్మాయిలు తాము డేటింగులో పాల్గొనే అబ్బాయి లేదా తాము పెళ్లి చేసుకున్న పురుషుల వయసు సమానంగా ఉండకూడదని భావిస్తారట. అలాంటి వారిపై అస్సలు ఆసక్తి చూపరట. తమ వయసుతో సమానంగా ఉండే వారు అచ్చం తమలాగే ఆలోచిస్తారని.. చాలా వరకు అభిప్రాయాలు ఒకేలా ఉంటాయని, ఇలాంటి వారితో జీవితం ఆనందంగా ఉండదని భావిస్తారట.

ఆ కార్యం విషయంలో..

ఆ కార్యం విషయంలో..

వయసు సంగతి పక్కనబెడితే.. చాలా మంది అమ్మాయిలు ఆ కార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే రొమాన్స్ విషయంలో అబ్బాయిలకు కొంత ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడెప్పుడూ ఆ కార్యంలో పాల్గొందామా అని కలలు కంటూ ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం ఆ కార్యంపై అంత తొందరగా ఆసక్తి చూపరట. ఎవరైనా ఒత్తిడి చేస్తే, అలాంటి వారిని అస్సలు ఇష్టపడరట. కానీ తమ మనసును ఎవరైతే గెలుచుకుంటారో.. తమ మనసుకు నచ్చిన పని చేసిన వారితో మాత్రం ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారట.

బలమైన మహిళలు మగవారి కోసం ఎప్పుడూ చేయకూడని పనులేంటో తెలుసా...బలమైన మహిళలు మగవారి కోసం ఎప్పుడూ చేయకూడని పనులేంటో తెలుసా...

మరీ పెద్దవారిని..

మరీ పెద్దవారిని..

అయితే తమ కంటే వయసులో మరీ పెద్దవారిని పెళ్లి చేసుకుంటే.. తాము ఒక్క విషయంలో కచ్చితంగా ఇబ్బంది పడతామని మహిళలు భావిస్తారట. వాళ్లు వయసులో పెద్దోళ్లు కాబట్టి.. తమదే ఆధిపత్యం కొనసాగాలని, తమదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారట. అంతేకాదు అలాంటి వారు అమ్మాయిల మనసును పెద్దగా అర్థం చేసుకోరని, అలాంటి సమయం కూడా ఇవ్వరని ఓ అధ్యయనంలో తేలిందట.

వయసులో పెద్దవారైనా..

వయసులో పెద్దవారైనా..

అయితే ఆ ఒక్క విషయంలో ఆధిపత్యాన్ని లేదా దూకుడును ఏ పురుషులైతే తగ్గించుకుంటారో.. మహిళలకు సమాన ప్రాధాన్య ఇస్తారో.. మహిళల మనసును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారో.. అలాంటి వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. కాబట్టి మగవాళ్లు మగువల మనసులు గెలుచుకునే ఆ ఒక్క విషయంలో కంట్రోల్ ఉంటే చాలు.. మీకు కావాల్సింది సులభంగా పొందొచ్చు.

English summary

Reasons Why Women Rethink Dating Men Their Age

Here are the reasons why women rethink dating men their age. Have a look
Story first published:Monday, May 31, 2021, 14:38 [IST]
Desktop Bottom Promotion