Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే..
భారతదేశంలో వివాహం అంటే నూరేళ్ల పంట.. ఏడు జన్మల బంధం అని బలంగా నమ్ముతారు. కానీ, మారుతున్న ఆధునిక జీవనశైలి, టెక్నాలజీ పుణ్యమా అని ఈ పవిత్ర బంధం వెనుక ఓ నిశ్శబ్ద డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. జీవిత భాగస్వామికి తెలియకుండా సీక్రెట్ డేటింగ్ కోసం వెతుకుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి వివాహేతర డేటింగ్ యాప్ అయిన గ్లీడెన్(Gleeden)లో ఏకంగా 40 లక్షలకు పైగా భారతీయులు చేరడం ఈ ఊహించని మార్పుకు అద్దం పడుతోంది.

బెంగళూరు, హైదరాబాద్ లే టాప్..
గ్లీడెన్ ప్లాట్ ఫామ్ గణాంకాల ప్రకారం..ఇందులో ఉన్నవారిలో 65 శాతం మంది పురుషులు కాగా, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. భారతీయుల సీక్రెట్ డేటింగ్ లో.. బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది ఇక్కడి నుంచే ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతం యూజర్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత ఢిల్లీ(11 శాతం), ముంబై (9 శాతం), పూణే (7 శాతం) నగరాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ ట్రెండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. లక్నో, చండీగఢ్, పాట్నా, సూరత్, భువనేశ్వర్ వంటి టైర్-2 నగరాలకు కూడా వేగంగా పాకుతోంది.
మహిళల అనూహ్య స్పందన
గత రెండేళ్లలో గ్లీడెన్ లో చేరిన మహిళల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగింది. మహిళలు తమ ఎంపికల విషయంలో ఎంత స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారో ఈ గణాంకాలు చెబుతున్నాయని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడ్డెల్ తెలిపారు. దీన్ని బట్టి భారతీయులు ఆధునిక సంబంధాలను ఎలా చూస్తున్నారనే దానిపై ఓ పెద్ద సాంస్కృతిక మార్పు జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
లంచ్ బ్రేక్ లవ్ స్టోరీలు!
ఈ యాప్ లో యూజర్లు గడుపుతున్న సమయం కూడా ఆసక్తికరంగా ఉంది. సగటున రోజుకు గంట నుంచి గంటన్నర పాటు ఇందులో చాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య (లంచ్ బ్రేక్ సమయంలో), ఆ తర్వాత రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు యాప్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది.
ఇక భాగస్వాముల ఎంపిక విషయానికొస్తే.. పురుషులు ఎక్కువగా 25-30 ఏళ్ల వయసున్న మహిళల కోసం వెతుకుతుండగా, మహిళలు మాత్రం 30-40 ఏళ్ల వయసున్న పురుషులకు ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి ఆర్థిక స్థిరత్వం ఉన్న నిపుణులకే మహిళలు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.
మారుతున్న బంధాల స్వరూపం
ఒకప్పుడు డేటింగ్ యాప్ లు అంటేనే వింతగా చూసిన సమాజం మనది. కానీ నేడు గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా ఉన్న ప్లాట్ ఫామ్ ల వైపు లక్షలాది మంది అడుగులు వేయడం భారతీయ సంబంధాల స్వరూపం ఎంతలా మారుతోందో సూచిస్తోంది.



Click it and Unblock the Notifications