Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
జీవితం అనేది కష్టసుఖాల ప్రయాణం. కొన్నిసార్లు మనం ఎంత ప్రణాళికబద్ధంగా ఉన్నప్పటికీ ఊహించని ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, వృత్తిపరమైన ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. అయితే ఇలాంటి టైంలో 9 మంత్రాలు సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా మనకు మనోధైర్యాన్ని కల్పిస్తాయి.

అనారోగ్య నివారణ, అంతర్గత స్వస్థత కోసం (మహా మృత్యుంజయ మంత్రం)
అనారోగ్యం, మానసిక వేదన ఉన్నప్పుడు ఈ మంత్ర జపం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది మెడికల్ ట్రీట్మెంట్ కి ప్రత్యామ్నాయం కాకపోయినా, వ్యాధితో పోరాడే అద్భుతమైన అంతర్గత శక్తిని, అంతులేని ఆశను కోట్లాది మందికి అందిస్తూనే ఉంది.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవడానికి (లలితా సహస్రనామం)
త్రిపుర సుందరి దేవికి అంకితం చేయబడిన లలితా సహస్రనామం పఠించడం వల్ల జీవితంలోకి అనంతమైన శ్రేయస్సు, అదృష్టం, సమృద్ధి వచ్చి చేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం ధనాన్ని ఆకర్షించడమే కాకుండా, కష్టపడి పనిచేసే క్రమశిక్షణను, డబ్బు పట్ల సానుకూల దృక్పథాన్ని, జీవితంలో సంతృప్తిని పెంపొందిస్తుంది.
భయం వీడి, కష్టకాలంలో గుండెనిబ్బరం కోసం (హనుమాన్ చాలీసా)
భయం, ఆందోళన మనల్ని స్థంభింపజేసినప్పుడు ఒక ఆశాకిరణంలా పనిచేసే అద్భుత స్తోత్రం హనుమాన్ చాలీసా. ప్రతిరోజూ దీనిని జపించడం వల్ల మనసులోని అకారణ భయాలన్నీ పటాపంచలై, అచంచలమైన ధైర్యం కలుగుతుంది.
స్థిరమైన విజయం, పాజిటివ్ ఎనర్జీ కోసం (విష్ణు సహస్రనామం)
సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రశాంతతను ఇచ్చే మహా స్తోత్రం విష్ణు సహస్రనామం. శ్రీ మహావిష్ణువు వెయ్యి నామాలను పఠించడం వల్ల మన చుట్టూ ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. ఇది మనలో సహనాన్ని పెంచి, స్థిరమైన విజయం వైపు నిలకడగా అడుగులు వేసేలా చేస్తుంది.
బద్ధకం, ఆత్మన్యూనతలను జయించేందుకు (లింగాష్టకం,ఆదిత్య హృదయం)
మనలోని ప్రతిభను నాశనం చేసే ప్రధాన శత్రువులు బద్ధకం, మన మీద మనకు నమ్మకం లేకపోవడం. క్రమశిక్షణను, ఆధ్యాత్మిక శుద్ధిని నేర్పే లింగాష్టకం, అలాగే సూర్య భగవానుడి అపార శక్తిని గ్రహించే ఆదిత్య హృదయం చదవడం వల్ల మనలో దాగి ఉన్న అపారమైన సంకల్ప బలం మేల్కొంటుంది.
జ్ఞానం, విద్యా, ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు (శ్రీ రుద్రాధ్యాయి)
విద్యార్థులు, కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునేవారు పరమశివుని శ్రీ రుద్రాధ్యాయి స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్ర ఉచ్ఛారణ మేధో వికాసాన్ని, పదునైన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తారు. మన కఠోర శ్రమకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి తోడైతే విజయం తథ్యం.
అడ్డంకులు, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి (గణేష్ విఘ్న స్తోత్రం, గణపతి అధర్వశీర్షం)
కొత్త ప్రాజెక్ట్ లేదా పని ప్రారంభించినప్పుడు ఎదురయ్యే ఆటంకాలను తొలగించడానికి గణేష్ విఘ్న స్తోత్రం, అలాగే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి గణపతి అధర్వశీర్షం సంజీవనిలా పనిచేస్తాయి.



Click it and Unblock the Notifications