For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అతను లేడీస్ తో సెక్స్ కు పనికిరాడు.. అతను అదో టైప్.. డాక్టర్ సమరం ఏమన్నాడంటే - My Story #3

  By Bharath
  |

  మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న రైతు. నేను చదువులో ఫస్ట్‌. స్కూల్, కాలేజీలో నా ఫ్రెండ్స్ తో ఎంతో కలివిడిగా ఉండేదాన్ని. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి మా నాన్నకు అండగా ఉండాలనుకున్నా.

  ప్రభుత్వ ఉద్యోగం ఉందని

  ప్రభుత్వ ఉద్యోగం ఉందని

  అతనికి ప్రభుత్వోద్యోగం ఉందని, మంచి సంబంధమని మా అమ్మనాన్న చెప్పారు. నువ్వు చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావన్నారు. పెద్దలు ఏది చెప్పినా మన మంచికే చెబుతారు కదా. అందుకే పెళ్లికి ఓకే అన్నాను. టీచరు సంబంధం.. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు మా వాళ్లు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు.

  పెళ్లి ఖాయం

  పెళ్లి ఖాయం

  దీంతో మా ఇద్దరికి మా పెద్దలు పెళ్లి ఖాయం చేశారు. పెళ్లికి ముందు నుంచే మేమిద్దరం ఫోన్‌ లో మాట్లాడుకునేవాళ్లం. అతను అప్పుడు చాలా బాగా మాట్లాడేవాడు. మంచివాడు అనుకున్నా.

  పెళ్లి

  పెళ్లి

  మా పెళ్లి బాగా జరిగింది. తర్వాత శోభనానికి ఏర్పాటు చేశారు మా పెద్దలు. గదిలోకి వెళ్లాక ఇద్దరం ఒక్కటవుతామనుకున్నాం. నాకు అతనిపై మొదట ఎలాంటి సందేహాలు లేవు. అయితే అతని ప్రవర్తన చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా అంటే ప్రవర్తిస్తున్నాడు. శాడిస్ట్ లాగా చేశాడు.

  శోభనం

  శోభనం

  ఆ రోజు రాత్రి మా ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు పెద్దవాళ్లు. నాకు గదిలోపలికి వెళ్లేటప్పుడు భయం వేసింది. కానీ లోపలకి వెళ్లాక అతని చేష్టలు చూసి నాకు భయం వేసింది.

  బయటకు వచ్చా

  బయటకు వచ్చా

  నేను వెంటనే గదిలోంచి బయటకు వచ్చాను. అక్కడే ఉన్న మా కుటుంబసభ్యులు ఏమి కాదులేమ్మా.. అంతా సవ్యంగానే జరుగుతుందంటూ మళ్లీ లోపలికి పంపిచారు. నేను ఎందుకు భయపడుతున్న విషయం వాళ్లకు తెలియకపోవడంతో బలవంతంగా గదిలోకి పంపించి బయట గడియ వేశారు.

  అసలు కారణం ఇది

  అసలు కారణం ఇది

  అతనికి పుంసత్వం లేదు. అతడు నపుంసకుడు. మా విషయం నాకు అర్థం అయ్యింది. దాంతో గది నుంచి బయటకొచ్చా. అదే విషయంల మా వాళ్లకు చెప్పా. అలా ఏమీ ఉండదని వాళ్లు ధైర్యం చెప్పారు. బలవంతంగా మళ్లీ లోపలికి పంపారు.

  నేను ఆ విషయం చెప్పానని

  నేను ఆ విషయం చెప్పానని

  నేను లోపల జరిగిన విషయం మా వాళ్లకు చెప్పాననుకుని అతను నాపై కోప్పడ్డాడు. లోపల ఏం జరగలేదు.. వాడు అలాంటోడు అని చెప్పావా అంటూ నా ముఖంపై బలంగా గుద్దాడు. గదిలో నాకు నరకం చూపాడు. దారుణంగా కొట్టాడు. విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నన్ను కొట్టి, రక్కి, కొరికి.. శాడిస్టులా వ్యవహరించాడు అతడు.

  నోట్లో గుడ్డలు కుక్కాడు

  నోట్లో గుడ్డలు కుక్కాడు

  నవ వధువు నోట్లో గుడ్డలు కుక్కి మరీ దాడి చేశాడు. ఉంగరాలున్న వేళ్ల పిడికిలితో ఇంకా బలంగా కొట్టే ప్రయత్నం చేశాడు. కంటి మీద బలంగా దెబ్బ తగలడంతో విలవిలలాడను. నన్ను కొట్టొద్దు అంటూ ఏడ్చాను. నా పెదవుల దగ్గర గట్టిగా కొరికాడు. ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరిచాను. దీంతో నేను తీవ్రంగా గాయపడ్డాను.

  ఆర్తనాదాలు చేశా

  ఆర్తనాదాలు చేశా

  అతని చిత్రహింసలకు తాళలేక నేను ఆర్తనాదాలు చేశా. మా నాన్న విని పరుగెత్తుకొచ్చాడు. దీంతో ఆ శాడిస్టు గది డోర్ తీసుకొని పారిపోయాడు. నా మొహం చూసి మా వాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. వాళ్లు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. మా వాళ్లు వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  వైద్యపరీక్షలు

  వైద్యపరీక్షలు

  ఇంతగా ఒక అమ్మాయిని వేధించిన ఈ శాడిస్ట్ భర్తకు తర్వలోనే పొటెన్సీ టెస్టు నిర్వహించనున్నారు. ఇందుకు కోర్టు కూడా ఓకే చెప్పింది. అయితే దీనిపై డాక్టర్ సమరం ఈ విధంగా చెప్పారు.

  సమరం ఈ విధంగా చెప్పారు

  సమరం ఈ విధంగా చెప్పారు

  సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. అతనికి ఆత్మవిశ్వాసమైన లేకపోయి ఉండాలి లేదా పెళ్లికి ముందే మరో స్త్రీ వద్దకు వెళ్లి.. ఆమెతో సరిగా గడపలేక నువ్వు సంసారానికి పనికిరావు అనే ముద్ర వేయించుకుని ఉండాలి అని చెప్పారు. ఈ రెండు కారణాల వల్లే తొలిరాత్రి అతనలా ప్రవర్తించి ఉండవచ్చునని అన్నారు. అలాగే అతడు సైకాలజికల్ డిసార్డర్స్ తో కూడా బాధపడుతూ ఉండొచ్చన్నారు. అయితే టెస్ట్ లో అతను సఫలం అయినా సెక్స్ ఫెర్ఫామెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుందన్నారు.

  ఇలా కూడా అన్నాడంట

  ఇలా కూడా అన్నాడంట

  ఈ దుర్మార్గుడు భార్యతో చాలా దారుణంగా మాట్లాడడంట. తాను సంసారానికి పనికి రానని, అయితే నీకు ఇష్టం ఉన్న వారితో సంసారం చేయవచ్చునని, నిన్ను నేను భార్యగా బాగా చూసుకుంటానని చెప్పాడంట.

  English summary

  My Story SADIST HUSBAND BITES, PUNCHES WIFE ON FIRST NIGHT

  My Story SADIST HUSBAND WHO BIT HIS WIFE ON FIRST NIGHT TO UNDERGO POTENCY TEST
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more