Latest Updates
-
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా!
మీ రిలేషన్ రాను రాను క్షీణించడానికి కారణాలేంటో తెలుసా ?
స్వీట్ అండ్ హాట్ గా సాగుతున్న మీ రిలేషన్ సడెన్ గా చేదుగా మారిందా ? ఇద్దరి మధ్య చిటికీ మాటికీ గొడవలు, మనస్పర్ధలు, విడిపోవాలన్న ఆలోచనాలు వెంటాడుతున్నాయా ? ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆత్మియత కంటే.. అలకలు, గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయా ? అంతా సజావుగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. మీకు తెలియకుండా మీ రిలేషన్ లో సమస్యలు ఎదురవుతున్నాయా ?
అవును.. చాలా హ్యాపీగా, అన్యోన్యంగా ఉంటున్న జంట మధ్య ఉన్నట్టుండి వివాదాలు మొదలవుతాయి. అనవసర విషయాలకు గొడవలు వస్తుంటాయి. దీనివల్ల పెద్ద సమస్యే ఎదురయ్యే అవకాశాలుంటాయి. చిన్న సమస్యలే.. బంధాన్ని విడదీసేలా మారిపోవచ్చు. కాబట్టి.. మీ రిలేషన్ నాశనం అవడానికి మీకు తెలియకుండా మీరు ఎలా కారణమవుతున్నారు ? మీకు తెలియకుండా మీ రిలేషన్ లో సమస్యలకు మీరు ఎలా కారణమవుతారో తెలుసుకోండి ?

నెగటివ్ థింకింగ్
మీ భాగస్వామి మీకోసం 99 మంచి పనులు చేసి ఉంటాడు, కానీ ఒక్క చెడు పనిచేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ఎక్కువగా చేసిన మంచి పనులను వదిలేసి.. ఒక చెడు పని గురించే ఎక్కువగా ఆలోచించడం మంచి అలవాటు కాదు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

ఎక్కువగా ఆలోచించడం
ఎక్కువగా సెల్ఫిష్ గా ఆలోచించడం వల్ల మీ రిలేషన్ నాశనం అవడానికి కారణమవుతారు. కొన్ని అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు మీ భాగస్వామి మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేటు అయినా, ఇవ్వకపోయినా.. మీ మీద ప్రేమ లేదని ఆలోచించరాదు. వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇవ్వలేకపోయారేమో అని ఒక్కసారి గ్రహించాలి.

సెక్స్ గురించి మాట్లాడకపోవడం
సెక్స్ గురించి, బెడ్ టైం గురించి మాట్లాడటానికి అసౌర్యంగా ఫీలవడం వల్ల కూడా మీ రిలేషన్ నాశనం అవడానికి కారణమవుతుంది. ఎందుకంటే.. భార్యాభర్తల మధ్య సెక్స్ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి. చిన్నపిల్లల మనస్తత్వంతో కాకుండా.. దానిపై అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేయాలి.

ఇష్టాలను గౌరవించకపోవడం
మీ భాగస్వామి ఇష్టాలను గౌరవించడం చాలా అవసరం. అతని ఇష్టాలను, అభిరుచులను వివరిస్తున్నప్పుడు పట్టించుకోకుండా ఉండకూడదు. వాళ్ల అభిరుచులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ పెరుగుతుంది.

అభినందించకపోవడం
ఎప్పుడైనా మీకు ఇష్టమైన పనులు చేసినప్పుడు, మీకు సహాయపడినప్పుడు, మీ కష్టంలో భాగం పంచుకున్నప్పుడు మీ భాగస్వామిని అభినందించాలి. దీన్ని వల్ల మీ భాగస్వామికి విలువ ఇస్తున్నారని గ్రహిస్తారు. దీనికి రెండు సెకన్ల సమయం పట్టదు. కాబట్టి.. అభినందించడం మరిచిపోకండి.

ప్రాధాన్యత ఇవ్వకపోవడం
ఎంతమందిలో ఉన్నా.. మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే.. మీ మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. కాబట్టి.. ఎప్పుడు, ఎక్కడ, ఎందరిలో ఉన్నా.. మొదటి ప్రాధాన్యత మీ భాగస్వామిదే కావాలి.

సమస్యల గురించి
మీ భాగస్వామి గురించి మీకున్న సమస్యలను ప్రతి ఒక్కరితో చెప్పడం వల్ల మీ రిలేషన్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది అమ్మాయిలు వాళ్ల బాయ్ ఫ్రెండ్ చేసిన తప్పులను, సమస్యలను సహోద్యోగులు, ఫ్రెండ్ ఇలా చాలామందితో చెప్పుకుంటారు. కానీ దీనివల్ల మీ మైండ్ లో నెగటివ్ ఫీలింగ్ పెరిగి రిలేషన్ క్షీణిస్తుంది.



Click it and Unblock the Notifications