For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి స్త్రీలు బ్యాడ్ బాయ్స్ తోనే బాగా ఎంజాయ్ చేస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

|

ఒకప్పుడు అమ్మాయిలంతా తమకు శ్రీరాముడు లాంటి గుణవంతుడు.. సౌమ్యుడు.. ఏకపత్నీ వ్రతుడు.. పరస్త్రీల వంక కనీసం కన్నెత్తి చూడని మగాళ్లు కావాలని ఆశించేవారు.

అయితే కాలం మారుతున్న కొద్దీ అమ్మాయిలు అన్ని విషయాల్లో అప్డేట్ అవుతున్నారు. అయితే మంచి విషయాల కంటే చెడు విషయాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందులోనూ శృంగారం విషయంలో అస్సలు తగ్గడం లేదు.

ఇది వరకు చాలా మంది శృంగార జీవితానికి సంబంధించి ఏవైనా ఫాంటసీలు ఉంటే తమ మనసులోనే దాచుకునే వారు. ఎప్పటికీ బయటికి చెప్పేవారు కాదు. అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది.

ఒకప్పుడు శ్రీరాముడి లాంటి సౌమ్యుడు.. గుణవంతుడు.. ఏకపత్నీవ్రతుడు కావాలని కోరుకున్న అమ్మాయిలు.. ఇప్పుడు మాత్రం అలాంటి వారిని కోరుకోవట్లేదు.. పూరి సినిమాలో 'We Love Bad Boys'సాంగ్ లాగా తమకు కూడా చిలిపి క్రిష్ణుడే కావాలని కోరుకుంటున్నారట. అయితే ఇది అక్షరాలా నిజమంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. రాశిచక్రాన్ని బట్టి వారికి అలాంటి కోరికలు ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఏయే రాశుల మహిళలు బ్యాడ్ బాయ్స్ కావాలంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వే! ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు పోటీ పడుతున్నారో తెలుసా...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి మహిళలు ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరు పైకి చాలా అమాయకులుగా కనిపించినా థ్రిల్లింగ్.. డేరింగ్.. ఫన్నింగ్ వంటి విషయాలను బాగా ఇష్టపడతారట. అందుకే వీరు రెబల్ లా ఉండే మగవారిని బాగా ఇష్టపడతారట. సమాజం గురించి అస్సలు పట్టించుకోకుండా తమ మనసు చెప్పిన మాటలనే వింటూ.. తమకిష్టమైన బ్యాడ్ బాయ్స్ ని లవ్ చేస్తారంట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి స్త్రీలకు చిలిపి క్రిష్ణులంటే బాగా ఇష్టమంట. వీరు ఎవరినైనా ఇష్టపడితే వారి మనసులోకి చాలా సులభంగా దూరేస్తారంట. వారి మత్తెక్కించే మాయ మాటలతో తమకు కావాల్సిన పురుషులను మైమరిపించేసి.. వారే తమ కోసం ఎదురు చూసేలా చేస్తారట. వీరు తమ కంటే ఎక్కువ ఫన్నీగా ఉండే పురుషుల కోసం, చిలిపి క్రిష్ణుల కోసం వెయిట్ చేస్తారట. వీరికి అలాంటి వారు దొరికితే మాత్రం పండగ చేసుకుంటారట.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశిచక్రం అమ్మాయిలు తమపై ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తారో.. అలాంటి వారినే బాగా ఇష్టపడతారట. వీరికి అమాయకంగా.. సున్నితంగా.. సూటిగా ఉండేవారంటే పెద్దగా ఆసక్తి ఉండదట. వీరిని డామినేట్ చేస్తూ.. వీరిని ఇబ్బంది పెట్టే బ్యాడ్ బ్యాయ్స్ నే బాగా ఇష్టపడతారట. వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే.. అలాంటి వారి వెంటే పడతారట. బ్యాడ్ బాయ్స్ కూడా వీరికి బాగా అట్రాక్టు అవుతారట.

మీరు శృంగారంలో రెట్టింపు ఆనందాన్ని పొందాలంటే... ఈ చిట్కాలను ట్రై చెయ్యండి...!

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి స్త్రీలు శృంగారం విషయంలో దూకుడును ఎక్కువగా ఇష్టపడతారట. వీరు ఆ కార్యంలో అస్సలు సమయాన్ని ఏ మాత్రం వేస్ట్ చేయరట. వీరికి ఎవరైనా భాగస్వామి అవసరం అయితే.. వీరు ఎలాంటి కండిషన్స్ పెట్టరట. గుడ్డిగా వారి జీవితంలోకి వెళ్లడమో.. లేదా వారిని వీరి లైఫ్ లోకి వెల్ కమ్ చేయడమో చేస్తారంట. అలాగే వీరికి కావాల్సిన దాని కోసం ఎలాంటి రూల్స్ అయినా బ్రేక్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట. అలా వీరికి కావాల్సింది సాధించుకుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశికి చెందిన మహిళలు ఎక్కువ మంది పురుషులతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారట. వారి కుటుంబ కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలను ఎవరైతే ఎదిరిస్తారో అలాంటి వారికి చాలా త్వరగా కనెక్ట్ అవుతారంట. వారితో గడపడానికి ఎంత దూరం అయినా వెళ్తారంట. ముఖ్యంగా అలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్ గా ఉంటారట.

అందరూ కాదండోయ్...!

అందరూ కాదండోయ్...!

పైన చెప్పిన ప్రకారం ఈ రాశి చక్రాల అమ్మాయిలందరూ ఇలానే ఉంటారని కాదు సుమా.. వారి వారి అవసరాలు.. వారు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం.. చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం, వారి జీవన విధానం ఇలాంటివన్నీ కలిసి వారిని బాగా ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.

English summary

These Zodiac Signs Women Love Dating Bad Boys In Telugu

Here are these zodiac signs women love dating bad boys. Take a look