Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
‘పెళ్లి జరిగి పదిరోజులవుతున్నా.. నన్ను తాకనివ్వడం లేదు...’
మీ భాగస్వామితో రిలేషన్ షిప్ ఎలా మెరుగుపరచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది యువత పెళ్లయిన వెంటనే శృంగారంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా.. ఆ కార్యాన్ని ఎలా ఆస్వాదించాలా అని తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శృంగారం అనేది చాలా కీలకం.

ఈ కీలకమైన ఘట్టం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు పెళ్లి జరిగి చాలా రోజులవుతున్నప్పటికీ శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు చాలా మందికి కోరికలు కూడా తగ్గిపోతూ వస్తున్నాయట. దీంతో చాలా మంది తమ వివాహ బంధానికి వీడ్కోలు పలకడం.. లేదా తప్పుడు మార్గాల గురించి ఆలోచించడం వంటివి చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో ఒక యువకుడు తనకు పడకగదిలో ఎదురైన సమస్యల గురించి ఇలా చెప్పుకున్నాడు.. 'కరోనా తగ్గిన కారణంగా నాకు ఇటీవలే పెళ్లి జరిగింది. కానీ పదిరోజులవుతున్నా ఏ పనీ కాలేదు.. దీంతో నేను చాలా నిరుత్సాహపడుతున్నాను. నా భార్య నన్ను తాకనివ్వడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి' అని తన సమస్యను చెప్పుకున్నాడు. ఇందుకు నిపుణులు ఎలాంటి సలహాలు ఇచ్చారు.. ఇంతకీ తన సమస్య తీరిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏవేవో ఊహాలు..
హాయ్ ‘నా పేరు రాజేష్ (పేరు మార్చాం). చాలా కాలం తర్వాత నాకు పెళ్లి జరిగింది. నాకేమో కోరికలు చాలా ఎక్కువ. ప్రస్తుతం నేను నా భాగస్వామితో ఎంజాయ్ గురించి ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఏవేవో కలలు కన్నాను. అయితే తను మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక కారణం చెప్పి నా నుండి దూరం వెళ్తోంది.

ఇలాగే గడపాలా?
ప్రస్తుతం మా పెళ్లి జరిగి పది రోజులు పూర్తయ్యింది. ఎందుకని తను నా నుండి దూరంగా వెళ్తోందో అర్థం కావట్లేదు. ఇంతకీ సమస్య తనలోనేనా? లేదా తనకు ఏదైనా భయం ఉందా అర్థం కావట్లేదు. పడకగది నుండి బయటికొచ్చేసరికి బంధువులు మాత్రం నేనేదో సాధించినట్లు ఓర చూపులు చూస్తున్నారు. ఇక పెద్దవారైతే తమకు మనవడిని లేదా మనవరాలిని ఎప్పుడిస్తున్నావంటూ ఒకటే గోల పెడుతున్నారు. కానీ తను మాత్రం నన్ను తాకనివ్వడం లేదు. నాకు తనతో లైఫ్ మొత్తం ఇలాగే గడపాలా? అనే సందేహం కలుగుతోంది' అంటూ తన సమస్య చెప్పుకున్నాడు.

అంత సులభం కాదు..
మనలో చాలా మంది ఆ కార్యంలో పాల్గొనడం చాలా సులభం అని భావిస్తూ ఉంటారు. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఇలాంటివే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని రకాల మార్గాలున్నాయి. వాటిని ప్రయత్నిస్తే చాలు.. మీ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది.

మీరే చొరవ తీసుకోవాలి..
మీ భాగస్వామి మీతో ఆ కార్యానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ముందుగా మీరే చొరవ తీసుకోవాలి. ముందుగా మీ భార్య మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకోసం మీరే చొరవ తీసుకుని తనతో ప్రేమగా ఉండటం ప్రారంభించాలి.

మంచిగా మాట్లాడాలి..
ముందుగా మీరు తనతో చాలా ప్రేమగా మాట్లాడాలి. తనతో చాలా విభిన్నంగా ప్రవర్తించాలి. అలా నెమ్మదిగా శృంగార విషయాల్లోకి తీసుకెళ్లాలి. తనకు ఏమంటే ఇష్టం.. ఏమంటే ఇష్టం లేదనే విషయాల గురించి తెలుసుకోవాలి. తనకు మీలో నచ్చనవాటిని వదిలేస్తానని చెప్పాలి. అలా తనతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి. తనతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవాలి.

ఒత్తిడి వల్ల..
కొన్నిసార్లు ఏదైనా విషయంలో ఒత్తిడి వల్ల అమ్మాయిలు శారీరకంగా కలవడానికి ఇష్టపడకపోవచ్చు. లేదా వారికి కోరికలు తక్కువగా ఉండటం వల్ల ఆ కార్యంపై ఆసక్తి చూపకపోవచ్చు. లేదా తను ఏదైనా శృంగార పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుందా అనే విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పటికీ తను మీకు కోఆపరేట్ చేయకపోతే నిపుణులను సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications
