Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.!
వివాహ జీవితం ప్రారంభమయ్యాక మొదటి ఐదు సంవత్సరాలు దంపతులు కలిసి జీవించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదేళ్లు వారి జీవితంలో చాలా ముఖ్యమైనవని.. ఈసమయంలో వీలైనంత వరకూ విడిగా జీవించకూడదని సూచిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో వివాహ జీవితంలో కొన్ని అంశాలపై అవగాహన భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కొన్ని జంటల్లో వధువు తన అత్తామామలతో కలిసి జీవించడం సాధారణం. ఇక ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు అయితే కొన్ని సందర్భాల్లో భార్య కొంతకాలం పాటు స్వదేశంలోనే ఉండగా భర్త విదేశాలకు వెళాల్సి వస్తుంది. ఇది వారి మధ్య ఒక్కోసారి దూరాన్ని పెంచుతుంది. అయితే దంపతుల మధ్య ఇలా దూరం ఉండకూడదని రిలేషన్‌షిప్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. వివాహం తర్వాత దంపతులు మొదటి ఐదేళ్లు కలిసి జీవించడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఈ ఐదేళ్లలో వారి మధ్య జీవితంలో అవగాహన, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ అన్నీ పెంపొంది కలకాలం వారి బంధాన్ని బలోపేతం చేస్తాయి.

-
దాంపత్య జీవితంలో సంబంధం బలోపేతం కావడానికి భార్యాభర్తలకు వ్యక్తిగత స్వేచ్ఛ అవసరం. ఈ సమయంలో వారి మధ్య ప్రైవసీ కోసం తల్లిదండ్రులకు దూరంగా జీవించడం ద్వారా కొన్నిసార్లు సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఈ జనరేషన్‌లో ఉమ్మడి కుటుంబాల కంటే దంపతులు ఒంటరిగా జీవించడమే వారి దాంపత్యానికి మేలు చేస్తాయంటున్నారు.
-
వివాహ బంధంలో భార్య భావాలకు, కలలకు, అవసరాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని గమనించాలి. కుటుంబీకుల సంతోషంతో పాటు భార్య సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పెళ్లయిన కొత్తలో దొరికే ఈ ప్రేమ కలకాలం కొనసాగడానికి దోహదపడుతుంది.
- దంపతులు కొత్త జీవితం మొదలుపెట్టాక వారి మధ్య విశ్వాసం పెరగాలే తప్ప తగ్గకూడదు. ముఖ్యంగా భార్యకు ఆత్మవిశ్వాసం పెరిగేలా భర్త తోడ్పాటు ఉండాలి. ఆమె తన భావాలను వ్యక్తపరచగలిగే వాతావరణాన్ని కల్పించాలే తప్ప.. ఆమెపై నియంత్రణ ప్రదర్శించకూడదు.
-
ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలు, ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఏకాంత సమయంతో పాటు శృంగార సమయం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే పెళ్లయిన తొలినాళ్లలో వారి మధ్య నాణ్యమైన సమయం ఎక్కువ పాటు ఉండటం చాలా కీలకం. ఇందుకోసం వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవాలి.
-
ఎవరికైనా సరే వ్యక్తిగతంగా అభిప్రాయాలు, నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వివాహ బంధంలోనూ ఇది తప్పనిసరి. అందుకే భాగస్వామి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు. వారికి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి.
-
భార్యాభర్తల మధ్య భావోద్వేగ, శారీరక బంధానికి ఏకాంత సమయం అనేది చాలా కీలకం. ఇద్దరూ ఏకాంతంగా గడిపే సమయం దొరికితే వారి బంధంలో అవగాహన, సాన్నిహిత్యం పెంచుకునేందుకు వినియోగించుకోవాలి.
-
దాంపత్య జీవితం అన్న తర్వాత ఒకరిపై ఒకరికి జోక్యం ఉండాలి కానీ అది మితిమీరి ఉండకూడదు. ఎప్పుడూ పక్కనే ఉండాలనే ఒత్తిడి ఉండకూడదు. కొద్దిపాటి స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా మాత్రమే బంధం బలపడుతుంది.
-
ప్రతి దాంపత్య బంధంలోనూ ఇద్దరికీ కొంత ఒంటరి సమయం అనేది ఉండాలి. అంతేకాకుండా బాధ్యతలను కలిసి పంచుకోవాలి. బంధాన్ని బలపరుచుకోవాలి. దీని ద్వారానే జంటల మధ్య అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
Comments



Click it and Unblock the Notifications
