Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.!
ప్రేమైనా, పెళ్లయినా కొత్త బంధం మొదలైనప్పుడు మొదట్లో అంతా అద్భుతంగా, ఎగ్జయింట్‌గా అనిపిస్తుంది. కానీ కాలం గడిచేకొద్దీ కొన్ని బంధాలు పాతబడినట్లుగా, బోర్ కొట్టినట్లుగా ఫీలవుతారు. భాగస్వాముల ప్రవర్తన ఒకరిపై మరొకరికి మారుతుంటుంది. మనస్పర్థలు ఏర్పడి ఇద్దరి మధ్యా అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో బంధం విచ్ఛినమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి పదే పదే మనస్పర్థలు, గొడవలు జరుగుతుంటే అది కేవలం మీ దురదృష్టం కాదని.. దీని వెనుక మీ మనస్తత్వం, బాల్యపు అనుభవాలు ఉండొచ్చని మనస్తత్వవేత్తలు అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై కొన్ని కారణాలను విశ్లేషించారు. బాల్యంలో మీ అనుభవాలు, ఇంటి వాతావరణం.. భవిష్యత్తులో మీ సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య ప్రేమను ఆస్వాదిస్తూ, ఇంటా బయటా గౌరవంగా పెరిగిన వారు తమ భాగస్వామిలోనూ అవే లక్షణాలను కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే బాల్యంలో వారున్న వాతావరణంలో కలహాలు చూసినవారు, ప్రేమరాహిత్య జీవితాన్ని గడిపిన వారు.. తెలియకుండానే తమలాంటి అనుభవాలు ఉన్న సంబంధాలవైపే ఆకర్షితులవుతారని అంటున్నారు.
మీ మనసు ఎల్లప్పుడూ ఎలాంటి భావాలతో నిండి ఉంటుందో.. అలాంటి భావాలపైనే మొగ్గు చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో ఇంట్లో నిత్యం కలహాలు, పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ లేకపోవడం, ఎప్పుడూ అల్లకల్లోల వాతావరణం చూసిన వారికి వయసు పెరుగుతున్న కొద్దీ అలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోతుంటారు. ఈ క్రమంలో మీకు భవిష్యత్తులో మిమ్మల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునే వ్యక్తి దొరికినా.. అది మీకు విసుగ్గా అనిపించి తెలియకుండానే ఆ బంధానికి మీరు దూరంగా ఉండిపోతారు. దీంతో మీరు కోపంగా, భావోద్వేగపరంగా దూరంగా ఉండే వ్యక్తులపైనే మీ మనస్సు మొగ్గు చూపుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలో మీరు కొన్నిసార్లు సందిగ్ధంలో పడిపోతారు. నిజమైన ప్రేమకు, గౌరవానికి మీరు అర్హులేనా కాదా అనే డైలామాలో ఉంటారు. దీంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఫలితంగా మీతో సరిగ్గా ప్రవర్తించని వారిని సైతం మీరు సహించి.. చెడు సంబంధాల్లో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. దీనినే విషవలయం అంటారు.
ఈ విషవలయం నుంచి బయటపడాలంటే ముందుగా మీ గత సంబంధాలను విశ్లేషించుకోవాలని నిపుణులు అంటున్నారు. మీ భాగస్వామిని ఎలా ఎంచుకున్నారు.. పదేపదే ఎలాంటి తప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవడం అవసరం. అవసరమైతే, స్నేహితుల నుంచి, మనస్తత్వవేత్తల నుంచి సహాయం తీసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.
వీటి కంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం ముఖ్యమని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే మీరు సరైన భాగస్వామిని ఎన్నుకునే పరిణతి వస్తుందని సూచిస్తున్నారు. భాగస్వామితో బంధంలో కొత్త జీవితాన్ని ఎంత ఉత్సాహంగా ప్రారంభిస్తారో.. అదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. బాధించే విషయాలు, గత చేదు జ్ఞాపకాలను వీలైనంతగా దూరంగా ఉంచాలి.

ఒకవేళ మీరు గత చేదు జ్ఞాపకాలతో సతమతం అవుతున్నట్లయితే వాటిని మీ భాగస్వామితో పంచుకోవడం ద్వారా కొంతైనా ఊరట పొందుతారు. క్లిష్ట పరిస్థితుల్లో వారి సహాయం మీకు కొండంత అండగా నిలుస్తుంది. సరైన భాగస్వామిని ఎన్నుకోవడం ద్వారా జీవితం పరిపూర్ణంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications