Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
ఓ తల్లి..తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయిన ఘటన గత వారం పెద్ద హైలెట్ అయిన విషయం తెలిసిందే. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపి భర్తతో సంతోషంగా ఉండాలని దీవించాల్సిన తల్లి ఆమె కాబోయే భర్తతోనే పెళ్లికి 10 రోజుల ముందు జంప్ అవడం దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ వచ్చింది.
అలీఘర్ సిటీలోని దాదోన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని నివసించే సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. పెళ్లి వయస్సుకి వచ్చిన తమ కూతురు శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6,2025న 40 ఏళ్ల సప్న..తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్ తో జంప్ అయింది.

తన కూతురు శివానీకి పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి కాబోయే అల్లుడితో ఫోన్ లో సప్నా గంటలపాటు మాట్లాడేదని, ఇంట్లో ఉన్న 3.5 లక్షల రూపాయల డబ్బు, 5 లక్షల రూపాయల విలువైన నగలతో కాబోయే అల్లుడితో తన భార్య పారిపోయిందని ఆమె భర్త జితేంద్ర కుమార్,కూతురు శివానీ ఆ సమయంలో చెప్పారు. కట్ చేస్తే ఏప్రిల్ 16న సప్నా,రాహుల్ కుమార్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు.
కూతురికి కాబోయే భర్తతో ఎందుకు లేచిపోవాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని,తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని..తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని..అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సప్న తెలిపింది.ఏది ఏమైనా కూడా తాను రాహుల్ తో జీవిస్తానని,అతడిని పెళ్లి చేసుకుంటానని సప్నా తెలిపింది. తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు,బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్,రూ.200 మాత్రమే ఉన్నట్లు సప్న చెప్పింది.
తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్ లో నన్ను ఈ రోజు కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని..దీంతో తాను అక్కడికి వెళ్లానని..ఆ తర్వాత ఇద్దరం లక్నో వెళ్లామని..అక్కడి నుంచి ముజఫర్ ఫూర్ వెళ్లామని రాహుల్ చెప్పారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు.
అయితే ఇప్పుడు సప్నాని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు..అలాంటిదేమీ లేదని రాహుల్ మొదట చెప్పాడు..అయితే మళ్లీ కొద్దిసేపటి తర్వాత చేసుకుంటా అని రెండు రకాలుగా చెప్పాడు. అయితే సప్నని తిరిగి ఇంట్లోకి రానిచ్చేది లేదని, తీసుకెళ్లిన డబ్బు, నగలు తిరిగిచ్చేస్తే చాలు అని ఆమె కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. భర్త తాగొచ్చి కొడుతున్నాడు అని సప్న చెప్పిన మాటలు మొత్తం పచ్చి అబద్దమని సప్న తమ్ముడు దినేష్ చెప్పారు.



Click it and Unblock the Notifications