అక్క మొగుడిపై మోజుతోనే నా మొగుడికి ఫుల్ స్టాప్ పెట్టాను - My Story #35

Written By:
Subscribe to Boldsky

స్వాతి.. జ్యోతిల మాదిరిగానే నా పేరు కూడా ఇప్పుడు సంచలనమైంది. మాది గుంటూరు జిల్లా. మా ఆయనది నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామం. ఆయన పేరు నల్లబోతు నరేంద్ర. మాది కూడా అదే ఊరు. కానీ మొదటి నుంచి నాకు మా ఆయనపై అంతగా ప్రేమ ఉండేది కాదు. అందుకే ఎప్పటి నుంచో ఆయన్ని అడ్డుతొలగించాలనుకునేదాన్ని. నన్ను మీరు చూస్తే చాలా అమాయకంగా కనపడతాను. కానీ నేను ప్లాన్ వేస్తే మాత్రం పక్కా అది చేసి తీరుతాను.

వివాహం

వివాహం

నరేంద్రకు నేను మేనమామ కుమార్తెను. అతనితో నాకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మా ఆయన సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. నేను ఓ ప్రైవేటు స్కూలులో టీచర్ గా పని చేస్తున్నా.

పెళ్లికి ముందు నుంచే

పెళ్లికి ముందు నుంచే

నాకు పెళ్లికి ముందు నుంచే నా అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉండేది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను తరచూగా అతన్ని కలిసేదాన్ని. మా ఇద్దరి వివాహేతర బంధానికి మా ఆయన అడ్డు తగలేవాడు.

అడ్డువస్తున్నాడు

అడ్డువస్తున్నాడు

మా అక్రమ సంబంధానికి నా భర్త అడ్డొస్తున్నాడని భావించిన నాకు, మా బావకు ఎలా అయిన అతన్ని చంపాలని అనిపించింది. అతన్ని అడ్డు తొలగించుకుని జీవితాంతం మేమిద్దరం సంతోషంగా గడుపుదామనుకున్నాం.

మద్యం అలవాటు

మద్యం అలవాటు

మా ఆయనకు మద్యం అలవాటు. అదే మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. మద్యంలో ఎప్పుడైనా ఏదైనా కలిపి చంపాలని ఎప్పటి నుంచో బావతో కలిసి ప్లాన్ చేశాను. అయితే సరైన సమయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశాను.

పక్కాప్లాన్

పక్కాప్లాన్

మా ఆయనను చంపేందుకు నేను, బావ కలిసి పక్కా ప్లాన్ వేశాం. మా బావ ఒక దగ్గర డబ్బు ఇచ్చేది ఉంది అది వసూలు చేసుకుని వద్దామని చెప్పి మా ఆయన్ని కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాం. తర్వాత మేము అనుకున్న ప్లాన్ ప్రకారం చంపాలనుకున్నాం.

ఆశ చూపించాం

ఆశ చూపించాం

మా ఆయనకు మా బావ ఆశ చూపించాడు. డబ్బు వసూలు చేసుకుని వద్దాం. ఒకవేళ డబ్బు వసూలైతే నీకు బుల్లెట్ బైక్ కొనిపెడతానని చెప్పాడు. దానికి ఇతను ఒకే అన్నాడు. ఇంటికి దగ్గరకు మా బావ కారు తీసుకుని వచ్చాడు. అందులో నా భర్త ఎక్కి వెళ్లాడు. అప్పటికే నా భర్త తాగి ఉన్నాడు.

మద్యంలో సైనెడ్

మద్యంలో సైనెడ్

అంతకు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం మా ఆయనకు మద్యంలో సైనెడ్ కలిపి మా బావ ఇచ్చాడు. అంతేకాదు అతను ఎదురుతిరిగితే చంపేందుకు కారులో మా బావ ఫ్రెండ్స్ ను కూడా రెడీగా ఉంచాడు. కానీ ఆ మద్యం తాగి అతను చనిపోయాడు.

చెప్పు

చెప్పు

అయితే మా ఆయనకు చెందిన ఒక చెప్పు మాత్రమే సంఘటన స్థలంలో లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు మరో చెప్పును మా బావ కారులో గుర్తించారు. దీంతో అందరినీ అరెస్టు చేశారు.

మృతదేహాన్ని పడేశాం

మృతదేహాన్ని పడేశాం

నా భర్త మృతదేహాన్ని మా బావ అతని ఫ్రెండ్స్ కారులో తీసుకెళ్లి ఓ కాల్వగట్టుపై పడవేశారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో మా గుట్టంగా బయటపడింది.

పోలీసులకు చిక్కిపోయాం

పోలీసులకు చిక్కిపోయాం

నాపై అనుమానంతో నా కాల్‌డేటాను విశ్లేషించారు పోలీసులు. నేను తరుచూ వీరయ్యతో మాట్లాడినట్లు తేలింది. బావతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే పక్కా స్కెచ్‌తోనే నా భర్తను హత్య చేయించాననే విషయం తేలింది. మొత్తానికి మొగుళ్లను చంపిన పెళ్లాల జాబితాలో...స్వాతి, జ్యోతిల తర్వాత నేను కూడా చేరాను.

నవ్వుతూనే కనపడ్డాను

నవ్వుతూనే కనపడ్డాను

నా భర్తను హత్య చేసినందుకు నాలో పశ్చాత్తాపం లేదు. మేము అనుకున్నట్లుగానే చంపేశాం. మా బావతో హ్యాపీగా ఉందామనుకున్నా. కానీ పోలీసులకు దొరికిపోయాను. మీరు నన్ను ప్రెస్ మీట్ లో చూసి ఉంటే గమనించి ఉంటారు... అందులో నవ్వుతూనే కనపడతాను.

మోజుతో చేసిన హత్యలే

మోజుతో చేసిన హత్యలే

అయితే ఇప్పుడు అంతటా సంచనం మారిన భర్తల హత్యలన్నీ కూడా ఏదో ఆవేశంలోనో, భయంతోనో చేసిన హత్యలు కాదు. ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో చేసిన హత్యలే. ఇటీవలకాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ భర్తల హత్యల ఉదంతం అంతటా చర్చనీయాశంగా మారింది.

English summary

Mystory Woman kills hubby for lover

Mystory Woman kills hubby for lover