Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
వివాహమనేది జీవితంలో చాలా పెద్ద ఘట్టం. ప్రతీ ఒక్కరి జీవితం వివాహం ముందు వివాహం తరువాతగా ఉంటుంది. భార్య లేదా భర్త జీవితంలోకి రాగానే అప్పటి వరకున్న ప్రపంచం తరువాత ఉన్న ప్రపంచం వేరు. ఇక వారితోనే సుఖసంతోషాలన్నింటినీ పంచుకుంటాం. జీవిత ముగిసిపోయేంతవరకు మనవెన్నంటి ఉండేది జీవిత భాగస్వామే. కాబట్టి పెళ్లిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రముఖ్యం కలిగి ఉంది. అలాంటి పెళ్లి రోజు శుభాకాంక్షలను మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు తెలపడానికి మీకు ఎంపిక చేసిన పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను మీకు అందిస్తున్నాము.

పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలు
ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని
మీ అనుబంధం ఇలాగే ఉండాలని
కోరుకుంటూ
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్లి రోజు శుభాకాంక్షలు...!
మీ దంపతులు
ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో
జరుపుకోవాలని..
కోరుకుంటూ ...
నా హృదయ పూర్వక శుభాకాంక్షలు...!
ఒక్కటైన రెండు మనసులకు
మూడు ముళ్ల బంధం వేసి
నాలుగు దిక్కులు మీ తోడై నడవగా
పంచ భూతాలు పల్లకి కాగా
ఆరు జన్మలకు తోడుంటావంటు
ఎడడుగులు వేయగా
అష్ట దిక్పాలకులు ఆశీర్వందించగా
నవ గ్రహాలు నేలపై ఉన్న ఈ పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా,
పది కాలాల పాటు కలిసి ఉండాలి మీరు
పదిమంది మెచ్చుకునేలా ఉండాలి
అని మనస్పూర్తిగా కోరుకుంటూ
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...!
నీ వైవాహిక జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ నీకు & నీ భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
అవధులు లేని ప్రేమానురాగాలతో...
మీ వైవాహిక జీవితం ఆనందంగా
సాగిపోవాలని కోరుకుంటూ
హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు...!
సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్హినా.... కన్నీరే వచ్చినా... ఒకరికి ఒకరు
అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో
నవ్వుతూ ఉండాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ.... మీ దంపతులకు పెళ్లి రోజు
శుభాకాంక్షలు.
తప్పు
ఎవరిదైనా
కావచ్చు...
ఒక మాట
తగ్గి బ్రతకడం లో
ఉన్న
ఆనందం...
వెయ్యి మంచి మాటలతో సమానం...
మీ దంపతులకు పెళ్లి రోజూ శుభాకాంక్షలు...!
నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
కోరుకున్న ఇంతి ...నేడు నీ సతి
నేడు పట్టుకున్న ఆమె చెయ్యి ...
విడవకు ఎన్నటికి..
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు ..
ఒరేయ్! నేను చూసిన భార్యభర్తలలో మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది. అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
