Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
మీ భాగస్వామి ఇలాంటి మాటలు చెబుతుంటే వారికి అసూయ ఉన్నట్టే...!
మీరు తనతో సరదాగా గడపటం లేదని, ఆ సమయం ఎవరితోనో గడుపుతున్నారోననే అసూయ వంటివి పెంచుకోవడాన్ని మీరు గమనించవచ్చు.
మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. ప్రేమించి వివాహం చేసుకున్నా లేదా ప్రేమికులుగా ఉన్న వారయినా సాధారణంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి తగాదాలలో ఎక్కువగా అసూయ వల్లే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే మన సమాజంలో చాలా మంది అబ్బాయిలు తమ ఫీలింగ్సుని తమ వరకూ ఉంచుకోవడానికి అలవాటు పడి ఉంటారు. ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.

అయితే వారిలో అసూయ(Jealousy) పెరిగిపోతే మాత్రం అది మీ వివాహ బంధం లేదా ప్రేమ బంధంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. అందువల్ల వారు ఏయే విషయాల్లో అసూయ పడుతున్నారు అనే విషయాలను వారి మాటలను బట్టి తెలుసుకోవచ్చట. దీని వల్ల వారు తమ మనసులో ఫీలింగ్స్ ను ఎంత దాచాలనుకున్నా.. వారి సంకేతాలు మాత్రం బయటికొస్తుంటాయట. అలాంటి మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అసూయ పెంచుకోవడాన్ని..
మీరు తనను వదిలి పెట్టి వెళ్లడం అనేది వారికి ఇష్టం ఉండదు. మీరు తనతో ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మిమ్మల్ని ఆపడం కూడా తనకు ఇష్టం లేదని వారి మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. మీరు తనతో సరదాగా గడపటం లేదని, ఆ సమయం ఎవరితోనో గడుపుతున్నారోననే అసూయ వంటివి పెంచుకోవడాన్ని మీరు గమనించవచ్చు.

నేను గర్ల్ ఫ్రెండ్ తో బయటికెళ్తున్నా..
మీరు ఎవరైనా అబ్బాయిలతో బయటకు వెళ్తున్నట్లు మీ భాగస్వామికి చెప్పినప్పుడు ఇలాంటి రిప్లై వస్తే వారు కచ్చితంగా అసూయ పడుతున్నారని గుర్తించవచ్చు. అవునా ఏం పర్వాలేదు.. ‘నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నా‘ అనే మాటలను చెబితే వారు మీపై ఎంతలా అసూయపడుతున్నారో మీకు తెలియాలని అలా చెబుతుంటారు. అయితే నిజంగా అయితే మాత్రం అలా వెళ్లరు. కేవలం మీరు కూడా అసూయపడాలని, అలా అబద్ధం చెబుతుంటారు.

ఎవరైనా అబ్బాయితో ఎక్కడికైనా..
చాలా మంది భర్తలు వారి భార్యలతో మరో అబ్బాయి ఉంటే వారిని నమ్మడం చాలా కష్టమే. అలాంటి సమయంలో కేవలం మీరు మాత్రమే, మరో అబ్బాయి మాత్రమే ఎక్కడికైనా వెళ్తున్నారంటే వారు తప్పక అసూయ పడతారు. మీపై వారికి ఎంతగా నమ్మకం ఉన్నా.. అతను కూడా ఓ అబ్బాయి కాబట్టి అబ్బాయిలు తనతో పాటు వచ్చే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో తనకు తెలుసు కాబట్టి, మీరు అలా ఎవరితో అయినా ఎక్కడికైనా వెళ్తానంటే వారు కంగారు పడటం సహజం.

నేను అసూయ పడట్లేదు..
మీ భాగస్వామి తాను అసూయ పడటం లేదని చెప్పడం వంటివి చూస్తేనే తను అసూయ పడుతున్నారని మీకు అనుమానం వస్తుంది. అయితే ఇది మీపై ప్రేమతో లేదా శ్రద్ధతో కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే మీరు తనతో సరదాగా గడపట్లేదని విషయంలో మాత్రం మీ భాగస్వామి అసూయపడుతున్నట్టే..

ఇంటికెప్పుడొస్తావు..
సాధారణంగా మీరు ఎక్కడికైనా వెళ్లి ఇంటికి వెళ్లి ఆలస్యంగా కంగారు పడతారు. అయితే రాత్రి 7 గంటలు దాటిన సమయంలో కూడా అబ్బాయిలతో ఉంటే వారికి అది కూడా చాలా ఆలస్యమని ఫీలవుతారు. ఎందుకంటే అబ్బాయిలతో ఉన్నారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన వల్లే ఇలాంటి వాటికి కారణమవుతాయి.

బాయ్ ఫ్రెండ్ విషయంలో..
మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మీ భర్త మిమ్మల్ని అసూయపడుతున్నారు అనడానికి ఒక సంకేతంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విషయం నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు అని అనుమానంగా అడగటం వంటివి చేసినప్పుడు కూడా మీరు ఆ నిర్ణయానికి రావచ్చు.

తనతోనే గడపాలని..
ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు అర్థారత్రి మీరు స్నేహితులతో సమయం గడిపి అలసిపోకుండా లాంగ్ డ్రైవ్ లాగా తనతో సమయం గడపాలన్నది తన కోరిక.

ఇలాంటివి నిజం..
మీరు ఇంటికి వచ్చే సమయానికి తను ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హడావుడి చేయడం.. మీరు బయలుదేరాక ఫోన్ చేయమని చెప్పడం.. మీరెప్పుడూ ఫోన్ చేస్తారా? అని వెయిట్ చేస్తూ కూర్చోవడమనేది నిజమే. ఇందుకోసం డోర్ తీసి బయటకు వచ్చి మీ కోసం మాత్రం కనీసం ఒక యాభైసార్లయినా చూస్తారు.

మీరు మాత్రమే అందంగా..
ఈ ప్రపంచంలో నా భార్య కంటే ఎవ్వరూ అందంగా లేరని, మీకు ప్రేమను వ్యక్తపరిస్తే... మీరు తనకు మాత్రమే సొంతం అవ్వాలని కోరుకుంటున్నారని అర్థం. ఇలాంటివి చాలా సర్వసాధారణం.

అంతేనా ఇంకేం లేదా?
మీరు ఎవరైనా అబ్బాయితో లేదా మీ బాయ్ ఫ్రెండ్ తో ఏదైనా విషయాలు మాట్లాడినప్పుడు అవునా.. అంతేనా.. ఇంకేం లేదా? కుటుంబ విషయాల గురించి ఏమి మాట్లాడలేదా? రొమాంటిక్ ముచ్చట్లేమీ పెట్టలేదా? ఏమీ లేవంటే నేనే అనవసరం గా టెన్షన్ పడినట్టు అనేది వారి ఫీలింగ్. మీరు నిజం చెప్పినా కూడా మీరు మాట్లాడుకున్న వాటినన్నింటినీ చెప్పలేదేమో అనే భావిస్తుంటారు. ఇలాంటి వాటిని అసూయకు ఉదాహరణగా చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications
