Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
ఈ ప్రవర్తనలు సంబంధాలను నాశనం చేస్తాయి, అవేంటంటే?
భాగస్వామి బిహేవియర్ వల్ల సంబంధాలు నాశనం కావొచ్చు. దాంపత్య బంధాన్ని నాశనం చేసే ఆ ప్రవర్తనలు ఏంటి, వాటి నుండి సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధాలు జీవితంలో ముఖ్యమైన భాగం. మద్దతుకు, సాంగత్యానికి, సాన్నిహిత్యానికి మంచి భావాన్ని అందిస్తాయి. సంబంధాలు ఎంత మధురమైనవో అంత గందరగోళమైనవి. మంచి బంధం ఒక జంటకు భద్రత, ఆప్యాయత, గౌరవం అందిస్తాయి. భార్యాభర్తలు చాలా లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అయితే దాంపత్య బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి భార్యాభర్తలు రోజూ కృషి చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రవర్తనలు సంబంధాన్ని నాశనం చేస్తాయి. జీవితభాగస్వామి యొక్క బిహేవియర్ వల్ల మరొక పార్ట్‌నర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భాగస్వామి బిహేవియర్ వల్ల సంబంధాలు నాశనం కావొచ్చు. దాంపత్య బంధాన్ని నాశనం చేసే ఆ ప్రవర్తనలు ఏంటి, వాటి నుండి సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నలుగురిలో ఒకరిపై అరవడం
సంబంధంలో ఉన్న తర్వాత ఒకరికొకరు గౌరవించుకోవాలి. వారి మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని నాశనం చేసుకోవద్దు. ఒకరి లోపాలకు ఒకరు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే కాని నలుగురిలో ఉన్నప్పుడు వేరే వ్యక్తుల వద్ద భాగస్వామి లోపాలను ఎత్తిచూపవద్దు. అలాగే వారిపై అరవకూడదు.

2. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్
దంపతులు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. తెలుసుకోవాలని కోరుకుంటారు. పెళ్లి అయిన కొత్తలో ఎన్నో విషయాలు పంచుకుంటారు. వారి గతంలో జరిగిన ఘటనలు, రహస్యాలు, సంబంధాలు ఇలా చాలా వాటి గురించి చెబుతారు. అయితే వాటితో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం తప్పు. ఒకరిని నమ్మి వారి వ్యక్తిగత విషయాలు పంచుకుంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం నిజంగానే తప్పు. ఇలాంటి ప్రవర్తన ఉండే వ్యక్తులతో ఎక్కువ రోజులు సంబంధంలో కొనసాగలేము.

3. అగ్రెసివ్ బిహేవియర్
అగ్రెసివ్ బిహేవియర్ ఎప్పుడూ నష్టాన్నే చేస్తుంది. అకారణంగా అరవడం, తరచూ కోప్పడుతుండటం వల్ల సాన్నిహిత్యం పెరగదు. దీని వల్ల సంబంధంలో చీలికలు వస్తాయి.

4. ద్రోహం
ద్రోహం ఏ సంబంధాన్ని అయినా విచ్ఛిన్నం చేస్తుంది. నమ్మకంలేని బంధం ఎప్పుడూ నిలవదు. భాగస్వాముల మధ్య విశ్వాసం లేకపోవడం అంటే వారు విడిపోవడానికి దగ్గరగా ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి.

5. ఇష్టమైన వస్తువులను నాశనం చేయడం
ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు, ఇష్టాలు ఉంటాయి. కొన్ని వస్తువులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు, సోదరులు, ప్రియమైన వారు బహుమతిగా ఇచ్చిన వస్తువులు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. దానితో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి వస్తువులను ధ్వంసం చేయడం అంటే బంధంలో బీటలు వారేలా చేయడమే. భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తామో.. వారి విశ్వాసాలకు, నమ్మకాలకు అంతే విలువ ఇవ్వాలి.



Click it and Unblock the Notifications
