Latest Updates
-
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
మగవాళ్లకు జీవితాంతం ప్రేమించాలి అనిపించే ఆడవాళ్ల అలవాట్లు..!
ఆడవాళ్లు కొన్ని రకాలుగా ప్రవర్తిస్తే.. మగవాళ్లకు జీవితాంతం తన భార్యను ప్రేమగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ కలుగుతుందట. మరి ఆడవాళ్ల ఎలాంటి ప్రవర్తన వల్ల మగవాళ్లకు ఈ ఫీలింగ్ కలుగుతుంది ?
మగవాళ్లకు.. మహిళలు దేవుడిచ్చిన బహుమతులుగా చెప్పవచ్చు. ఎందుకంటే.. మిమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ.. అందరికంటే ఎక్కువ వేధిస్తుంది కూడా. అయితే మీపై ఎంతో కేర్ తీసుకునే, ప్రేమ చూపించే భార్య కోసం మగవాళ్లు కొంత సమయాన్ని కూడా కేటాయించలేరు.
చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు అని, ఎక్కువ ఫోటోలు తీసుకుంటున్నావు అని, ఎక్కువ సమయం షాపింగ్ చేసేటప్పుడు కూడా సహకరించరు. అయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ల నడవడిక, ప్రవర్తన మగవాళ్లలో చాలా ప్రేమ పుట్టేలా చేస్తుంది.
ఆడవాళ్లు కొన్ని రకాలుగా ప్రవర్తిస్తే.. మగవాళ్లకు జీవితాంతం తన భార్యను ప్రేమగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ కలుగుతుందట. మరి ఆడవాళ్ల ఎలాంటి ప్రవర్తన వల్ల మగవాళ్లకు ఈ ఫీలింగ్ కలుగుతుంది, ఎలాంటి పద్ధతుల్లో మహిళలు ప్రవర్తిస్తే.. మగవాళ్లు కొండంత ప్రేమ చూపిస్తారు..

చెస్ట్ పై తల
మగవాళ్ల చెస్ట్ పై మహిళలు తల పెట్టుకుంటే.. వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతే.. వాళ్లకు మీపై ప్రేమ రెట్టింపు కాదు.. అంతకంటే ఎక్కువే అవుతుంది.

జుట్టుతో ఆడుకుంటే
రొమాన్స్ చేసేటప్పుడు ఆడవాళ్లు.. తమ భాగస్వామి తలలో చేయి పెట్టి.. జుట్టుతో ఆడుకుంటే.. చాలా హ్యాపీగా ఫీలవుతారట. శారీరక ఒత్తిడి ఉన్నప్పుడు.. మీరు వ్యక్తపరిచే ప్రేమ, ఆప్యాయతను వాళ్లు బాగా గుర్తించగలుగుతారు.

సోషల్ మీడియా
నమ్మినా నమ్మకపోయినా.. తన భర్త గురించి, తన భర్త కురిపించే ప్రేమ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రసంశలు కురిపిస్తే.. భర్త చాలా హ్యాపీగా ఫీలవుతాడట.

వినడం
భర్త చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా, కేర్ ఫుల్ గా వింటే.. వాళ్ల మనసులో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నట్టే. మీరు వాళ్లు మాట్లాడేది బాగా కేర్ ఫుల్ గా వింటూ ఉంటే.. మీపై ప్రేమను కురిపిస్తారట.

ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు
మీరు మీ ఫ్రెండ్స్ తో లేదా మీ రిలేటివ్స్ గడుపుతూ ఉన్నప్పుడు మీ భర్తకు మెసేజ్ లేదా కాల్స్ చేస్తూ ఉండటం వల్ల.. మీరు మీ ఫ్రెండ్స్ తో పనిలో ఉన్నాకూడా తన గురించి ఆలోచిస్తున్నారని గర్వంగా ఫీలవుతారట.

పబ్లిక్ లో
పబ్లిక్ లో మహిళలు చాలా అఫెక్షనేట్ గా ఉంటే.. మగవాళ్ల హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా మారుతుంది. ఉదాహరణకు మహిళలు పబ్లిక్ లో ఉన్నప్పుడు తన భర్త జుట్టుని సరిచేయడం లేదా ముందుగా చేతిని పట్టుకోవడం వల్ల చాలా ప్రేమగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications