Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
బహుచక్కని భార్య ఉన్నప్పటికీ... మరో యువతిపై మోజు పడ్డాడు... ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..!
ఇంకా కొంత మంది ఏకంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే విదేశాలలో వివాహేతర సంబంధాలు అత్యంత సహజం.
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే యువకుడికి ఇటీవలే అందమైన అమ్మాయితో కొత్తగా పెళ్లయ్యింది. అయితే తను వెళ్లే చోట ఇటీవలే ఓ కొత్త అమ్మాయి పనిలో చేరింది. ఆమె అందానికి ఆ యువకుడు ముగ్ధుడైపోయాడు.

అంతే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆరాటంతో తరచూగా ఏవేవో ఆలోచనలు చేస్తుండేవాడు. ఇంకేముంది మన తెలుగు సినిమాల్లో లాగానే తనకు పెళ్లి అయినప్పటికీ, ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ వంటింట్లో ప్రియురాలితో సరసం ఆడుదామని ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ప్రకారం ఆమెకు ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. మెల్లగా ఆమెకు దగ్గరయ్యాడు.

ఎట్టకేలకు ఆ అమ్మాయిని తన దారికి తెచ్చుకున్నాడు. ఇంకా ఆమెపై ఉన్న మోజుతో ఆమెను అప్పుడప్పుడు తన ఇంటికి రమ్మనేవాడు. ఎప్పుడూ సున్నితంగా తిరస్కరించే ఆమె అకస్మాత్తుగా ఓ రోజు తన ఇంటికి వెళ్లింది.

ఇంకేముంది గురుడు ఆమె తన ఇంటికి వచ్చిన వెంటనే సరసం ఆడటం మొదలుపెట్టాడు. అంతలోనే తన భార్య అకస్మాత్తుగా అక్కడికి ఎంటరయ్యింది. ఆ తరువాత ఏమయ్యిందో మీరే చూడండి...

భర్త బాగోతం..
తనను కట్టుకున్న భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని అంతవరకు ఆమెకు తెలియదు. ఇరుగుపొరుగు వారు ఆమె భర్త గురించి ఆమెకు అనేక విషయాలు చెప్పారు. నువ్వు లేనప్పుడు మీ భర్త ఎవరితోనో కలిసి వస్తున్నాడని చెప్పారు. అప్పుడు ఆమెకు అనుమానం మొదలయ్యింది. అంతే తన భర్త బాగోతం గురించి తెలుసుకోవాలని ప్లాన్ వేసింది.

భర్త ప్రవర్తనపై కన్ను..
అప్పటినుండి తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు.. ఏమి చేస్తున్నాడు.. ఏ సమయానికి ఇంటికి వస్తున్నాడు.. ఏ సమయానికి ఆసుపత్రికి వెళ్తున్నాడు అనే విషయాలపై కన్నేసింది. తనకు తెలిసిన వారితో భర్త గురించి ఆరా తీసింది.

ఒకరోజు పని మీద..
ఒకరోజు తన భర్త ఇంట్లో ఉన్న సమయంలో తాను ఓ కూరగాయలు, ఇతర వస్తువులను తెచ్చేందుకు బయటకు వెళ్తున్నాని చెప్పింది. ఆ మాటలను నమ్మిన భర్త సరే అని చెప్పి సంతోషంతో వెంటనే తన ప్రియురాలికి ఫోన్ చేశాడు.

అలా చూసిన ఆమెకు..
ఆమె అనుమానించినట్టుగానే తన ప్రియురాలికి ఫోన్ చేసి ఆమెను ఇంటికి రమ్మన్నాడు. ఆమె తన ఇంటికి వచ్చిన వెంటనే ఆమెతో సరసాలు ఆడటం ప్రారంభించాడు. అప్పటికీ కొంత అనుమానంగా తన మొదటి భార్య అనుమానంగా వెనుకవైపు నుండి ఆ గదిలోకి తొంగి చూసింది.

ఆగ్రహంతో..
అది చూసిన అతని మొదటి భార్య ఆగ్రహంతో తన భర్తను, అతని ప్రియురాలని చంపేయాలన్న కోపం పెంచుకుంది. వెంటనే అక్కడ దగ్గర్లో ఉన్న కిటికిలో నుండి పెట్రోల్ పోసేసింది.. ఆ వెంటనే నిప్పు కూడా అంటించింది.

వారిద్దరూ భయపడుతూ..
అకస్మాత్తుగా నిప్పు అంటుకోవడంతో తన భర్త, అతని ప్రియురాలు వెంటనే భయపడుకుంటూ బట్టలు లేకుండా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు.

రెడ్ హ్యండెడ్ గా..
అంతే ఆ యువకుడు, అతని ప్రియురాలిని తన మొదటి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి ఎదుటే ఆ ఇద్దరినీ నిలదీసింది.

దేహశుద్ధి..
ఈ సమయంలో వారికి ఆ చుట్టుపక్కల వారందరూ కలిసి దేహశుద్ధి చేస్తుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తామన్నారు.

ఈ సంఘటన ఎక్కడంటే..
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవలే చోటు చేసుకుందట. వీరంతా అదే రాష్ట్రంలోని భరత్ పూర్ ప్రాంతంలో నివసించేవారట.



Click it and Unblock the Notifications