Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
ఆలుమగల మధ్య సమస్యలకు పడకగదిలోనే పరిష్కారం దొరుకుతుందా?
మీ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన సంబంధం కావాలంటే ఏమి చేయాలో చూడండి.
ప్రేమికులు లేదా ఆలుమగలు అన్నాక ఎప్పుడో ఒకసారి లేదా చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అయితే ఆ గొడవలన్నీ చాలా మందికి చీకటి పడేసరికి.. అదీ పడకగదిలో చేరేలోపు ముగుస్తాయని నిపుణులు చెబుతుంటారు.

ఇది ఎప్పటినుండో వాడుకలో ఉన్న పాత మాటే. అయితే కేవలం బెడ్ రూమ్ మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం కాదు.. అయితే కాలంలో వస్తున్న మార్పులు.. మారుతున్న పరిస్థితుల కారణంగా కపుల్స్ మధ్య అనేక మార్పులొచ్చాయి.

ప్రస్తుతం ఏడడుగుల బంధం, ప్రేమ బంధం లేదా సహజీవనం ఇలా ఏ బంధమైనా వారి వారి ఇష్టాలు, అభిరుచులు, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి.

అలా ఇద్దరూ అర్థం చేసుకుని నడుచుకుంటే.. వారి రిలేషన్ హ్యాపీగా మారిపోతుంది. అలాంటి జంటల్లో మీ బంధం కూడా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఇప్పుడే తెలుసుకోండి...

వ్యక్తిత్వాలను బట్టి..
మన సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటాయి. వారి పుట్టి, పెరిగిన వాతావరణం, పరిస్థితులను బట్టి వారి వ్యక్తిత్వాలు వివిధ రకాలుగా ఉంటాయి. దీన్ని బట్టే వారి బంధాలు, అనుబంధాలు ఉంటాయి. వీటిలో కొన్ని మంచిగా ఉంటే.. మరికొన్ని చెడుగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రం బయటకు కనబడకుండా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అయితే ఆలుమగల మధ్య ఉండే రిలేషన్ షిప్ వారి రొమాంటిక్ లైఫ్ ను మరింత బలోపేతం చేసి వారి సంసారాన్ని మరింత సుఖవంతంగా తయారు చేస్తుంది.

ఏ బంధమైనా..
ప్రేమ బంధమైనా.. వివాహ బంధమైనా.. ఏ బంధంలో అయినా ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి వస్తుంది. అది వారి ఇష్టాలు, అలవాట్లు పరిస్థితుల మేరకు ఆధారపడి ఉంటాయి. అంతేకాదు తన జీవిత భాగస్వామికి నచ్చే విధంగా ప్రయత్నిస్తారు.

ఎదుటివారికి తగ్గట్టు..
అయితే కొందరు మాత్రం తమ రిలేషన్ లో ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు ఎదుటివారికి తగ్గట్టు వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం.. ప్రతి విషయానికి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది.

అవి చెప్పకపోవడం..
చాలా మంది కపుల్స్ తమలోని అభద్రతను, బలహీనతల్ని ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడతారు. తమ గురించి ఏవైనా చెప్పకూడని విషయాలు చెబితే.. వాటిని వారు తప్పుగా అర్థం చేసుకుంటారనే అనుమానపడుతూ ఉంటారు. అయితే ఎలాంటి అపొహలు పెట్టుకోకుండా తమ మనసులోని అన్నీ విషయాలను షేర్ చేసుకుంటే మీ బంధం బలంగా ఉంటుంది.

దూరం పెరగకుండా..
మీ రిలేషన్ షిప్ దూరంగా రాకుండా ఉండాలంటే.. మీరు నిరంతరం ప్రతి విషయం గురించి మాట్లాడుకోవాలి. ముందుగా చర్చించుకోవడం అనే దానికి ప్రియారిటీ ఇవ్వాలి. అలా చేయడం వల్ల మీ మధ్య గొడవలు రాకుండా ఉండొచ్చు.

ఆలోచనలకు విలువ..
ఏ బంధంలో ఉన్నా సరే..మనం ఇతరుల ఆలోచనలకు విలువ ఇవ్వడం మరియు వారి అభిప్రాయాలను గౌరవించడం అనేది కీలక పరిణామం. అలాగే రిలేషన్ షిప్ లో కూడా ఇవి పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది.

మాట మీద నిలబడటం..
ప్రాణం పోయినా కూడా మాట తప్పకూడదు అని పెద్దలు చెబుతుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. అప్పుడే మన మాటలకు విలువ ఉంటుంది. ఇది నిజ జీవితంలో కష్టంగా అనిపించినప్పటికీ, మీ సంతోషకరమైన, హ్యాపీ లైఫ్ సాఫీగా సాగాలంటే మీరు ఏదైనా ప్రామీస్ చేస్తే, దాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ బంధం ఎక్కువకాలం మంచిగా ఉంటుంది.

పడకగదే పరిష్కారం కాదు..
కేవలం పడకగదిలో రొమాన్స్ మాత్రమే పరిష్కారం కాదు.. ప్రస్తుతం సినిమాల ప్రభావమో.. లేదా ఇంకేదైనా ప్రభావమో తెలీదు కానీ.. ఇటీవల చాలా మంది కపుల్స్ ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆ కార్యంలో పాల్గొంటే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. కాకపోతే తాత్కాలికంగా మీ బంధం హ్యాపీగా ఉంటుంది తప్ప.. శాశ్వతంగా మాత్రం కాదు.



Click it and Unblock the Notifications
