For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శోభనం రాత్రి ఇండియన్ కపుల్స్ ఎలాంటి పనులు చేస్తారో చూసేయ్యండి...!

|

పెళ్లికాక ముందు అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా ఫస్ట్ నైట్ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే పెళ్లి అయిన తర్వాత మాత్రం వధూవరులు ఇద్దరూ కొంచెం ఆత్రుతగా, ఆందోళనతో ఉంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు. వారి మనసులో ఏవేవో భయాలు వారికి ఆందోళన కలిగిస్తాయి. కొత్త వ్యక్తి.. కొత్త ప్రాంతం.. కొత్త అనుభవం వల్ల కొంత జంకుతారు.

వారికి కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా ఎక్కువగా సిగ్గు పడతారు. ఇది కాస్త కంగారుకు దారి తీసి వరుడికి శోభనం రోజు రాత్రి కొంత చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో చాలా మంది కొత్త పెళ్లికొడుకులు చాలా టెక్నిక్స్ ఉపయోగించి, వారితో సున్నితంగా వ్యవహరిస్తారు.

అలా తొలి మూడు రోజుల్లోనే మూడు రాత్రులు గడిచేసరికి ఇద్దరి మధ్య బంధం బాగా బలపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు వారిద్దరి మధ్య ప్రేమ అనేది కూడా మొదలవుతుంది. అయితే కపుల్స్ ఫస్ట్ నైట్ రోజున ఎలాంటి విషయంలో అయినా తొందరపడకూడదు.

ఎందుకంటే కొత్తగా ఒక్కటైన జంట అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఈ సందర్భంగా ఫస్ట్ నైట్ రోజు ఏయే పనులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

దానికే ఇష్టపడతారు..

దానికే ఇష్టపడతారు..

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారే వచ్చే అద్భుతమైన ఘట్టం. అయితే వివాహానికి ముందు, తర్వాత అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా నిశ్చితార్థం, మెహందీ, ఫేర్, ఫేర్ వెల్ వంటి కార్యక్రమాలెన్నో ఉంటాయి. వీటన్నింటిలో వధూవరులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఆచారాలన్నీ నెరవేరిన తర్వాత హనీమూన్ సమయంలో ఇద్దరి మధ్య నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరు విశ్రాంతి పొందుతారు. ఇక ఇదే సమయంలో వీరిద్దరూ శారీరకంగా ఒక్కటవ్వడం కంటే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు.

గాసిప్స్..

గాసిప్స్..

ఇక ఫస్ట్ నైట్ రోజు ఆడపడుచులు కొత్త వధువు చుట్టూ చేరిపోతారు. వారు డబుల్ మీనింగ్ డైలాగులతో వధువుని శోభనానికి సిద్ధం చేస్తారు. ఆ సమయంలో వారంతా వారి వివాహం సమయంలో ఎదురైన అనుభవాలన్నింటినీ పంచుకుంటారు. అదే సమయంలో పెళ్లికొడుకును కూడా కొంటె ప్రశ్నలతో ఇబ్బంది పెడతారు. ఇలాంటి సరదా విషయాల వల్ల పడక గదిలో వధువు సుఖంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని వారు భావిస్తారు.

ఒకరినొకరు అర్థం చేసుకోవడం..

ఒకరినొకరు అర్థం చేసుకోవడం..

ప్రేమ వివాహాలు పెరిగిపోయిన ఈ కాలంలో పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఈ కాలంలోనూ చాలా మంది యువత పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లనే ఇష్టపడుతున్నారు. ఫస్ట్ నైట్ రోజున తన సోల్మేట్ ను ఎప్పుడెప్పుడు కలిసే అవకాశం వస్తుందా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా వీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నమ్మకం మరియు ప్రేమతో తమ జీవిత కాల శాశ్విత సంబంధానికి పునాది వేయాలని వారు భావిస్తారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బాగా గుర్తుండిపోయే బహుమతులు ఇస్తారు. ఇక నుండి ఫ్రెండ్స్ లా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తొలి రేయిని గడుపుతారు.

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

హనీమూన్ ప్లాన్..

హనీమూన్ ప్లాన్..

పెళ్లి చేసుకున్న వారిలో చాలా మంది వెంటనే హనీమూన్ ప్లాన్ చేస్తారు. వారు తమ హనీమూన్ కోసం ఒక అందమైన స్థలాన్ని ఎంచుకుని, అక్కడ టికెట్ మరియు హోటల్ గదిని బుక్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం అబ్బాయి, అమ్మాయిలు ఇద్దరూ పని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సెలవులు దొరకడం కష్టం. అందుకే చాలా మంది కొత్త జంటలు పెళ్లయిన వెంటనే హనీమూన్ కు సిద్ధమవుతున్నారు.

అనేక ఆచారాలు..

అనేక ఆచారాలు..

అమ్మాయి పుట్టింటికి వీడ్కోలు చెప్పి, అత్తగారింటికి చేరుకున్నప్పుడు, అక్కడ అనేక కొత్త ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఆచారాలు చాలా సరదాగా ఉంటాయి. దీని వల్ల వధువు తన పుట్టింటిని విడిచిపెట్టి వచ్చిన దుఃఖాన్ని అంతా మరచిపోతుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆనందిస్తారు. అయితే ఈ ఆచారాలు రాత్రి వేళలో అది కూడా కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయడంతో ప్రారంభమవుతుంది.

మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...

ఆ కార్యానికి సిద్ధంగా ఉండరు..

ఆ కార్యానికి సిద్ధంగా ఉండరు..

తొలి రోజు రాత్రి కొత్త పరిసరాలు, కొత్త ప్రాంతం కావడంతో వధువు ఆ కార్యానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి ఈ విషయంలో వరుడే చొరవ తీసుకోవాలి. ఆమెను మానసికంగా, శారీరకంగా ప్రిపేర్ చేయ్యాలి. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ, సుకుమారంగా తాకుతూ, నెమ్మదిగా అసలు ఘట్టంలోకి ప్రవేశించాలని పెద్దలు చెబుతారు.

ఆ ఆలోచనే రాదు..

ఆ ఆలోచనే రాదు..

పెళ్లికి ముందు ఫోన్లలో మాట్లాడుకున్నప్పటికీ, కొన్నిసార్లు కలిసి తిరగినప్పటికీ.. అతనితో కలిసి జీవించబోతున్నామనే ఆనందమే ఎక్కువగా ఉంటుంది. తొలిసారి ఒకే గదిలో ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు సెక్స్ గురించి ఆలోచన అనేదే రాదు. ఎందుకంటే ఇల్లంతా బంధువులంతా నిండిపోయి ఉంటుంది. వారి పరిచయాలు, ఆచారాలతో అప్పటికే అలసిపోయి ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుందామా అని ఆలోచిస్తారు చాలా మంది.

English summary

What Do Indian Couples Do on Their First Wedding Night

What Do Indian Couples Do On Their First Wedding Night. Check out this article for answers.