Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
Ukraine Russia War:ఫొటో క్లిక్ తో పరిచయం.. వీడియో కాల్ లో ప్రపోజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఇండోర్ కుర్రాడు రష్యన్ అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రెండు వారాలుగా రష్యా ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తోంది.

ఉక్రెయిన్ కూడా తన శాయశక్తులా పోరాడుతోంది. ఇంత భీకర యుద్ధంలోనూ మన ఇండియన్లకు ఎలాంటి హాని జరగకుండా ఇరు దేశాల వారు సహకరించడం విశేషం. ఇప్పటికే చాలా మంది భారతీయులు ఇండియా వచ్చేశారు.

ఇదిలా ఉండగా.. రాకెట్ లాంఛర్లు.. మిస్సైల్ మోతలు.. బాంబుల దాడులు, తుపాకుల చప్పుళ్ల మధ్య ఓ ప్రేమ జంట ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎందుకంటే భయంకరంగా జరుగుతున్న యుద్ధం మధ్యే ప్రేమించిన ప్రియుడి కోసం రష్యా దేశాన్ని వదిలి ఇండియా వచ్చేసింది ఓ రష్యన్ అమ్మాయి.

ఇటీవలే ఆంధ్రా అబ్బాయిని పెళ్లి చేసుకున్న రష్యన్ అమ్మాయి.. ఇప్పుడు ఇండోర్ లో ఉన్న తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులను దాటి వచ్చేసింది. అంతే వీరి ప్రేమ పెళ్లి గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ తన లవ్ స్టోరీ ఏంటి.. ఇంతకీ తను ప్రేమించిన పెళ్లి చేసుకున్న కుర్రాడెవరు? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పీటర్స్ బర్గులో మొదలైన ప్రేమ..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యన్ అమ్మాయి అలీనా బార్కోల్సీవ్ పెళ్లిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇండోర్ నివాసి అయిన రిషి వర్మ హైదరాబాదులో క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశాడు. రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్ లో చెఫ్ గా పని చేస్తున్నాడు. యూరోపియన్ దేశాలకు కూడా వెళ్లొచ్చాడు. ఈ యువ చెఫ్, రష్యన్ యువతి అలీనా మధ్య తొలిసారి సెయింట్ పీటర్స్ బర్గులో కలిశారు. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

ఫొటో కావాలని..
తొలిసారి కలుకుసుకున్న వెంటనే వీరిద్దరి కళ్లు కళ్లు కలిశాయి.. మాటలు ప్రారంభమయ్యాయి.. అంతే ఆ వెంటనే ఫొటో కావాలనే నెపంతో ముచ్చట్లు మొదలెట్టారు. ఇదంతా ఎప్పుడో తెలుసా.. కరోనాకు ముందు అంటే 2019 సంవత్సరంలోనే. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటినుండి రెగ్యులర్ గా ఫోన్లలో మాట్లాడుకునేవారు. అంతలోనే ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.

వీడియో కాల్ లో ప్రపోజ్..
లాక్ డౌన్ కారణంగా ఇండియా వచ్చిన రిషి వర్మ అలీనాతో రెగ్యులర్ గా వీడియో కాల్ చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ప్రేమ పీక్ స్టేజీకి చేరుకుంది. అంతే ఓ రోజు వీడియో కాల్ లోనే అలీనాకు ప్రపోజ్ చేశాడు. అంతే రిషి ప్రపోజల్ కు వెంటనే ఒకే చెప్పేసింది.

2021లో వివాహం..
అలా వీరిద్దరి మధ్య రెండు సంవత్సరాల పాటు ప్రేమ ప్రయాణం కొనసాగింది. అనంతరం 2021 డిసెంబర్లో కరోనా మహమ్మారి తగ్గిపోవడంతో.. లాక్ డౌన్ కూడా ఎత్తేశారు. అంతే అదే సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఫిబ్రవరి 24న..
అనంతరం 2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇండోర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు పెళ్లికి సన్నాహాలు ప్రారంభించారు. అంతే అక్కడే అందరి సమక్షంలో, ఆ దేశ చట్టం ప్రకారం, ఫిబ్రవరి 24వ తేదీన కోర్టులో రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు.

డిసెంబరులో వివాహం..
ఈ సందర్భంగా కొత్త జంట మీడియాతో మాట్లాడుతూ, మా ఇద్దరికీ డిసెంబర్ నెలలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరుగుతుందని చెప్పారు. 2022లో అంటే ఇదే ఏడాదిలో మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. కోర్టు వివాహం ఇటీవలే జరగడంతో, అలీనా రిషి ఇంట్లోనే నివాసం ఉంటోంది. అంతేకాదు అలీనా కుటుంబ పనిలో సహాయం చేస్తోంది. తను కూడా వంటగదిలో అత్తగారికి సహాయం చేస్తూ ఔరా అనిపిస్తోందట.

అత్తగారికి రొట్టెలంటే ఇష్టం..
అలీనాకు ఉత్తర మరియు దక్షిణ భారత వంటకాలంటే చాలా ఇష్టమని చెబుతోంది. అంతేకాదు తను హిందీ కూడా నేర్చుకుంటోంది. రిషి కుటుంబ సభ్యులతో కలిసిపోయిన అలీనా భారతీయ వంటకాలను ఎలా చేయాలో కూడా నేర్చుకుంటోందట. తన అత్తగారికి రొట్టెలంటే ఎంతో ఇష్టమని.. వాటిని చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా అలీనా అత్త సుమన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. అలీనా రోటీ బాగా చేస్తుందని, తను చేసిన ఫుడ్ ను ప్రేమిస్తున్నాను.. అదే సమయంలో యుద్ధం ఆపాలని ఇద్దరూ కోరారు.



Click it and Unblock the Notifications