For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...

వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారనేందుకు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

వివాహం అనే బంధంతో ఇద్దరు కొత్త వ్యక్తులు లేదా ప్రేమికులు ఒక్కటవుతారు. భార్యాభర్తల బంధం అనేది ప్రేమతో ముడిపడిన బంధం. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నంత కాలం వారి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

Reasons Why People Have Extra marital Affairs

అయితే పెళ్లయిన కొత్తలో ప్రతి ఒక్కరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతారు. అయితే పిల్లలు పుట్టాక లేదా ఇంకేదో కారణాలతో భార్య లేదా భర్తలు పక్కచూపులు చూస్తుంటారు. దీంతో మీ వివాహ బంధంలో చీలికలొచ్చేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న భాగస్వామి తాము మోసానికి గురయ్యామని ఫీలవుతుంటారు.

Reasons Why People Have Extra marital Affairs

ఈ నేపథ్యంలో తీవ్రంగా బాధపడతారు. అయితే ఇలా మోసం చేయడానికి అనేక కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...

కొత్త ఆకర్షణలు..

కొత్త ఆకర్షణలు..

వివాహ సంబంధంలో మోసం జరిగేందుకు ప్రధాన కారణాలలో ఇదొకటి. కొత్త వారిపై ఆకర్షణం కలగడం వల్ల వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపొచ్చు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పార్ట్ నర్ తో బోర్ గా ఫీలవ్వడం. ఉదాహరణకు ఏదైనా వస్తువులు కొన్ని నెలల తర్వాత పాతబడిపోతాయి. అందరూ పాతవాటిని వదులుకుని.. కొత్తవాటిని కోరుకుంటారు. అలాగే పెళ్లయిన వారు కూడా తమ రిలేషన్ షిప్ లో కూడా తమ పాత పార్ట్ నర్ ను పట్టించుకోవడం మానేస్తారు. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో కొత్త ఆకర్షణలతో వచ్చే థ్రిల్, ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే ప్రస్తుత మీ రిలేషన్ షిప్ లో థ్రిల్ ఉంటే మాత్రం వివాహేతర సంబంధం గురించి ఎలాంటి ఆలోచనలు ఉండవు.

ఆవేశంలో..

ఆవేశంలో..

కొందరు వ్యక్తులు తమ భాగస్వామితో కొన్నిసార్లు గొడవ పడుతుంటారు. ఆవేశంలో తమ పార్ట్ నర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి మోసాలు చేయాలని భావిస్తారు. ఉదాహరణకు మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేశారనీ, మరో వ్యక్తితో మీరు క్లోజ్ గా ఉన్నారని తెలిసినా వారు బాగా ఫీలవుతారు. షాకింగ్ గా ఫీలవుతారు. అసలు నమ్మేలా ఉండదు. ఇలాంటి నమ్మకద్రోహాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. ఇవన్నీ మీ భాగస్వామి కూడా అనుభవించాలి, అప్పుడే ఈ బాధేమిటో వారికి కూడా తెలియాలనే కారణం కావొచ్చు.

హ్యాపీగా లేకపోవడం..

హ్యాపీగా లేకపోవడం..

ఏ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా. వారిద్దరూ అన్యోన్యంగా కలిసే ఉండాలనుకుంటారు. ఒకరికొకరు తమ అవసరాలను తీర్చుకోవడం.. సహాయం చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అలాంటివి తమ భాగస్వామితో దొరకనప్పుడు.. వారి అవసరాలను ఇంకొక చోట తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఈ అనారోగ్యకరమైన బంధాలు ఒకదానితో ఆగక మరిన్ని పక్కచూపులు చూస్తుంటారు.

పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!

అవి లేకపోవడం..

అవి లేకపోవడం..

ప్రేమ అనేది జీవితాంతం ఒక్కరిపైనే ఉండదు. కొంతకాలం ఆ ప్రేమ అనేది భాగస్వామిపై తగ్గిపోతుంది. ఇలాంటివి మనం చాలా సినిమాల్లో కూడా చూశాం. అయితే అదే సమయంలో మీకు ఎవరైనా కొత్త వ్యక్తులతో ప్రేమ మొదలవ్వొచ్చు. మరోవైపు మీ భాగస్వామితో ప్రేమ తగ్గిపోవడం.. ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉన్నామన్న విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడే పక్కదారిలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.

గ్యాప్ రావడం..

గ్యాప్ రావడం..

భార్యభర్తల్లో ఇద్దరూ రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనలేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది. మీ భాగస్వామితో తక్కువ సమయం గడపడం.. వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలయితే.. వారు ఇంకో రిలేషన్ ను కోరుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరైనా తమకు దగ్గరైతే వారితో ఫిజికల్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసేందుకు ఆసక్తి చూపుతారు.

సీరియస్ అవ్వొచ్చు..

సీరియస్ అవ్వొచ్చు..

కొందరు తమ భాగస్వామితో కలిసి జీవితాంతం హాయిగా కొనసాగించాలి భావిస్తారు. అయితే వారి రిలేషన్ షిప్ లో ఏదైనా తప్పు జరిగితే అందరూ ఒకేలా చూడకపోవచ్చు. పైగా ఈ సంబంధం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకుంటారు. అయితే ఒకరికి కామన్ అనిపిస్తే.. మరొకరికి చాలా సీరియస్ గా అనిపించొచ్చు.

సీరియస్ అవ్వొచ్చు..

సీరియస్ అవ్వొచ్చు..

కొందరు తమ భాగస్వామితో కలిసి జీవితాంతం హాయిగా కొనసాగించాలి భావిస్తారు. అయితే వారి రిలేషన్ షిప్ లో ఏదైనా తప్పు జరిగితే అందరూ ఒకేలా చూడకపోవచ్చు. పైగా ఈ సంబంధం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకుంటారు. అయితే ఒకరికి కామన్ అనిపిస్తే.. మరొకరికి చాలా సీరియస్ గా అనిపించొచ్చు.

పాజిటివ్ ఫీలింగ్స్..

పాజిటివ్ ఫీలింగ్స్..

భార్యభర్తలు పడకగదిలో ఉన్నప్పుడు.. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల ఏదైనా విషయంలో ఆందోళన చెందుతారు. అలాంటి సమయంలో కొత్త వారితో పరిచయం పాజిటివ్ ఫీలింగ్స్ ని ఇస్తుంది. ఇలాంటి సమయంలో ఆకర్షణీయంగా, ధైర్యంగా, విజయవంతంగా ఫీల్ అవ్వొచ్చు. ఈ ఫీలింగ్స్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

English summary

Reasons Why People Have Extra marital Affairs

Here are the reasons why people have extra marital affairs. Have a look
Story first published:Wednesday, June 30, 2021, 18:41 [IST]
Desktop Bottom Promotion