Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
‘నాకు రొమాన్స్ అంటే పిచ్చి... కానీ తను సహకరించట్లేదు... ఇప్పుడేం చేయాలి...’
మీ భాగస్వామికి శృంగారంలో ఆసక్తి తగ్గిపోతే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి పెళ్లి అనే మధురమైన ఘట్టం తర్వాత జరిగే తంతు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. పెళ్లైన కొత్తలో ఆ కార్యంలో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉంటారు.

అయితే అందరి జీవితాల్లో అలా జరగకపోవచ్చు. దానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత వారి శరీరంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వంటి వాటి వల్ల వారికి శృంగారంపై ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది.

అయితే కాలం కరుగుతున్న కొద్దీ జంటల మధ్య కోరికలు కూడా తగ్గిపోతూ వస్తాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత భార్యభర్తలిద్దరూ ఎక్కువగా మారిపోతారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గిపోతుంది.

అంతేకాదండోయ్.. అసలు శృంగారం పేరేత్తేతినే తెగ చిరాకు పడతారు. ఈ నేపథ్యంలో ఓ భర్త తను ఆ కార్యం కోసం ఎంతలా బాధపడ్డాడో.. తనకు ఎందుకని అలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. ఇంతకీ అతని సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

మా ఇద్దరి మధ్య..
‘హాయ్! నా పేరు గిరీష్(పేరు మార్చాం). నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. మాకు ముగ్గురు పిల్లలు. అయితే నా భార్యకు పెళ్లి తర్వాత శృంగారం అంటే అస్సలు ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు ఆ పేరు ఎత్తితే చాలు తెగ చిరాకు పడుతోంది.

అది తప్ప..
అయితే శృంగార విషయాన్ని పక్కనబెడితే మా ఇద్దరి రిలేషన్ చాలా బాగానే ఉంది. పెళ్లి జరిగి పిల్లలు పుట్టినప్పటి నుండి తను ఇలాగే ప్రవర్తిస్తోంది. నేను ఈ విషయం గురించి తనతో చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నించాను. అప్పుడు తను విషయాన్ని డైవర్ట్ చేస్తోంది తప్ప.. ఆ కార్యం గురించి అస్సలు మాట్లాడట్లేదు.

ఒక్కోసారి ఇష్టం లేకున్నా..
అయితే నేను దీని గురించి బాధపడటం చూస్తే మాత్రం తనకు శృంగారంలో పాల్గొనడం ఇష్టం లేకపోయినా.. కేవలం నా కోసం ఆ కార్యంలో పాల్గొనేందుకు ఓకే చెబుతుంది. అప్పుడు నాకు శృంగారంలో పాల్గొన్నట్టు అస్సలు అనిపించేది కాదు. ఎందుకంటే తనలో ఎలాంటి స్పందన, భావోద్వేగం, ఉత్సాహం కనిపించేవి కాదు. చాలా చిరాకుగా అనిపించేది.

కోరికల విషయంలో..
నాకేమో శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే తనకు మాత్రం ఆ కార్యం గురించి అస్సలు పట్టించుకునేది కాదు. తనను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో నేను ప్రతిరోజూ ఆ కార్యంలో పాల్గొనకుండా.. కనీసం వారంలో ఒకట్రెండు సార్లు కావాలని అడిగేవాన్ని. అయినా కూడా రిజల్ట్ నిల్.

డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే..
ఈ విషయం గురించి నేను నా భార్యను డాక్టర్ దగ్గరికి లేదా మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను. కానీ తను మాత్రం అలా రావడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇన్నిరోజులు అలాంటి వీడియోలు చేస్తూ.. హస్తప్రయోగం చేసుకుంటూ ఎలాగోలా గడిపేశాను. కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కావటం లేదు.

బలహీన క్షణంలో..
పైగా ఇప్పుడేమో చలికాలం వచ్చేసింది. నాకేమో ఇటీవలే కొందరి దగ్గరి నుండి కాల్స్ వస్తున్నాయి. నేను ఇలాంటి పరిస్థితిలో ఉండి ఏదో ఒక బలహీన క్షణంలో వారిలో ఎవరో ఒకరితో.. లేదా అందరితో ఆ కార్యంలో పాల్గొంటానేమో అనే భయం వేస్తోంది. దీని గురించి నా భార్యకు చెప్పేందుకు ప్రయత్నించినా.. తను అస్సలు పట్టించుకోవడం లేదు.

తొందరపాటులో..
దీనికి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా మీ భార్యకు శృంగార కోరికలు తగ్గిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

ఏవైనా మందులు..
తనకు ఆ కార్యంలో పాల్గొంటే ఏదైనా సమస్య ఎదురవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ముందుగా ఎవరైనా ఒక వైద్యుడిని సంప్రదించండి.

ఆ లోపం వల్ల..
ఎవరైనా మహిళల్లో హైపోథైరాయిడిజం, విటమిన్ డి లోపం, ఎనిమీయా సమస్య ఎక్కువగా ఉండటం వల్ల వారి లిబిడో తగ్గిపోతుంది. దీని వల్ల తను ఆ కార్యంలో పాల్గొంటే ఆమెకు నొప్పిగా అనిపించొచ్చు. మీరున్న ఉత్సుకతలో మీరు దాన్ని అబ్జర్వ్ చేసిండకపోవచ్చు.

ఇలాంటివి సహజం..
ప్రస్తుత సమాజంలో చాలా మందికి శృంగారం విషయంలో ఆలుమగలిద్దరిలో ఒకరికి ఎక్కువ కోరికలు ఉంటే.. మరొకరికి ఆ కార్యం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. ఇలాంటి సమయంలో మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. ఓపికగా వ్యవహరించాలి. లేదంటే మీ గుడ్ రిలేషన్ షిప్ లో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ సమస్యకు పరిష్కారం కావాలంటే.. మీరు మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications