For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నారనేందుకు సంకేతాలు...

అయితే చాలా మంది భార్యభర్తలు ఈ బంధాన్ని గ్రహించలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు.

|

భార్యాభర్తల సంబంధం అంటే చాలా మంది కేవలం అలాంటి సంబంధమే అనుకుంటూ ఉంటారు. అయితే భార్యభర్తలిద్దరూ కొన్నిసార్లు కళ్లతో చూసే దాని కంటే ముఖ్యమైన విషయాలు జీవితంలో చాలా ఉన్నాయని వారు గ్రహించడానికి ఎక్కువ సమయం అనేది అస్సలు పట్టదు.

Signs That Say You Married The Wrong Person

ఇది శృంగార వివాహం మరియు నిశ్చితార్థం రెండింటికీ వర్తిస్తుంది. అయితే మీరు తప్పుడు వ్యక్తులతో వివాహం చేసుకున్నారని ముందుగా తెలుసుకోవడం అనేది మీ జీవితానికి చాలా చాలా ముఖ్యం.

అయితే వివాహిత జంటలలో వాదనలు, తగాదాలు అనేవి అత్యంత సాధారణమే. అయితే చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకోవడం.. విడిపోవాలి అనుకోవడం అవివేకమే అవుతుంది.

Signs That Say You Married The Wrong Person

అయితే మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నారని, మీకు కచ్చితంగా తెలిస్తే వెంటనే ఆ సంబంధం నుండి బయటపడటం మంచిది. మీరు తప్పు వ్యక్తిని వివాహం చేసుకున్నారనే వాస్తవం మీ సంబంధంలోని కొన్ని సంకేతాలను గుర్తించవచ్చు. ఈ సందర్భంగా ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం...

ఎప్పుడూ విచారంగా ఉంటే..

ఎప్పుడూ విచారంగా ఉంటే..

వివాహ విషయంలో ఛేదు నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వాస్తవంగా, విచారంగా లేదా సంతోషంగా ఉండటం అసాధారణం కాదు. అయితే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భాగస్వామి మీకు సంతోషంగా అనిపించకపోతే మీరు ఆందోళన చెందాల్సిన విషయమే అది. ఇలాంటి విషయాలు ప్రతిరోజూ కఠినంగా ఉంటాయి. నిత్యం ఇలాగే, ఉంటే, మీ సమస్యకు మీ జీవిత భాగస్వామి కారణమనే గుర్తించాలి.

వాదనలు, తగాదాలు సహజం..

వాదనలు, తగాదాలు సహజం..

వివాహ జీవితంలో వాదనలు, తగాదాలు అనేవి సాధారణంగా ఉంటాయి. అయితే ఇలాంటివి నిత్యం ఉంటే మాత్రం అది ఇబ్బందికరమనే విషయాన్ని గ్రహించాలి. ఇలాంటివి రోజురోజుకు పెరిగిపోయి, మీ భవిష్యత్తు కూడా అద్వానంగా మారుతుంది. ఇలా మీ వివాహ బంధంలో ప్రతిరోజూ జరుగుతూ ఉంటే, మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా లేరని అర్థం.

ప్రాధాన్యతలలో తేడా...

ప్రాధాన్యతలలో తేడా...

మీ వివాహ సంబంధం యొక్క బలాన్ని నిర్ణయించడంలో ప్రాధాన్యతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వివాహ బంధంలో ఆర్థిక, పని లక్ష్యాలు లేదా దీర్ఘకాలిక ప్రణాళిక వంటి అనేక విషయాలలో శ్రద్ధ అవసరం. మీరు మీ కెరీర్ ప్రణాళికలకు ప్రాధాన్యతనిచ్చేటప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని గుర్తించాలి లేదంటే మీ వివాహ జీవితంలో గందరగోళం ఏర్పడవచ్చు.

నిజాయితీ లేకపోవడం..

నిజాయితీ లేకపోవడం..

నిజాయితీ అనేది ఏదైనా సంబంధానికి ఆధారంగాఉంటుంది. ఇలాంటివే మీ సంబంధంలో పారదర్శకతను నిర్ణయిస్తుంది. ఇలాంటి వాటి వల్లే మీకు మరియు మీ భాగస్వామి యొక్క సమతులత్యతను కాపాడుతుంది. మీరు మీ భాగస్వామికి నిరంతరం అబద్ధాలు చెబుతూ, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే మీరే అనవసరంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని గుర్తించాలి. ఇలాంటివి జరిగినప్పుడు, వీటిని కప్పిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని మీరు భావిస్తే, మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుని మీ వివాహ బంధం గురించి పునరాలోచించాలి.

