Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తరచూ కోపం, చికాకు.. ఎందుకిలా ఉంటోంది? కారణాలు ఏమై ఉండొచ్చంటే..
తరచూ చికాకు, కోపం వచ్చేస్తుంటే.. అసలు అలా ఎందుకు జరుగుతుందో మొదట తెలుసుకోవాలి. కోపం ఎక్కడ మొదలవుతుంది అనేది గుర్తించి అక్కడి నుండి పరిష్కారం వెతకడం ప్రారంభించాలి.
ఒక మనిషికి కోపం అనేక కారణాల వల్ల వస్తుంది. ఇంతకు ముందు మీ మనస్సును ప్రేరేపించే గాయాన్ని ఎదుర్కొని ఉండటం వల్ల కూడా కోపం రావొచ్చు. లేదా కొన్ని పరిస్థితులు కోపాన్ని తెప్పిస్తాయి. చికాకు కూడా ఇదే కోవలోకి వస్తుంది. మనకు నచ్చని పనుల వల్ల చికాకు, చికాకు నుండి కోపం వస్తుంది. అయితే కోపం వల్ల నష్టాలే తప్పా లాభాలు అంటూ ఏవీ ఉండవు. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిసి ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దానిని వ్యక్తులపై, వస్తువులపై చూపించినప్పుడే సమస్య మొదలవుతుంది. కొందరు వ్యక్తులు చీటికి మాటికి చికాకు పడుతుంటారు. కోపాన్ని ప్రదర్శిస్తారు.

మీక్కూడా తరచూ చికాకు, కోపం వచ్చేస్తుంటే.. అసలు అలా ఎందుకు జరుగుతుందో మొదట తెలుసుకోవాలి. కోపం ఎక్కడ మొదలవుతుంది అనేది గుర్తించి అక్కడి నుండి పరిష్కారం వెతకడం ప్రారంభించాలి.
అసలు చికాకు, కోపం తరచూ ఎందుకువస్తాయో ఇక్కడ ఉన్న కారణాలను పరిశీలిద్దాం.

ఒత్తిడితో కోపం:
ఒత్తిడి అసహనాన్ని తెస్తుంది. చికాకు వస్తుంది. ఆ చికాకు కోపంగా మారుతుంది. ఒక్క ఒత్తిడితో అనేక రకాల సమస్యలు ముడిపడి ఉంటాయి. మీరు ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తున్నా.. బిజినెస్‌లో ఒత్తిడి ఎదుర్కొంటున్నా, ఇంకేవైన కారణాలతో ఒత్తిడి ఎదుర్కొంటుంటే అది కోపంగా మారుతుంది.

కుటుంబ పరిస్థితులు:
కుటుంబ పరిస్థితులు మీరు ఎప్పుడూ కోపంగా ఉండేందుకు కారణం కావొచ్చు. తల్లిదండ్రులు, భార్యభర్తలు, తోబుట్టువులు, పిల్లల పనులు కోపం తెప్పించవచ్చు. అలాగే మీ తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి పిల్లలపై అరుస్తూ కొడుతూ ఉంటే.. ఆ పిల్లలు పెద్దవారు అయ్యాక వారిలాగే చేస్తారు.

గతం:
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. అందులో సుఖాలు ఉంటాయి, దుఃఖాలూ ఉంటాయి. అవి పదే పదే గుర్తుకు వస్తాయి. గతంలో జరిగిన కొన్ని ఘటనలు మాటిమాటికీ గుర్తుకు వచ్చి వాటి ద్వారా కోపం రావొచ్చు. గతంలో జరిగిన కొన్ని అవమానాలు, ఓటములు కూడా ఇప్పుడు కోపాన్ని కలిగిస్తాయి.

భారీ అంచనాలు:
కొందరు భారీగా అంచనాలు వేస్తుంటారు. అవి నిజజీవితంలో అందుకోగలమా లేదా అనే స్పృహ మొదట్లో ఉండదు. రోజులు గడిచే కొద్దీ ఆ భారీ అంచనాలు అందుకోలేక అసహనం మొదలవుతుంది. ఈ అసహనం కాస్త కోపానికి దారి తీస్తుంది. ఈ సమయంలో వారిని తడితే తీవ్రమైన కోపంతో విరుచుకుపడతారు.

తీరని దుఃఖం:
దుఃఖం లేని జీవితం ఎవరికుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలు, కష్టాలు పదే పదే గుర్తుకు వచ్చి బాధను, బాధతో పాటు కోపాన్ని తీసుకువస్తాయి.

మానసిక ఆరోగ్య పరిస్థితులు:
మీరు మానసిక ఆరోగ్య పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు, మీరు ఉన్నట్టుండి కోపం మరియు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో మీరు దూకుడుగా మారవచ్చు. కాబట్టి, మీరు మీ భావాలను లోతైన స్థాయిలో వ్యక్తీకరించడంలో, సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం అత్యవసరం.

నిద్ర లేకపోవడం:
తగినంత నిద్ర లేకపోవటం, నిద్ర లేమి, ఒక వ్యక్తి మరుసటి రోజు చిరాకుగా అనిపించవచ్చు. ఒక వ్యక్తి అన్ని వేళలా అలసిపోయినట్లు అనిపిస్తే లేదా నిద్రపోవడం వల్ల రిఫ్రెష్‌గా అనిపించడం లేదని గుర్తించినట్లయితే, వారికి నిద్రలేమి లేదా స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు ఉండవచ్చు.



Click it and Unblock the Notifications