For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేశ్య నన్ను బాగా సంతృప్తిపరిచింది, పెళ్లాంలాగా సేవలు చేసింది, పెళ్లి చేసుకుంటానన్నాను #mystory225

|

ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్. ఫ్రెండ్స్ అందరం పార్టీలో మునితేలుతున్నాం. కిక్ నషాలానికి ఎక్కింది. గట్టిగా అరుస్తూ చిందులేశాం. అయినా ఇంకా ఏదో వెలితిగా అనిపించినట్లుంది నా మనస్సుకి. ఒకమ్మాయి తోడును కోరుకుంది తనువు. మొత్తానికి ఒక వేశ్య అడ్రస్ కనుక్కొని వెళ్లాను. గంట సమయానికి బేరం కుదుర్చుకున్నాను.

వెళ్లగానే పని స్టార్ట్ చేద్దామనుకున్నా. ఏదో చెప్పాలి అన్నట్లుగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను. తను కూడా నవ్వుతూ నాకు విష్ యూ ద సేమ్ అంది. త్వరగా పని కానిద్దామా అని అన్నాను. ఏం కంగారుపడకు ఈ రోజు నాకు గిరాకేమీ లేదు. రాత్రంతా ఎంజాయ్ చేసి వెళ్లు అంది. న్యూ ఇయర్ రోజు నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని సంతోషపడ్డాను.

నా షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది

నా షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది

తర్వాత ఇద్దరం బెడ్ పైకి వెళ్లాం. మెల్లిగా తను నా షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది. మసాజ్ చేసింది. వేడినీళ్లతో స్నానం చేయించింది. చేసుకున్న పెళ్లాం సేవ చేసినట్లుగా నాకు చాలానే చేసింది. అన్నం తిన్నావో లేదో... ఇంట్లో చికెన్ వండాను తింటావా అంది. సరే అన్నాను. తర్వాత నాకు తినిపించింది. కాసేపు తనతో మాట్లాడదమని మాటలు కలిపాను. తన పేరు, ఊరు, తన గతం గురించి అడిగా. తను నాకు స్టోరీ మొత్తం చెప్పింది.

బాగా సంతృప్తిపరిచి పంపిస్తుంది

బాగా సంతృప్తిపరిచి పంపిస్తుంది

ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల , తన భర్త తనని వదిలిపెట్టి పోవడం వల్ల తను ఈ వృత్తిలోకి దిగింది. కానీ తను చేసే పనిని ఆమె ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదని నాకు అనిపించింది. ప్రతి కస్టమర్ ను బాగా సంతృప్తిపరిచి పంపిస్తుంది. నాకు కూడా సొంత భార్యలాగా సేవలు చేసింది.

ఒక్క రోజు రాత్రికే ఇంత సంతోషాన్ని ఇచ్చిందంటే

ఒక్క రోజు రాత్రికే ఇంత సంతోషాన్ని ఇచ్చిందంటే

ఆ రోజు రాత్రి తను నాకు అందించిన ఆ సుఖం కన్నా, తన నాపై చూపిన ప్రేమ నాకు బాగా నచ్చింది. చూడడానికి చక్కగా ఉంటుంది. కాస్త సున్నిత స్వభావం ఆమెది. అలాంటి అమ్మాయి ఇలాంటి ఊబిలోకి దిగడం నాకు బాధగా అనిపించింది. ఒక్క రోజు రాత్రికే నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చిందంటే జీవితాంతం తను నాతో ఉంటే ఇంకెంత బాగుంటుందో అని నాకు అనిపించేది.

పడక సుఖం అనుభవించే ప్రతి మగాడు

పడక సుఖం అనుభవించే ప్రతి మగాడు

నిన్ను ఎవ్వరూ ప్రేమించలేదా, పెళ్లి చేసుకుంటాం అని చెప్పలేదా అన్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాను.

"అలా ఎవరైనా చెప్పి ఉంటే నాకు ఈ గతి ఎందుకు పట్టేది.

నా దగ్గరకు వచ్చే వాళ్లంతా ఒక గంట సేపు ఎంజాయ్ చేసి పోదామని వస్తారు. వాళ్లకి నా కష్టాలు, నా జీవితం గురించి అక్కర్లేదు. పని పూర్తయ్యాక నేను అస్సలు తెలియనట్లుగా ప్రవర్తిస్తారు. నాతో పడక సుఖం అనుభవించే ప్రతి మగాడు నీలాగే ఏవేవో మాటలు చెబుతాడు. ఆ సుఖం పొంది, గుమ్మం నుంచి బయటకు వెళ్లాక వాళ్ల మైండ్ లో నేను అస్సలు ఉండను."

సుఖ పెట్టే పంపిస్తాను

సుఖ పెట్టే పంపిస్తాను

"ప్రేమ పేరుతోనే ఒక మగాడు మోసం చేస్తేనే ఈ రొంపిలోకి దిగాను. కానీ నేను చేసే వృత్తి తప్పైనా నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరినీ బాగా సుఖ పెట్టే పంపిస్తాను. నా దగ్గరకు వచ్చే కస్టమర్లంతా కూడా నీలాగే... నిన్ను పెళ్లి చేసుకుంటాం. నీతోనే కాపురం చేస్తామంటూ జోక్ చేసి వెళ్తుంటారు. ఇలాంటివి నేను రోజూ వినే కథలే. "

నాది కపట ప్రేమనే

నాది కపట ప్రేమనే

"నాతో సుఖం పొందు. బేరం కుదుర్చుకున్న ప్రకారం డబ్బిచ్చి వెళ్లు. అంతేకానీ కపట ప్రేమల గురించి మాట్లాడొద్దు అంది. నీకు రేపు కూడా నాపై ఇదే ప్రేమ ఉంటే వచ్చి ప్రేమ గురించి మాట్లాడు అంది. "

తర్వాత ఇంటికొచ్చాను. ఆమె చెప్పిందే కరెక్ట్. నాది కపట ప్రేమనే. ఆమె చూపించిన ప్రేమకు నేను సంతోషపడి కొద్ది సేపు అలా మోజుపడ్డానుగానీ, తనను జీవిత భాగస్వామిని చేసుకునేంత గొప్ప మనస్సు నాది కాదు అని నాకు అర్థమైంది.

English summary

i fall in love at first sight but she didn't believe my love

i fall in love at first sight but she didn't believe my love