Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!
మగువలలో మగాళ్లు ఎక్కువగా ఏమి కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో ఎప్పటికీ మగువలంటే మగమహారాజులకు అమితమైన ప్రేమ, ఇష్టం. అందుకే చాలా మంది మహిళలను ఆరాధిస్తారు.. అభిమానిస్తారు.. గౌరవిస్తారు.. ప్రేమిస్తారు.. అయితే అందరూ మనుషులకు ఒకేరకమైన అభిరుచి ఉండాలని రూలేమీ లేదు.

ఎందుకంటే మనం తినే ఆహారం నుండి వేసుకునే డ్రస్ వరకు అన్ని విషయాల్లో మన రుచులు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఎవ్వరికీ ఎన్ని కోరికలున్నా.. మగువల విషయంలో మగవారికి రకరకాల కోరికలు ఉంటాయి.

అయితే ఎవరి మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. ఎవరికి ఎలాంటి అలవాట్లు, లక్షణాలు, అభిరుచులు నచ్చుతాయో చెప్పలేం. అయితే ఎంత అందంగా ఉన్నా, అన్ని విషయాల్లో ఎంత కరెక్టుగా ఉన్నా, కొన్నిసార్లు పురుషులను మెప్పించలేకపోవచ్చు. దీనికి కారణం అమ్మాయిలలో కాదు. మగవారి అభిరుచులు, కోరికలు, ఆలోచనా విధానమే. అయితే మగవారు మగువలలో ఎక్కువగా ఏమి కోరుకుంటారు..

తమకు కాబోయే లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలని ఆశపడతారు అనే విషయంపై ఓ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం పురుషులు ఎలాంటి అంశాలను అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడతారు.. వేటి గురించి ఎక్కువగా ఆశపడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అందంతో పాటు అది..
అమ్మాయిలలో అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారని కొందరు జనరల్ గా చెబుతున్నారు. అయితే, ఇది నిజం కాదంట.. మగవారు మగువలలో ఎక్కువగా బయటికి కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.

తన కంటే..
మగువలలో అందంగా ఉండే వారే కాదు.. తమ కంటే ఎక్కువగా.. అంటే తనను తాను అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేసుకోగలిగే అమ్మాయిలంటే అబ్బాయిలు చాలా ఇష్టపడతాడు. ముఖ్యంగా అందంగా మాట్లాడటం, చక్కగా ముస్తాబవ్వడం, చక్కటి డ్రెస్సింగ్ సైన్స్ వీటికే అట్రాక్ట్ అవుతారు. మంచి వ్యక్తిత్వం అనేది వీరి విషయంలో అసలు మ్యాటరే కాదంట. అయితే చాలా మంది మగవారు మాత్రం అందంతో పాటు తెలివి ఎక్కువగా ఉండే వారినే ఇష్టపడతారట.

డిపెండెన్సీ..
అయితే ప్రతీ దానికి తమ మీద ఆధారపడే మహిళలంటే, మగవారు ఆమడదూరం పరుగెడతారంట. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, మగవారు ఎక్కువగా సొంత వ్యక్తిత్వం ఉండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వారినే ఎక్కువగా ఇష్టపడతారట.

ఓనర్ షిప్..
చాలా మంది పురుషులు ప్రతిదానికీ తామే ఓనర్ షిప్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కొందరు పురుషులు స్త్రీలను కూడా హోమ్ ఓనర్ షిప్.. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఇంటి నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారట.

అలాంటి వంటే..
తమ భాగస్వామి లేదా ప్రియురాలు అస్తమానం కోపంగా ఉండటం. చీటికి మాటికి అలగడం చేస్తే.. మగవారికి అస్సలు ఇష్టముండదట. ఎలాంటి పరిస్థితులు అయినా కూర్చుని మాట్లాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారట. దీని వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు తొలగిపోతాయని నమ్ముతారు.

తన కౌగిలిలో..
అమ్మాయిల కౌగిలిలో బంధికావడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టమట. అది కూడా ఏకాంతంగా ఉండే ప్రదేశంలో.. ముఖ్యంగా వెనుక నుండి పట్టుకుని హగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టమట. అలాగే తాము పని నుండి అలసిపోయి బయటకు వచ్చినప్పుడు భర్తను ఆప్యాయంగా హత్తుకుని, ముద్దులు కురిపిస్తే వారి ముఖంలో వెయ్యి బల్బుల వెలుగు కనిపిస్తుందట.



Click it and Unblock the Notifications
