For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శోభనం గదిలో గులాబీలుంటే... మగవారు రతి క్రీడలో రెచ్చిపోతారంట...!

|

ఈ ప్రకృతిలో మనకు ఎన్నో అందమైన అద్భుతాలు.. ఆవిష్కరణలు కనిపిస్తూ ఉంటాయి. అందులో పచ్చని చెట్ల నుండి వచ్చే సువాసన ఎంతో మధురంగా ఉంటుంది. ఆ చెట్లకు ఉండే పువ్వులు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది.

ఇక అసలు విషయానికొస్తే.. మానవుని జీవితంలో దాదాపు సగభాగం దాంపత్య జీవితానికే కేటాయించబడుతుంది. అందులోనూ శృంగారానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇలా ప్రతి ఒక్కరి జీవితం సుఖవంతంగా.. సంతోషకరంగా సాగేందుకు కొన్ని రకాల పువ్వులు ఎంతగానో సహాయపడతాయి.

పూలలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గులాబీ పూలు ప్రేమకు చిహ్నమని మనందరికీ తెలుసు. ఎవరైనా ఎవరికైనా ప్రపోజ్ చేయాలన్నా.. తమ మనసులోని మాటల్ని బయటకు చెప్పలేనప్పుడు.. ఈ రోజా పూలతోనే ప్రేమ ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పూలలో మరో అద్భుతమైన గుణం దాగి ఉందట. అదేంటంటే.. ఇవి మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయని తేలిందట. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!

పడకగదిలో గులాబీలు..

పడకగదిలో గులాబీలు..

ఎవరైతే జంటలు బెడ్ రూమ్ గులాబీ పువ్వుల రేకుల్ని వాడతారో.. వారు కలయికలో కీలు గుర్రంలా రెచ్చిపోతారంట. ఈ పింక్ కలర్ పూలకు పడకగదుల్లో చోటిస్తే.. జంటల మధ్య శృంగారం రెట్టింపు అవుతుందట.

ఆ పవర్ పెరుగుతుందట..

ఆ పవర్ పెరుగుతుందట..

ఈ గులాబీ పూలకు మనసులను స్పందింపజేసే శక్తి.. రొమాంటిక్ ఆలోచనలు కలిగించే శక్తి ఉంటుదట. అందుకే వీటిని పడకగదిలో వాడితే.. వారి సంసారం చాలా సుఖవంతంగా ఉంటుందని.. ఈ పూల రేకుల్ని నమిలి తినేస్తే సూపర్ హార్స్ పవర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

రెట్టింపు అందం..

రెట్టింపు అందం..

గులాబీ పూలలో ఉండే విటమిన్ సి మన చర్మాన్ని.. తాజాగా అందంగా కనిపించేలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే గులాబీపూలను కలిపిన నీళ్లతో స్నానం చేస్తే.. మన చర్మానికి రెట్టింపు అందం వస్తుంది. అందుకే వీటిని చాలా బ్యూటీ ప్రాడక్టులలో వాడతారు.

పెళ్లైనా ఆ ముచ్చట తీరలేదా... అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి.. రొమాన్స్ లో రెచ్చిపోండి...!

ఒత్తిడి దూరం..

ఒత్తిడి దూరం..

ఈ గులాబీ పూలు మల్లెపూలంత మత్తు ఎక్కించకపోయినా.. వీటిలో మైల్డ్ గా ఉండే వాసన వల్ల మనలో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోయేలా చేస్తుందట. అందుకే ఈ పూలను ఎక్కువగా అందానికి.. అలంకరణలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు.

రోజాపూలతో ఎన్నో లాభాలు..

రోజాపూలతో ఎన్నో లాభాలు..

గులాజీ పూలతో కేవలం శృంగారపరంగానే కాదు.. ఆరోగ్యపరంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ గులాబీ పూల రేకుల్ని తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చట. వీటిని మనం నేరుగా తినొచ్చు కొందరు అలా తినలేమనుకుంటే.. మీరు తీసుకునే ఆహారంలో అంటే సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు.

బాడీలో మెరుగుదల..

బాడీలో మెరుగుదల..

ఇలా రోజా పూలు కలిపిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగవుతుంది. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు బాగా మెరుగవుతుంది. అంతేకాదండోయ్ ఈ గులాబీ పూలతో మెగ్రైయిన్ వంటి తలనొప్పిని తరిమికొట్టొచ్చు.

మీ ప్రియుడితో శృంగారానికి ముందు ఈ విషయాలను అస్సలు మరువకండి...!

తలకు మసాజ్ చేస్తే..

తలకు మసాజ్ చేస్తే..

ఎవరైతే మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడుతుంటారో.. వారు రోజ్ ఆయిల్ తో ఉన్న మిశ్రమంతో తలకు మసాజ్ చేసుకుంటే.. కేవలం కొద్ది క్షణాల్లో మంచి ఉపశమనం కలుగుతుంది. వీటితో శరీరంలోని పాడైన కణాలను కూడా బాగు చేసే శక్తి ఈ గులాబీ రేకుల్లో ఉంది.

పీరియడ్స్ టైమ్ లో..

పీరియడ్స్ టైమ్ లో..

చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ టైమ్ లో పెయిన్, వికారం ఇతర కారణాలతో ఇబ్బంది పడుతుంటే.. ఇలాంటి సమస్యలను చాలా త్వరగా తగ్గించడంలో ఈ గులాబీ రేకులు చాలా చక్కగా సహాయపడతాయంట.

గులాబీ నీళ్లను..

గులాబీ నీళ్లను..

గులాబీ పూలను నీటిలో వేసి ప్రిపేర్ చేసిన రోజ్ వాటర్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాదాపు వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం గులాబీ రెక్కల్ని చక్కగా కడిగి ఓ బౌల్ లో వేసి రాత్రంతా పెట్టాలి. ఉదయం ఈ నీటిని ఓ సీసాలో వేసి వేసుకుని స్టోర్ చేసుకోవాలి.

అందుకే శోభనం రోజున..

అందుకే శోభనం రోజున..

గులాబీ పూల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే శోభనం గదిలో గులాబీ పూలతో అలంకరిస్తారు. గులాబీ పూల వాసనకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో ఒత్తిడి తగ్గి కోరికలు పెరుగుతాయంట. ఇక మగవారు వాటి వాసన చూడటంతో పాటు గుప్పెడు గులాబీ రేకుల్ని నమిలిస్తే చాలా త్వరగా తండ్రులు అయిపోతారంట.

English summary

Ways to Boost Male Fertility and Increase Sperm Count in Telugu

Here we talking about the ways to boost male fertility and increase sperm count in telugu. Read on.