Latest Updates
-
జూన్ 5 గ్రహాల గమనం: ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థికంగా ఊహించని అదృష్టం.. మీ రాశి ఉందా? -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? - శుక్రవారం, 05 జూన్ 2026 -
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.!
మధురమైన బంధాన్ని ఈ పనులు చెడగొడతాయి.. అవేంటో తెలుసుకోండి
భాగస్వామిని ఎక్కువగా నొప్పించి, బంధంలో చీలికలు తెచ్చే కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమలో అయినా, పెళ్లిబంధంలో అయినా ఒడిదొడుకులు సర్వ సాధారణం. కలహాలు, గొడవలు, అలకలు ఉంటాయి. అభిప్రాయభేదాలు, వాగ్వాదాలు లేని బంధం ఉండదు. సాధారణంగా వచ్చే ఇలాంటి కలహాలను సమయస్ఫూర్తితో, కొంత ఓపికతో, మరికొంత ప్రేమతో ఉంటే గొడవలు సద్దుమణుగుతాయి. అయితే కొన్ని రకాల చర్యల వల్ల భాగస్వామి మనసు విరిగిపోతుంది. ఎదుటివారు చేసే ఇలాంటి పనులు వల్ల వాళ్లు చాలా ఫీలైపోతారు.

భాగస్వామిని ఎక్కువగా నొప్పించి, బంధంలో చీలికలు తెచ్చే కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యంగం:
ప్రేమలో, దాంపత్యబంధంలో భాగస్వాముల మధ్య వెక్కిరింపులు, వ్యంగం, హేలన సాధారణం. అయితే వీటిని ఇద్దరూ పాజిటివ్ గా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అలాగే వెక్కిరింపులైనా, వ్యంగమైనా ఒక స్థాయి వరకే ఉండాలి. ఆ పరిమితి దాటితేనే సమస్య మొదలవుతుంది.
ఇద్దరూ నవ్వుకునేలా ఉండే ఎలాంటి చర్య అయినా, ఎలాంటి మాట అయినా బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఎదుటివారి మనస్సును నొప్పించేలా ఉండే మాటలు బంధంలో చీలికలను తీసుకువస్తాయి. మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడుతున్నట్లు అనిపిస్తే క్షమాపణ అడగండి. అది కూడా మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నట్లు ఎదుటివారికి తెలిసేలా చేయాలి.

సమయం ఇవ్వకపోవడం:
ప్రేమించే వ్యక్తులకు బహుమతులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తే చాలా సంతోషిస్తారు. కానీ సమయం ఇవ్వకపోతే ఎంతో వేదనకు గురవుతారు. ఇంది బహుమతులు ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనం ప్రేమించే వారికి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ సమయం. వారితో గడిపితే ఎంతో ఆనందిస్తారు.

ఎప్పుడూ గొడవలే:
ముందే చెప్పుకున్నట్లు సంబంధంలో కలహాలు, గొడవలు సాధారణమే. అయితే ఈ గొడవలు అనేవి అప్పుడప్పుడు ఉంటే ఓకే. కానీ, రోజూ, రోజంతా ఉంటే మాత్రం సంబంధంపై విసుగు వచ్చేస్తుంది. బయటకు వెళ్లి ఇంటికి రాగానే గొడవ మొదలైతే మనసుకు ప్రశాంతం ఇంకెక్కడ లభిస్తుంది. మనశ్శాంతి లేని బంధం ఎక్కువ కాలం నిలవదు.
కాబట్టి చిన్న చిన్న విషయాలకు తరచూ గొడవ పడటం తగ్గించుకోవాలి. ఇది క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల గొడవలు జరగవు. అభిప్రాయబేధాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే వాటిని ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయని సూచిస్తున్నారు.
గొడవలు ఎందుకు జరుగుతున్నాయి.. ఎక్కడ మొదలవుతున్నాయో గుర్తించడం ముఖ్యం. గొడవలకు బీజం ఎక్కడో తెలిస్తే వాటిని అరికట్టడానికి వీలుంటుంది. గొడవలు జరగకుండా ఉండేందుకు భాగస్వాములు ఎవరో ఒకరు లేదంటే ఇద్దరూ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ కావాల్సి ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు.

సమస్యను పంచుకోకపోవడం:
బంధం అంటే అందులో ఇద్దరూ ఉంటారు. ఎవరైనా ఒక్కరే ఉంటే దానిని రిలేషన్‌షిప్ అని అనలేం. సంబంధంలో ఉన్న వ్యక్తుల సంతోషాలు, సమస్యలు, సుఖాలు దుఃఖాలు ఇద్దరూ పంచుకోవాలి. సంతోషాన్ని పంచుకుని, దుఃఖంలో ఒంటరిగా వదిలిపెట్టడం వల్ల అది బంధం అనిపించుకోదు.
ఒకరి బాధ మరొకరితో పంచుకుంటే సగం బరువు దిగిపోతుంది. మీ భాగస్వామి బాధను మీరూ పంచుకోండి.. సమస్య ఏమిటో తెలుసుకోండి.. ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. అప్పుడు సమస్యా తీరిపోతుంది. బంధం బలోపేతం అవుతుంది.

అతిగా ఆలోచించడం:
అతి ఎక్కడా పనికి రాదు. అతి అనర్థానికి మూలం అనేది అందుకే. ఒక పనిని అతిగా చేయడం వల్ల నష్టాలే వస్తాయి. ఇది ప్రతి ఒక్కదానికి వర్తిస్తుంది. అతిగా ఆలోచించడం, ఎప్పుడూ ఆలోచనల్లోనే మునిగిపోయే భాగస్వామితో బంధం ఏమాత్రం సంతోషంగా ఉండదు.
ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కో, పార్కుకో వెళ్లారనుకోండి. అక్కడ ఇద్దరూ కలిసి కబుర్లాడుకోవాల్సిన సమయంలో మీ భాగస్వామి ఏటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతే మీకెలా ఉంటుంది. ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది కదా. అందుకే ఆలోచనలైనా ఇంకేదైనా ఒక పరిమితి వరకు ఉంటేనే బాగుంటుంది. అతి పనికి రాదు.



Click it and Unblock the Notifications