మా ఆయనకు వేశ్యలు ఇచ్చే సంతృప్తి నేను ఇవ్వడం లేదంట - My Story #95

Written By:
Subscribe to Boldsky

నాకు 19 ఏళ్ల వయస్సున్నప్పుడే పెళ్లి అయ్యింది. మా ఆయన దుబాయ్ లో పని చేసేవాడు. అసలు ఆయన ఏం చేస్తాడు.. ఎలాంటి వాడు అని కూడా అడగకుండానే మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. దుబాయ్ జాబ్ అంటే ఏదో పెద్ద కంపెనీలో మంచి జాబ్ చేస్తాడనుకున్నారు మా తల్లిదండ్రులు. అందుకే వెంటనే అతనికి ఇచ్చి కట్టబెట్టారు.

ఒక్క రోజు కూడా సరిగ్గా కాపురం చెయ్యలేదు

ఒక్క రోజు కూడా సరిగ్గా కాపురం చెయ్యలేదు

మాది పేద కుటుంబం. నాకు పెళ్లి చేసే స్థోమత కూడా మా తల్లిదండ్రులకు లేకపోవడంతో అతనికిచ్చి వివాహం చేశారు. మా ఆయన నాతో ఒక్కరోజు కూడా సరిగ్గా కాపురం చెయ్యలేదు.

దుబాయ్ కి వెళ్లాడు

దుబాయ్ కి వెళ్లాడు

మా పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు ముంబైలో ఉన్నాడు. నేను గర్భిణీని అయ్యాక అతను దుబాయ్ కి వెళ్లిపోయాడు. కుటుంబ ఖర్చుల కోసం మా ఆయన నాకు కొంత డబ్బు పంపేవాడు.

రోజూ కష్టాలే

రోజూ కష్టాలే

ఆ డబ్బు ఎందుకూ సరిపోయేది కాదు. అయినా అలాగే కుటుంబాన్ని నెట్టుకుని వచ్చేదాన్ని. నేను కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. పెళ్లి అయిన దగ్గర నుంచి నాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే..

ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే..

మా ఆయన నేను గర్భిణీగా ఉన్నప్పుడు దుబాయ్ వెళ్లాడు. తర్వాత నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. బాబును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చులను కూడా మా ఆయన పంపేవాడు కాదు.

మరిన్ని కష్టాలు

మరిన్ని కష్టాలు

కొన్ని రోజుల తర్వాత మా ఆయన దుబాయ్ నుంచి బాంబే వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మరిన్ని కష్టాలు వచ్చాయి. ముంబైలో ఎలాంటి జాబ్ చేసేవాడు కాదు. ఇళ్లు గడవడం చాలా కష్టంగా ఉండేది.

కొట్టేవాడు

కొట్టేవాడు

కొన్ని రోజుల తర్వాత ముంబైలో ఒక పనిలో జాయినయ్యాడు. అక్కడిచ్చే అరకొర జీతాన్ని కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. రోజూ తాగే వాడు. నేను ఏదైనా మాట్లాడితే కొట్టేవాడు. చాలాసార్లు అతన్ని విడిచిపెట్టి వెళ్లాలి అనుకునేదాన్ని

భయంకరమైన నిజాలు

భయంకరమైన నిజాలు

కానీ అతన్ని విడిచిపెట్టి వెళ్తే నాకు ఏ ఆసరా లేదు. అందుకే మా ఆయన ఎంత టార్చర్ చేసినా కూడా నేను అతని దగ్గరే ఉండేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మా ఆయన గురించి నాకు భయంకరమైన నిజాలు తెలిశాయి.

చాలా మందితో అక్రమ సంబంధాలు

చాలా మందితో అక్రమ సంబంధాలు

మా ఆయనకు చాలా మంది అమ్మాయిలతో అక్రమసంబంధాలుండేవి. మా ఆయన రోజూ వేశ్యల దగ్గరకు వెళ్లేవాడు. ఒక రోజు నేను అతని ఫోన్ చూస్తే అందులో చాలా మంది అమ్మాయిలతో నగ్నంగా దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.

నీతో శృంగారం చేస్తే

నీతో శృంగారం చేస్తే

ఒక రోజు మా ఆయన్ని నిలదీశాను. వీళ్లంతా ఎవరు అని అడిగాను. తాను రోజుకొక్క కాల్ గర్ల్ దగ్గరకు వెళ్తానని నిర్మొహమాటంగా చెప్పాడు. నీతో శృంగారం చేస్తే నాకు సంతృప్తి కలగదని నాతోనే డైరెక్ట్ గా చెప్పాడు.

ఇష్టానుసారంగా మాట్లాడాడు

ఇష్టానుసారంగా మాట్లాడాడు

నిన్ను పెళ్లి చేసుకుని నేను ఒక్క రోజు కూడా సుఖంగా లేనని నన్నే ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతను నాతో ఒక్క రోజు కూడా సంతోషంగా గడపేవాడు కాదు. రోజూ తిట్టేవాడు. కొట్టేవాడు. రాత్రి అయితే వ్యభిచారుల దగ్గరకు వెళ్లేవాడు.

ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు

ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు

మా ఆయన నన్ను మానసికంగా వేధించేవాడు. నేను ఆయనతో సుఖంగా ఉండలేకపోతున్నాను. అతని నుంచి విడిపోయి నా బాబును ఒక తండ్రిలేని వాడిగా పెంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా అని అతన్ని వదిలిపెట్టే ధైర్యం కూడా నాకు లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.

English summary

i got hold of his phone and found out that he occasionally visits prostitutes

i got hold of his phone and found out that he occasionally visits prostitutes
Story first published: Friday, February 23, 2018, 15:30 [IST]