Latest Updates
-
లిప్స్టిక్తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.!
బేబీ పుట్టిన తర్వాత భార్యభర్త మధ్య దూరం పెరగకుండా...
భార్య భర్తల అనుబంధం అంటే మూణ్నాళ్ల ముచ్చట కాదు, అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది. అయితే సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. ఈ సమయంలో వారి ధ్యాసంతా పిల్లల మీదకే మళ్లిస్తారని, ఇద్దరూ తమ ప్రేమనంతా పాపాయిపైనే చూపి..'పాపే మా ప్రాణం...'అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని అభిప్రాయపడుతుంటారు. ఇది మంచిదే..కానీ పుట్టిన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో, భార్యభర్తలు కూడా ముందులాగే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం, భాగస్వామిని బాగా చూసుకోవడం చేయాలి.
అయితే , అందుకు ఇంతకుముందులాగా ఇద్దరు కలిసి గడపడానికి ఎక్కువ సమయం దొరక్కపోవచ్చు. కాబట్టి, వీలు కుదిరినప్పుడల్లా, అవకాశాన్ని బట్టి ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను ప్రదర్శించాలి. దాంతో పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యభర్తల మద్య రిలేషన్ షిప్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

గతంలో ఇద్దరే ఉన్నప్పుడు ఉన్న బాధ్యతల కంటే ముగ్గురున్నప్పుడు, మరిన్ని బాధ్యతలు వచ్చిపడుతాయి. వీటిని ఇద్దరూ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఉదాహరణకు, భార్యకు ఇంటిపనులతో బేబీ అవసరాలను చూసుకోవడానికి అన్ని సార్లూ కుదురకపోవచ్చు . కాబట్టి, ఇంటిపనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.

ఒకరు బేబీ కేర్ తీసుకుంటే, మరొకరు ఇంటిపనులు చక్కబెట్టుకోవాలి. ఈ మద్య సమయంలో బేబీ ఏడ్చినప్పడు పార్ట్నర్ మీద చీకాపడటం, లేదా కోప్పడం, గొడవపెట్టుకోవడం తగదు. నెమ్మదిగా బేబీని బుజ్జిగించి, ఏడుపు మాన్పించాలి. ఇలా ఒకరికొకరూ సహాయం చేసుకుంటూ పోతే, పనులు పూర్తవుతాయి, ఇద్దరి మద్య బంధం స్ట్రాంగ్ గా మారుతుంది. అలాగే బేబీకి ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తపడవచ్చు.

వీలున్నప్పుడు:దంపతుల మద్య అన్యోన్యత పెరగాలంటే, ఇద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం ముఖ్యం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి సందర్భాలు అరుదనే చెప్పాలి. ఎందుకంటే బేబీ యొక్క ఆలనా పాలనా చూసుకోవడానికి సరిపోతుంది. అలాగని భార్యభర్తలు ఒకరినొకరు నిర్ల్యం చేసుకోవడం సరికాదు. పాపాయి అవసరాలు తీరిన తర్వాత, తను పడుకున్నప్పుడో, ఆడుకుంటున్నప్పుడో ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోవడం, భవిష్యత్తు ప్రణాలికలు గురించి చర్చింకోవడం చేయాలి.

అలాగే బేబీని చూసుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులున్నట్లైతే , వారిని బేబీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఇద్దరు కలిసి బయటకు వెళ్లి, ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుక్కురావడం, లేదా అలా బయటకెళ్ళి కాసేపు గడపండం వల్ల ఇద్దరి మద్య ప్రేమబందం మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే గుణాలు పెరుగుతాయి.

పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్య భర్తలిద్దరు ఇంట్లోనే సరదాగా గడుపుతూ , రిలేషన్ షింప్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చువకోచ్చు. సెలవు రోజును బేబీతో సెల్పీలు దిగడం, ఇద్దరూ కలిసి బేబీని ఆడించడం, ఇష్టమైన వంటలను ఒకరికోసం మరొకరు తయారుచేసి సర్ ప్రైజ్ చేయడం , నచ్చిన సినిమాలు చూడటం, నచ్చిన పాటలు వినడం చేయాలి.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇద్దరి మద్య బందం మరింత బలపడటంతో పాటు, ఇద్దరికీ రోజు వారి ఒత్తిళ్ళ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీకు ప్రత్యేకమైన డేట్స్ గుర్తుపెట్టుకుని, పెళ్ళి రోజు, బర్త్ డేస్ ను సెలబ్రేట్ చేసుకోవడం, గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన పద్దతిలో , ఇద్దరు కలిసి ఎక్కువ సమయం గడపడం వంటివి మర్చిపోకూడదు.

చెకప్ కోసం: అప్పుడప్పుడే పుట్టిన పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది తల్లికి మాత్రమే బాధ్యత కాదు, తండ్రి కూడా తోడుంటి, రెగ్యులర్ చెకప్స్ కు తీసుకెళ్ళడం, టీకాలు వేయించడం వంటివి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఇద్దరూ కలిసి హాస్పిటల్స్ కు వెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. అలాగే పిల్లలకు తల్లిదండ్రులకు మద్య రిలేషన్ షిప్ స్ట్రాంగ్ అవుతుంది.

పిల్లలు పుట్టిన తర్వాత భార్యభర్తల మద్య దూరం పెరగకుండా..మునపటి లాగే ఇక ముందు కూడా ఒకరినొకరు మరింత ప్రేమగా, అన్యోన్యంగా , ఆప్యాయంగా చూసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారుగా? మరి మీరు కూడా వీటిని పాటించి మీ రిలేషన్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోండి..



Click it and Unblock the Notifications
