For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంత బాగా చదువుకున్న అమ్మాయి నాకు ఫ్లాట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు

తనని వెంటనే పెళ్లి చేసుకుని రోజూ తనతో రొమాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపేద్దామనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. వేరే కులం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు.. అందులో వాళ్లు కట్నం కూడ

|

తను పక్కన ఉంటే ఎప్పుడు తెల్లారేదో కూడా తెలిసేది కాదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అంది (#mystory385 ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.

చివరకు తను పెళ్లి చేసుకుంటావా అనేసరికి ఇది చాలు ఈ లైఫ్ కు అనుకున్నాను. చందమామ ఆడపిల్ల అయితే ఎంత అందంగా ఉంటుందో అలా ఉంటుంది తను.

నాకు తెగ నచ్చేసింది

నాకు తెగ నచ్చేసింది

తనకు నా నిజాయితీ నచ్చింది. నా ఓపిక, సహనం, నేను కష్టపడి పని చేసే తీరు ఇవన్నీ నచ్చాయి. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటా అంది. తను కూడా నాకు తెగ నచ్చేసింది. అంత బాగా చదువుకున్న అమ్మాయి నాకు ఫ్లాట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.

రోజూ తనతో రొమాన్స్

రోజూ తనతో రొమాన్స్

తనని వెంటనే పెళ్లి చేసుకుని రోజూ తనతో రొమాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపేద్దామనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. వేరే కులం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు.. అందులో వాళ్లు కట్నం కూడా ఏమీ ఇవ్వరంటున్నావ్ వద్దూ అన్నాడు.

గుళ్లో పెళ్లి చేసుకున్నాం

గుళ్లో పెళ్లి చేసుకున్నాం

నా మాట నాన్న అస్సలు వినలేదు. అందుకే ఇద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెట్టాం. వాళ్ల అమ్మ కూడా మా దగ్గరే ఉండేది.

ఆటో నడుపుతున్నాను

ఆటో నడుపుతున్నాను

తనని పెళ్లి చేసుకోవడం వల్ల నేను నా వాటర్ ప్లాంట్ బిజినెస్ మానేయాల్సి వచ్చింది. మా నాన్న నన్ను ప్లాంట్ దగ్గర అడుగుపెట్టనివ్వలేదు. దీంతో ఆటో నడుపుతున్నాను.

Most Read :తను పక్కన ఉంటే ఎప్పుడు తెల్లారేదో కూడా తెలిసేది కాదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అంది #mystory385Most Read :తను పక్కన ఉంటే ఎప్పుడు తెల్లారేదో కూడా తెలిసేది కాదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అంది #mystory385

చాలా చులకన చేసి

చాలా చులకన చేసి

ఇక కొన్ని రోజులకు నా భార్య అసలు రంగు బయటపడింది. నన్ను చాలా చులకన చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. తను ఆఫీస్ కు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో పనులు మొత్తం నన్నే చెయ్యమనేది.

నా బట్టలు పిండేయొచ్చుగా

నా బట్టలు పిండేయొచ్చుగా

తనని ఆఫీస్ కు దగ్గర నుంచి రోజూ సాయంత్రం పికప్ చేసుకోవాలి. ఉదయమే డ్రాప్ చెయ్యాలి. నేను ఇంట్లో ఒక్క క్షణం ఊరికే కూర్చొంటే కూడా ఓర్వదు. అలా ఖాళీగా కూర్చొనే బదులు నా బట్టలు పిండేయొచ్చుగా అనేది.

నన్ను సగం చంపేస్తోంది

నన్ను సగం చంపేస్తోంది

ఏదో నువ్వు పెద్ద వాటర్ ప్లాంట్ కు ఓనర్ వి అని చేసుకున్నా. ఇలా ఆటో నడుపుకుంటావని తెలిసి ఉంటే అస్సలు చేసుకునేదాన్ని కాదు అనేది. ఇలా రోజు తను మాటలతోనే నన్ను సగం చంపేస్తోంది. మానసికంగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.

మంచి పిల్ల దొరికేది

మంచి పిల్ల దొరికేది

అందమైన అమ్మాయి, బాగా చదువుకుందని కక్కుర్తి పడి పెళ్లి చేసుకున్నా. ఆమె నాకంటే బాగా చదివింది... పెద్ద జాబ్ చేస్తుందనుకుని కక్కుర్తి పడ్డాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. మా నాన్న చెప్పినట్లు విని ఉంటే మంచి పిల్ల దొరికేది. హ్యాపీగా ఇంటి దగ్గర ఉండేవాణ్ని.

Most Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

చీరలు, లంగాలు, జాకెట్లు ఉతకాలి

చీరలు, లంగాలు, జాకెట్లు ఉతకాలి

దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికేవాణ్ని. నాలాగే చాలా మంది కుర్రాళ్లు అమ్మాయిలకు వారి మాటలకు టెంప్ట్ అయి పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారు కాస్త ఆలోచిస్తే మంచిది. లేదంటే రోజూ నాలాగే ఇంట్లో చీరలు, లంగాలు, జాకెట్లు ఉతకాల్సి వస్తుంది జాగ్రత్త.

English summary

My parents didn't agree to my inter caste marriage

My parents didn't agree to my inter caste marriage
Desktop Bottom Promotion