Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
భార్యపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా.?.. మీరు అస్సలు ఊహించని షాకింగ్ నిజాలు ఇవే.!
ప్రేమ, దాంపత్యం బంధం ఏదైనా సరే కొన్ని కారణాల వల్ల జంటల మధ్య క్రమంగా ప్రేమ తగ్గిపోతుంటుంది. రిలేషన్ ఆరంభంలో ఉన్న ప్రేమ, ఆసక్తి తర్వాత కనిపించవు. దీంతో ఒకరిపై మరొకరికి అభద్రతా భావం ఏర్పడుతుంది. అయితే భాగస్వామిపై ఆకస్మికంగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని సైకాలజిస్ట్, కౌన్సిలర్ విజయ పెద్దిన చెబుతున్నారు.

దాంపత్య బంధంలో కొన్నిసార్లు భార్యపై భర్తకు ఆసక్తి తగ్గిపోవడానికి గల కారణాలను ఇటీవల ఓ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చేసిందని సైకాలజిస్ట్ విజయ పెద్దిన పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న కొన్ని మార్పుల కారణంగా మగవారికి ఆడవాళ్లపై ఇంట్రెస్ తగ్గుతుందని అధ్యయనంలో వైల్లడైందన్నారు. దీనిపై సర్వే చేయగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అవేంటంటే..
భార్య లేదా భర్త.. వివాహ బంధంలో ఒకరికొకరు బలంగా మారాలి. అంతేకానీ బలహీనత కాకూడదు. భాగస్వామి మాట తీరు, ప్రవర్తన, వారి మాటల్లో, చేతల్లో ఎనర్జీ ఇవన్నీ ఎదుటి వ్యక్తికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. భాగస్వామి తమ భావోద్వేగాలను ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు.. కోపం, చిరాకు, ప్రేమ, ఆత్మీయతను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారనేది దాంపత్య బంధంలో ఒకరిపై మరొకరికి ఆసక్తి పెరగడానికి, తగ్గడానికి దారితీస్తుంది.
అధ్యయనం ప్రకారం.. భాగస్వామిపై ఇంట్రెస్ట్ అనేది భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది. అయితే మగవారి విషయంలో ఈ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ భర్త అయినా భార్య నుంచి గౌరవం, మర్యాద కోరుకుంటారు. అయితే భార్య నుంచి ఆ రెస్పెక్ట్ తగ్గినట్లయితే దానిని మగవారు స్వీకరించలేకపోతున్నారు. అది వారిని మనస్తాపానికి గురిచేస్తుంది.
నెగిటివిటీ
కుటుంబ కలహాలు, ఇంటి బాధ్యతల్లో ఒత్తిళ్లు కారణాలు ఏవైనా భర్త బయట నుంచి ఇంటికి రాగానే ఆ విషయాలను భర్తపై రుద్దడం, ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలతో ఉండటం, ఏ విషయమైనా నెగిటివ్‌గా మాట్లాడటం ద్వారా భర్తలో భావోద్వేగ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఫలితంగా భార్యపై అభిప్రాయం మారి వారి మధ్య ప్రేమ తగ్గేలే చేస్తుంది. ఇది ఇద్దరి మధ్య ఏకాంత సమయానికి భంగం కలిగిస్తుంది.
పోలిక, విమర్శలు
భర్త ఉద్యోగాన్ని, ఆర్థిక పరిస్థితులను, లక్షణాలను ఇతరులతో పదే పదే పోల్చడం కూడా వారిలో భార్యపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తుంది. పదే పదే విమర్శించడం, అసంతృప్తి చెందడం వంటివి మగవారు మనసుకి తీసుకోలేకపోతున్నారని అధ్యయనంలో తేలిందని విజయ అన్నారు. మరీ ముఖ్యంగా ఇంటి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు, నిర్ణయాల్లో ఇద్దరి మధ్య తమదే పై చేయి కావాలనుకోవడం, తాను చెప్పిందే జరగాలని ఆశించడం వంటివి కూడా భర్తను మానసికంగా కుంగదీస్తాయని.. ఇది భార్యపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
అయితే ఇవన్నీ కేవలం భార్య విషయంలోనే కాదు.. భార్యపై భర్త కూడా ఇలాగే ప్రవర్తించినా అది వారి దాంపత్య బంధంలో లోతైన అగాధాన్ని ఏర్పరుస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ మర్యాదతో మెలగడం ద్వారా ప్రతి రోజూ ప్రేమ మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు. దాంపత్య బంధంలో నమ్మకం, ప్రేమ, పరస్పర అవగాహన కీలకం. చిన్న చిన్న పొరపాట్లు, మనస్పర్థలను సరిదిద్దుకోవడం ద్వారా భాగస్వామిపై ఆసక్తి పెరుగుతుందే తప్ప తగ్గదు. వారి మధ్య ఎప్పుడూ సంతోషాన్ని పంచే విషయాలే చర్చించుకోవాలి కానీ.. మనస్తాపానికి, బాధకి గురిచేసే నెగిటివ్ ఆలోచనల జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
