Latest Updates
-
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్‌గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.!
ఆధునిక జంటలు నార్మల్ అనుకుంటున్న అతి పెద్ద రిలేషన్ షిప్ తప్పు ఇదే.. మీరూ చేస్తున్నారా?
ప్రేమ, బంధాలు అనేవి జీవితంలో చాలా అందమైనవి. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, స్మార్ట్‌ఫోన్ల యుగంలో రిలేషన్ షిప్స్ చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ఆధునిక కాలంలో చాలా మంది జంటలు తమ బంధంలో దొర్లుతున్న కొన్ని తప్పులను అత్యంత సాధారణమైనవి గా భావిస్తున్నారు. కానీ నిజానికి అవే వారి బంధాన్ని లోపలి నుండి కుళ్ళబొడుస్తున్నాయని గ్రహించడం లేదు.

ఈ రోజుల్లో అందరూ మామూలే అనుకుంటున్న, కానీ బంధాన్ని నాశనం చేస్తున్న ఆ అతిపెద్ద రిలేషన్ షిప్ తప్పుల గురించి రిలేషన్ షిప్ నిపుణులైన డాక్టర్ సన్ని గార్గ్, డాక్టర్ వర్తిక విశ్వాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియోలో తెలిపారు. ఆ తప్పులు ఏంటో ఇక్కడ చూడండి.
వాళ్లే ముందు కాల్ లేదా మెసేజ్ చేయాలి
గొడవ జరిగిన ప్రతిసారీ ఈగోకు పోయి నేనెందుకు ముందు తగ్గాలి? వాళ్లే సారీ చెప్పాలి అని సైలెంట్ అయిపోవడం నేటి జంటల్లో చాలా కామన్. కానీ రిలేషన్ షిప్ లో మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప సూత్రం ఉంది. ఒక బంధంలో ఎప్పుడూ నువ్వు వర్సెస్ మీ భాగస్వామి కాదు.. మీరిద్దరూ కలిసి సమస్యపై పోరాడాలి. ఈగోలను పక్కనపెట్టి సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుడుగు వేయడం ఓటమి కాదు, అది బంధంపై మీకున్న ప్రేమకు నిదర్శనం.
గొడవలో అరుచుకోవడం, హృదయాన్ని గాయపరిచే మాటలు
చాలామంది ఏదైనా గొడవ జరగగానే తక్షణమే దాన్ని తేల్చేసుకోవాలని అరుచుకుంటారు. కోపంలో నోటికి వచ్చినట్లు కఠినమైన, బాధపెట్టే మాటలు అనేస్తారు. కానీ ప్రతి గొడవను అప్పటికప్పుడే పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కాసేపు మౌనంగా ఉండి, ఇద్దరూ ప్రశాంతంగా మారే వరకు వేచి చూడటం అనేది చాలా ఆరోగ్యకరం. కోపం చల్లారాక మాట్లాడుకుంటే గొడవ సులభంగా సద్దుమణుగుతుంది.
వాట్సాప్ లో పెద్ద పెద్ద కోపంతో కూడిన మెసేజ్ లు
ప్రస్తుత జంటలు చేసే మరో అతిపెద్ద తప్పు ఇదే. కోపం రాగానే పేరాలు పేరాలుగా మెసేజ్ లు టైప్ చేసి పంపేస్తారు. కానీ టెక్స్ట్ మెసేజ్ లకు భావోద్వేగాలను పలికించే టోన్ ఉండదు. మీరు ఏ ఉద్దేశ్యంతో పంపారో, అవతలి వారు దాన్ని వేరేలా అర్థం చేసుకునే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల చిన్న అపార్థాలు పెద్దవిగా మారతాయి. గొడవలను ఎప్పుడూ మెసేజ్‌లలో కాకుండా.. ఫోన్ కాల్ ద్వారా గానీ లేదా నేరుగా కలుసుకుని గానీ పరిష్కరించుకోవాలి.
గతాన్ని తవ్వడం
ప్రస్తుతం జరుగుతున్న గొడవను వదిలేసి.. ఎప్పుడో గతంలో జరిగిన తప్పులను లాగి నువ్వు అప్పుడూ ఇంతే.. ఇప్పుడూ ఇంతే అని నిందించడం అత్యంత ప్రమాదకరం. ఇలా పాత విషయాలను తీసుకురావడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుంది. ఎప్పుడైనా సరే గతాన్ని వదిలేసి, ప్రస్తుత సమస్య మీద మాత్రమే దృష్టి పెట్టి దాన్ని కలిసి పరిష్కరించుకోవాలి.
నా మీద ప్రేమ ఉంటే నా మనసులోని మాట వాళ్లే అర్థం చేసుకోవాలి అనుకోవడం
నేను కోపంగా ఉన్నానని నా ముఖం చూసి వాళ్ళు కనిపెట్టాలి అని ఆశించడం, వాళ్లు అలా కనిపెట్టలేకపోతే మాటలు మానేసి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం పెద్ద తప్పు. మీ భాగస్వామి మీ మనసును చదివే యంత్రం కాదు. ఆరోగ్యకరమైన బంధానికి పారదర్శకమైన, నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ అవసరం. మీకేమనిపిస్తుందో అది స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోండి.



Click it and Unblock the Notifications