Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కొందరు మగాళ్లకి ఆడవాళ్లంటే ఎందుకంత వ్యామోహం.. ఒక్కరితో ఎందుకు సరిపెట్టుకోరు.?
సాధారణంగా కొందరు మగాళ్లు మహిళల పట్ల తీవ్ర వ్యామోహం కలిగి ఉంటారు. వారిలో కామవాంఛలు అధికంగా ఉండటంతో తమను తాము కంట్రోల్ చేసుకోలేరు. వీళ్లనే స్త్రీ లోలుడు అంటారు. ఒక్కరితో సరిపెట్టుకోలేరు. అయితే ఒక మగాడు వుమనైజర్‌గా మారడానికి చాలా కారణాలు ఉంటాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

కొందరు పురుషులు పెళ్లయినా సరే ఇతర మహిళలతో లైంగికంగా రిలేషన్ కొనసాగిస్తుంటారు. శారీరకంగా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇక బ్యాచ్‌లర్స్ సహజీవనం, లవ్ ఎఫైర్స్ ఇలా పలు రకాల రిలేషన్స్‌లో తమ కోరికలను తీర్చుకోవడం వింటూనే ఉన్నాం. అయితే కొందరిలో ఇది కేవలం శరీరంతో మాత్రమే ముడిపడి ఉంటుంది. వారితో ఎలాంటి భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకోలేరని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
పురుషుడు వుమనైజర్‌గా మారడానికి పలు బయోలాజికల్, సైకలాజికల్ కారణాలు ఉంటాయని.. ఇది కేవలం ఒక్క అంశానికి సంబంధించినది మాత్రమే కాదని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. దీంతో పనిచేసే చోట, బయటా శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటారు. అందుకు సంబంధించిన అంశాలపైనా బహిరంగంగా చర్చించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.
హార్మోన్ ఎఫెక్ట్
మగాళ్లలో లైంగిక కోరికలను టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్లు కామ వాంఛలను పెంచుకోవడం, అదుపులో ఉంచుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది. అయితే కొందరిలో ఈ హార్మోన్ స్థాయిలు పుట్టుకతోనే లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా వారిలో లైంగిక కోరికలు తీవ్రంగా ఉంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మానసిక కారణాలు
కొందరు మగాళ్లు చిన్న వయసులోనే మానసికంగా కోలుకోలేని గాయాలు ఎదుర్కొంటుంటారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ కోల్పోవడం, ప్రేమలో లేదా వైవాహిక జీవితంలో మోసపోయిన అనుభవాలు ఉన్నా వారిలో అభద్రతా భావం, ఒంటరితనం పెరుగుతుంది. దీంతో వారు మహిళల పట్ల ఆకర్షితులై వారితో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.
అశ్లీల చిత్రాలకు బానిస కావడం
కొందరు పురుషులు అశ్లీల చిత్రాలకు బాగా బానిస అవుతుంటారు. అదే పనిగా పోర్న్ వీడియోలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీంతో వారి మెదడులో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆ అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో స్త్రీ లోలుడిగా మారుతుంటారు.
మరికొందరు పురుషులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. కోపం, ఆనందం కొందరు ఎలా కంట్రోల్ చేసుకోలేరో అదేవిధంగా లైంగిక కోరికలను కూడా అదుపులో ఉంచుకోలేరు. దీంతో తక్షణ ఆనందం కోసం లైంగిక సంబంధాలపై ఆసక్తి చూపిస్తారు.
వైవాహిక జీవితంలో అసంతృప్తి
కొందరు పురుషులు ఎక్కువ మంది స్త్రీలను ఆకర్షించడం ద్వారా తన అహాన్ని తృప్తి పరుచుకోవాలి ఆరాటపడుతుంటారు. వారి ఎదుట మగతనాన్ని నిరూపించుకోవాలనే తాపత్రయపడుతుంటారు. మరోవైపు వైవాహిక జీవితంలో భార్యతో శారీరక, మానసిక సాన్నిహిత్యం కోల్పోవడం వల్ల కూడా బయటి ఆనందాలను కోరుకుంటారు.
మరికొందరు చెడు అలవాట్లు ఉన్న స్నేహితులను చూసి త్వరగా ప్రభావితులై తాము అలాగే ఉండాలని కోరుకుంటారు. విచ్చలవిడితనానికి అలవాటుపడటం కూడా ఇందుకు కారణంగా ఉండొచ్చు. అందుకే ఒక మగాడు వుమనైజర్‌గా మారడం అనేది మానసిక రుగ్మతగా పరిగణిస్తున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