కమ్యూనికేషన్ ముఖ్యం..

కమ్యూనికేషన్ ముఖ్యం..

ఆరోగ్యకరమైన సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అయితే మీ ఇద్దరికీ ఉమ్మడిగా ఉండే విషయాలైతే పర్వాలేదు. మీరు మీ భాగస్వామి మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంటే, ఎన్ని గంటలైనా చాలా ఓపెన్ గా ముచ్చటించవచ్చు. అలా కాకుండా మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ముచ్చటించుకోకపోతే, మాటల పట్ల గురించి ఆసక్తి చూపకపోతే, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఆసక్తి లేదనడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మీరు చెడు సంబంధంలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

ఒంటరిగా ఉంటే..

ఒంటరిగా ఉంటే..

మీరు వివాహం చేసుకుని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి ఉండకుండా ఒంటరిగా ఉండటానికి ఆసక్తి చూపితే, అదే మీకు సౌకర్యంగా అనిపిస్తే, మీరు వివాహ బంధం గురించి పునరాలోచించుకోవాలి. ఇది మహిళలకు కూడా వర్తిస్తుంది. వివాహం సాంగత్యం మరియు అనుకూలత గురించి అయినప్పటికీ, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఉత్తమమైనవారని మీరు భావించినప్పుడు, మీ వివాహం బంధంలో ఏదీ సరైనదిగా అనిపించదు. అలాగే మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్లే ఒంటరిగా ఉంటున్నారని భావించొచ్చు.

ఇతరుల గురించి ఆలోచన..

ఇతరుల గురించి ఆలోచన..

చాలా వివాహ బంధాల్లో వచ్చే వివాస్పదమైన మరియు అనివార్య సంకేతం ఇది. మనలో చాలా మంది ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ ఆ ద్రుష్టితో చూడం. పైగా మనం ఎవరినైతే వివాహం చేసుకుంటామో వారి నుండే ప్రేమను కోరుకుంటాము. అయితే కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత ఇతరుల ప్రేమను కోరుకుంటే ఏమి చేయాలో అనే విషయం మీకు బాగా తెలుసు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీ భాగస్వామిది తప్పు అని నిర్ధారించుకోండి.

ఎప్పుడూ అవమానించడం...

ఎప్పుడూ అవమానించడం...

మీ జీవిత భాగస్వామిని ఎప్పుడూ ఇతరుల ముందు అగౌరవపరచడం మీరు తప్పు వ్యక్తిని వివాహం చేసుకున్నారనే శక్తివంతమైన సంకేతం. వివాహం అంటే మీ జీవిత భాగస్వామిని గౌరవించడం, అతన్ని అవమానించడం లేదా వారి బలహీనతలను ఎత్తి చూపడం కాదు. ఈ సంఘటన తరచుగా జరుగుతూ ఉంటే, మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.

బాగా ఆలోచించాలి...

బాగా ఆలోచించాలి...

కొన్నిసార్లు మన వివాహంలో కష్టమైన దశలో ఉన్నప్పుడు, ఏవేవో ఆలోచనలు రావడం సహజమే. పోరాటాలు, దుర్వినియోగం మరియు నిరాశ వల్ల మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నారని అనుకోవచ్చు. కానీ మీరు అలా ఆలోచించే పరిస్థితులు. ఏదేమైనా, పైన పేర్కొన్న లక్షణాలన్నీ మీ జీవితంలో సంభవిస్తున్నాయని మీరు గ్రహించిన తర్వాత, మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి ఉండకూడదా అని మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి సందర్భాల్లో మీరు సహాయం తీసుకోవాలి. సరైన సహాయం మరియు పరిష్కారంతో మీ వైవాహిక సంబంధం మెరుగుపడకపోతే, తరువాత ఏమి చేయాలో ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

English summary

Signs That Say You Married The Wrong Person

Find out the signs that say you married the wrong person. Read on.
Story first published:Tuesday, April 21, 2020, 18:54 [IST]
Desktop Bottom Promotion